.
1) అగ్నిపరీక్ష అనే తలతిక్క తంతుతో కామనర్లను బిగ్‌బాస్ హౌజులోకి ప్రవేశపెట్టడం, వాళ్లలో మెజారిటీ జనం తిరస్కరణకు గురై బయటికి పంపించేయబడటం..!
2) ప్రజాభిప్రాయం మేరకే ఎలిమినేషన్లను బిగ్ కవరింగులు ఇస్తూ… శ్రీజను అన్యాయంగా బయటికి పంపించేయడం… ఇమ్మూకు కాపాడే పవర్, తనూజకు కాపాడే పవర్.., మరిక ప్రజాభిప్రాయం, వోటింగు దేనికి..? జనాన్ని మభ్యపెట్టడం కాకపోతే…!
Ads
3) హౌజులో ఉన్నవాళ్లతో వినోదం సాధ్యం కావడం లేదనే నిజం అర్థమై, నాలుక కర్చుకుని, ఈసారి రమ్య, మాధురి, ఆయేషా వంటి కంట్రవర్సీ కేరక్టర్లను తీసుకొచ్చారు… ప్చ్, వేస్ట్ అని ప్రేక్షకులు తీర్మానించుకుని రమ్యను పంపించేశారు, ఆయేషా తనే వెళ్లిపోయినట్టుంది, కనిపించడం లేదు… (హెల్త్ ఇష్యూస్)…
4) సో, ఏం వేషాలు వేసినా, ఏం ప్రయోగాలు చేస్తున్నా… అవి ఎదురుతంతున్నాయి… ఇప్పుడిక ఏం చేశారు..?
5) ఆల్రెడీ జనం తిరస్కరించిన వాళ్లను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చారు… శ్రష్టి తప్ప మిగతా వాళ్లు… అందులో హరీష్ వంటి తిక్క కేరక్టర్లు… వాళ్లు హౌజులో ఉన్నవాళ్లను నామినేట్ చేయాలట… ఆల్రెడీ వీళ్లు వేస్ట్ అని బయటికి పంపిస్తే, ఇంకా వాళ్లకు నామినేట్ చేసేంత విలువ ఏమున్నట్టు..? ఇది మరో తిక్క ప్రయోగం…
6) తనూజ భలే రిటార్ట్ ఇచ్చింది హరీష్‌కు… నీ ఆటతీరు సరిగ్గా లేదు అని హరీష్ ఏదో చెప్పబోతే… అందుకే నువ్వు బయటికి వెళ్లావు, నేనిక్కడ ఉన్నాను అంటూ బలమైన చురక అంటించింది… నిజం… హౌజులో ఉన్నప్పుడే ఎవరినీ జడ్జి చేసే మెరిట్ లేక, ఓ మూల కూర్చుంటూ, టాస్కులు- ఎంటర్‌టెయిన్‌మెంట్ ఏమీ పట్టకుండా, ఒంటరిగా గడిపిన తనకు తనూజను జడ్జి చేసే అర్హత ఉందా..?
7) తనను మళ్లీ హౌజులోకి తీసుకొచ్చి, ఎవరో ఒకరిని నామినేట్ చేసెయ్ అని హక్కు కల్పించడం బిగ్‌బాస్ క్రియేటివ్ మరో తిక్క ఆలోచన… విఫల ప్రయోగాలు…
8) కొత్తగా హౌజులోకి వచ్చిన వాళ్లలో (ఫైర్ స్టామ్) ముగ్గురు మగ జెంట్స్ హోప్ లెస్‌గా కనిపిస్తున్నారు… ఇప్పుడు హౌజులో ఉన్నవాళ్లలో (పాత వాళ్లు, కొత్త ఎంట్రీలు కాదు) డెఫినిట్‌గా తనూజ బెటర్… ఎమోషన్స్, టాస్కులు, గేమ్స్, ఎక్స్‌ప్రెషన్, కన్విన్సింగ్ వాదన… ప్రతి దాంట్లో ఆమె తనదైన ముద్ర వేస్తోంది… తన పట్ల నెగెటివ్‌గా కుట్రలు చేస్తున్నారు అని నాగార్జునతో ఒకరిద్దరి గురించి చెప్పించినా ఆమె పాజిటివ్‌గానే వ్యవహరిస్తోంది…

9) అసలు ఆమె విజేత ఎందుకు కాకూడదు, ఎప్పుడూ మగ జెంట్స్ మాత్రమే తోపులా..? ఒక ఓటీటీ సీజన్‌లో బిందు విజేత అయినట్టుంది… ఈ టీవీ 9వ సీజన్‌లో ఓ లేడీ కంటెండర్, అదీ అర్హురాలు విజేత అయితే తప్పేముంది..? అఫ్‌కోర్స్, బిగ్‌బాస్ ఎలిమినేషన్లు, గెలుపులు అన్నీ స్క్రిప్టెడ్, ముందస్తు ఒప్పందాలే కదా, ఇక చూడాలి…
10) ఆమె తరువాత బలమైన పోటీదారుల్లో ఇమాన్యుయేల్ ఉంటాడు… అఫ్‌కోర్స్ సుమన్ శెట్టి కూడా పోటీయే… ఏమో, బిగ్‌బాస్ తిక్కదనం… శ్రీజను, హరీష్‌ను రీఎంట్రీ చేయించి, కొనసాగించి, చివరకు హరీష్‌ను విజేతను చేసినా చేస్తాడు… ఎందుకంటే..? ఈసారి రణరంగం కాదు, చదరంగం కాదు… అంతా అడ్డదిడ్డం, గందరగోళం కాబట్టి..!!
Share this Article