Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

మనసు పడిన చెలికాడే వదిలేస్తే… ఈ వేణువు ఎలా పలికేది..?

October 15, 2025 by M S R

.

shanthi ishaan…  SD బర్మన్ పాటలన్నింటిలోకీ ఏ పాట ఇష్టం అంటే నేను తడుముకోకుండా చెప్పే జవాబు Abhimaanలోని Piya Bina!

తను ప్రాణంగా ప్రేమించే భర్త అకారణంగా తనను ద్వేషించడాన్ని ఆ భార్య తట్టుకోలేదు. గొప్ప గాయని అయిన ఆవిడ తన బాధను, విరహాన్ని ఈ పాట రూపంలో ప్రకటిస్తుంది.

Ads

ఈ సందర్భానికి తగ్గట్లుగా SD బర్మన్ స్వరకల్పన చేస్తే లతా మంగేష్కర్ అంతే హృద్యంగా పాడారు. అతి తక్కువ వాయిద్యాలు వాడే సచిన్ దా పాటల్లో మురళి తప్పనిసరిగా వినిపిస్తుంటుంది. Piya Bina పాటైతే మురళి చుట్టే తిరుగుతుంది- సంగీతపరంగా, సాహిత్యపరంగా!

Piya bina piya bina basiya baje na baje na
ఇదీ పల్లవి.
ప్రియుడు చెంత లేనిదే వేణువు మోగదు!
Basiya అంటే bansi, అంటే వేణువు.

వేణువు అంటే ఆవిడ మనసు కావచ్చు, ఆ మనసులో నుంచి పుట్టుకొచ్చే పాట కావచ్చు. ప్రియుడు విడిచి పెట్టి పోతే వేణువంటి తన గుండె మూగబోతుందట.

హృదయాన్ని హత్తుకునే ఈ లిరిక్స్ రాసింది మరెవరో కాదు మజ్రూ సుల్తాన్ పురి! Basiya అంటూ ఆయన రాసిన మాటను పట్టుకుని ఎస్డీ బర్మన్ తన పాటకు వెదురు రవంతోనే ప్రాణం పోశారు. ఈ పాటలో మొదటి నుంచి చివరి వరకు లతాజీ స్వరంతో సమానంగా వేణుగానం గుండెను పిండేస్తుంటుంది.

Piya aise rooth ke honton se mere sangeet rootha
ఒక గాయనికి సంగీతమే ప్రాణం. మరి ఆ సంగీతమే తన మీద అలిగి పెదాల నుంచి తప్పుకుంటే? ఆ బాధ చెప్పనలవి కాదు కదా! భర్త అలిగితే ఆ భార్య పడే వేదన కూడా అంతే!

Kabhi jab main gaoon lage mere man ka har geet jhootha
Aise bichde mose rasiya
ఏదో రకంగా పాడాలని ప్రయత్నించినా తన మనసు పాడే ఏ పాటా నిజమనిపించడం లేదట. ప్రాణానికి ప్రాణమైన వాడు విడిచిపెట్టి పోయాడు కదా!

Tumhari sada bin nahin ek sooni mori nagariya
నీ పిలుపన్నదే లేక నా ప్రపంచమంతా శూన్యంగా మారిపోయింది.

Ke chup hai papiha mayur bol bhoole ban mein sanwariya
కోయిల మిన్నకుంది. అడవిలో నెమలి మాటలే మరిచింది.

Din hai soona sooni ratiya
నా పగళ్ళు ఒంటరితనంతో శూన్యంగా మారాయి. రాత్రిళ్ళలోనూ అదే శూన్యం.

మజ్రూ సుల్తాన్ పురి రాసిన ఈ పదాలకు ఎస్డీ బర్మన్ కూర్చిన బాణీ లతా మంగేష్కర్ గొంతులో గొప్ప విషాదాన్ని పలికించింది. జయా భాదురి అంతే అద్భుతంగా ఆ విషాదాన్ని అభినయించారు. కాబట్టే ఈ పాట హిందీ సినీ జగత్తులో మేలి ముత్యంగా నిలిచింది.

SD బర్మన్, మజ్రూ సుల్తాన్ పురి కాంబినేషన్ లో వచ్చిన దాదాపు అన్ని పాటలూ ఇంతే గొప్పగా ఉంటాయి. విశేషమేమంటే ఈ ఇద్దరు ఉద్దండులు పుట్టింది ఒకే రోజున. అది అక్టోబర్ 1. (ఎస్డీ బర్మన్ 1906లో పుడితే మజ్రూ సుల్తాన్ పురి 1919లో పుట్టారు). అందుకే ఇద్దరికీ అంత బాగా కుదిరిపోయిందేమో!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఈ ప్రభుత్వ శాఖ తరఫున ఆంధ్రజ్యోతికి భారీ అభిమాన ప్రకటన…
  • ‘రూల్స్ నాకు తెలుసు!’— ఓవర్ స్మార్ట్ పిల్లలకు ఉదాహరణ ఈ కేబీసీ పిల్లాడు…
  • మనువాద లొంగుబాట్లు Vs బహుజన లొంగుబాట్లు… ఏమిటీ లెక్కలు..!?
  • లోకం మరీ చెడ్డదేమీ కాదు… చీకటిలో కూడా ఎవరో ఒకరు వెలుగై వస్తారు…
  • తెలంగాణ పోలీసు శాఖలో మహిళా ఐపిఎస్‌కు ప్రాధాన్యపీఠం..!!
  • మళ్లీ ముంబై మాఫియా తెర మీదకు దావూద్ డీ-కంపెనీ పేరు..!!
  • ప్రతి సైనికుడి సతీమణి… కనిపించని ఒక వీర పతకం…
  • ఆరేళ్లు… మూడు టెస్టులు… ఒకే ఒక పరుగు… ‘ఆట పట్టు’ చిక్కింది…
  • మనసు పడిన చెలికాడే వదిలేస్తే… ఈ వేణువు ఎలా పలికేది..?
  • మువ్వగోపాలుడు… బాలయ్య మార్క్ రొటీన్ ఫార్ములా మాస్ మసాలా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions