.
రాత్రి మూడు గంటలు…
ఐ–70 హైవే దగ్గరలోని ఓ పెట్రోల్ బంక్…
దాదాపు పన్నెండు గంటలుగా బైక్ నడిపి అలసిపోయిన అతను — గ్రిజ్…
అలసటతో కాఫీ కోసం ఆగాడు… కానీ ఆ రాత్రి ఆ చిక్కటి కాఫీ కన్నా గట్టిగా అతని గుండె కొట్టుకునేలా చేసిందొక శబ్దం…
మగవారి గొంతులు…
మొదట ఏవో కమర్షియల్ సౌండ్స్ లా అనిపించాయి…
తర్వాత ఆ మాటల్లో “ఎంత కావాలో చెప్పు..? డెన్వర్‌కి తీసుకెళ్తా..” అనే పదాలు వినిపించాయి…
తర్వాత… ఒక చిన్న అమ్మాయి వణుకుతున్న స్వరం… “ప్లీజ్… నా అమ్మ ఎదురు చూస్తుంది… ఆమెకి ఫోన్ చేయనివ్వండి…”
Ads
తర్వాత ఒక్క చెంప దెబ్బ శబ్దం…
గ్రిజ్ సన్నగా వణుకు పుట్టింది… వాష్‌రూమ్ గోడ ఆవల ముగ్గురు మగవాళ్లు —
మరొక అమ్మాయిని జంతువుల మాదిరి వేలం వేస్తున్నారు…
అమ్మాయి వయసు — పద్నాలుగు, మహా అయితే పదిహేనేళ్లు…
ఆ వాణిజ్యం పేరు — మానవ వ్యాపారం…
తలుపు తెరుచుకుంది… వాళ్లు ఆమెను బయటికి లాగారు…
గ్రిజ్ కళ్ళలోకి ఆమె కళ్ళు చూశాయి — తడిగా, విరిగిపోయిన కళ్ళు…
అతనికి రెండు మాటలు మాత్రమే వినిపించాయి. “Help me…”
ఏడు సెకండ్లు…
అంతలోనే నిర్ణయం తీసుకోవాలి…
జీవితం మారిపోతుందో, లేదా ముగుస్తుందో — కానీ అతను ఆగలేదు…
అతను మెల్లిగా చెప్పాడు —
“పది వేల క్యాష్ ఇస్తా. ఇప్పుడే…”
గదిలో నిశ్శబ్దం…
వాళ్లు తడబడ్డారు — వెంటనే తుపాకులు తీశారు…
ఒకటి గ్రిజ్ తల మీద పడ్డది…
చీకటి…
తర్వాత అతను లేచాడు — చవకైన డిస్ఫెక్టెంట్ వాసనలో, తలపై బండ గాయం, ఖాళీ పర్స్…
కానీ ఆ అమ్మాయి — మాయా — కనిపించలేదు…
గ్రిజ్ కళ్ళల్లో ఇప్పుడు ఒక్కటి మాత్రమే ఉంది — కోపం…
“పోలీసుల సాయం కోరే సమయం లేద,” అనుకున్నాడు. “నేనే చూసుకుంటా…”
తన బైక్ మీద ఎక్కాడు…
ఫోన్‌లో తన బైకర్స్ క్లబ్ ప్రెసిడెంట్‌కి కాల్ చేశాడు…
“I need all of them… Westbound on I-70… White van… Missouri plate..s. Girl, maybe fifteen…”
అంతే… వందల మైళ్ళ దూరంలోని మోటార్‌సైకిళ్లు స్టార్టయ్యాయి…
బ్రదర్స్ రోడ్డంతా జాలం వేశారు — టోపీకా, సలినా, కొలరాడో బోర్డర్ వరకు…
మూడు గంటల తర్వాత చివరి కాల్ వచ్చింది…
“దొరికారు Grizz… Truck stop వద్ద ఉన్నారు…”
గ్రిజ్ అక్కడికి చేరేసరికి — ఇరవై హార్లీలు రోడ్డంతా గోడలా నిలబడ్డాయి…
అక్కడ భయం పుట్టే మౌనం…
వాన్ దగ్గర ముగ్గురు మగవాళ్లు, లోపల మాయా…
గ్రిజ్ దగ్గరికి వెళ్లి తన డబ్బు తిరిగి తీసుకున్నాడు…
తర్వాత వాన్ తలుపు తెరిచాడు —
“భయపడకు… నువ్వు సేఫ్” అన్నాడు ఆమెతో…
ఆ అమ్మాయి మెల్లిగా అతని చేతిని పట్టుకుంది…
పలచని, పక్షిపిల్లలాగా చేతి ఎముకలు…
ఆ రాత్రి నుంచి ఆమె పేరు మాయా…
బైకర్స్ పోలీసులు కాల్ చేయలేదు…
“కాప్స్‌కు రూల్స్ ఉంటాయి… మాకు ఫలితం కావాలి…”
వాళ్లను వదిలారు — కానీ కేవలం బట్టలతో … వాన్, డబ్బు, అన్నీ మాయాకే…
మాయాను ఒక మోటెల్‌కి తీసుకెళ్లి ఆమె గాయాలు శుభ్రం చేశారు…
సారా అనే నర్స్ ఆమెకు సూప్ ఇచ్చి, బ్లాంకెట్ కప్పింది…
చాలా సేపు మాయా ఒక్క మాట కూడా మాట్లాడలేదు…
తర్వాత కన్నీళ్లతో చెప్పింది —
“వాళ్లు చెప్పారు… నా అమ్మ నన్ను అమ్మేసిందని… కానీ ఆమె అలా చేయదు…”
గ్రిజ్ నవ్వాడు… “అయితే, మనం ఆమెను వెతికి కనుక్కుంటాం…”
రెండు రోజుల్లోనే బ్రదర్స్ ఆ తల్లిని కనుగొన్నారు — ఇల్లినాయిస్‌లో, ఫ్లయర్లు అతికిస్తూ, ఏడుస్తూ ఉన్న తల్లి…
ఆమె ఇంటి గేటు ముందు ఆర్వీ ఆగింది…
తలుపు తెరిచింది మాయా…
తల్లి ఆమెను చూసి పరుగెత్తింది —
అక్కడ మాటలు లేవు, కన్నీళ్ళు మాత్రమే…
గ్రిజ్ వెనక్కి తిరిగి తన బైక్ ఎక్కబోతుండగా, మాయా పరుగెత్తి వచ్చి అతన్ని కౌగిలించుకుంది.
“Thank you… you’re like a grizzly bear” అంది…
అతను నవ్వి అన్నాడు —
“Just a guy on a bike, kid…”
మోటార్ గర్జనతో రోడ్ మీద కలిసిపోయాడు గ్రిజ్…
.
ముచ్చటగా ముగింపు…..
ప్రపంచం చెడ్డదేమీ కాదు… రాత్రి మూడు గంటల చీకటిలో కూడా — ఎవరో ఒకరు వెలుగై వస్తారు…
(సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టు ఆధారం... )
Share this Article