Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ఒక అధ్యాయం సమాప్తం..!!

October 30, 2025 by M S R

.

అయోధ్య గుడి నిర్మాణం పూర్తయింది… ప్రాణప్రతిష్ట సమయానికి కేవలం గ్రౌండ్ ఫ్లోర్, గర్భగుడి మాత్రమే సిద్ధం కాగా… మిగిలిన అన్ని దశల నిర్మాణాలూ పూర్తయినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది…

నవంబరు 25న ప్రధాని మోడీ ధ్వజారోహణానికి హాజరు కానున్నాడు… దాంతో గుడి నిర్మాణం పూర్తయినట్టు సంకేతం… ప్రస్తుతం మొదటి అంతస్తు, ఇతర ముఖ్య నిర్మాణ పనులన్నీ పూర్తి చేశారు… ఇందులో ఆరు అనుబంధ దేవాలయాలు… మహాదేవ్, గణేశ్ జీ, హనుమాన్ జీ, సూర్యదేవ్, మా భగవతి, మా అన్నపూర్ణలకు అంకితం చేయబడ్డాయి…

Ads

రామాయణంతో సంబంధం ఉన్న ఏడుగురు ప్రముఖుల పేరిట, భక్తుల సౌకర్యార్థం నిర్మించిన ఏడు మండపాలు కూడా పూర్తయ్యాయి… ఇవి మహర్షి వాల్మీకి, వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య, నిషాదరాజ్, శబరి, అహల్యలకు అంకితం చేయబడ్డాయి…

మిగిలినవి… సంత్ తులసీదాస్ మందిరం… ప్రాంగణంలో జటాయువు, ఉడుత విగ్రహాలను ఏర్పాటు చేశారు… ఆలయం చుట్టూ భక్తుల సౌకర్యార్థం రోడ్ల నిర్మాణం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు, 10 ఎకరాల పంచవటి ప్రాంతంలో ల్యాండ్‌స్కేపింగ్ (పచ్చదనం) పనులు పూర్తయ్యాయి…

భక్తుల దర్శనానికి సంబంధం లేని కొన్ని పనులు ఇంకా జరుగుతున్నాయి… 3.5 కిలోమీటర్ల పొడవైన ప్రహరీ గోడ (Boundary Wall), ట్రస్ట్ కార్యాలయం, అతిథి గృహం (Guest House), ఆడిటోరియం మొదలైనవి…

గుడి నిర్మాణం ఒకెత్తు.., అయోధ్యను ఓ అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడానికి తగిన మౌలిక వసతుల నిర్మాణం మరో ఎత్తు… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వసతులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి…

అంతర్జాతీయ విమానాశ్రయం (మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయం, అయోధ్య ధామ్), పునరుద్ధరించబడిన రైల్వే స్టేషన్ (అయోధ్య ధామ్ జంక్షన్) తో పాటు, భక్తులు, పర్యాటకుల కోసం అయోధ్యలో అనేక వేల కోట్ల రూపాయల విలువైన సమగ్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి జరిగింది…

 మెరుగైన రోడ్లు , కనెక్టివిటీ… 

అయోధ్య పట్టణంలో ప్రయాణాన్ని సులభతరం చేయడానికి, రద్దీని తగ్గించడానికి (Decongest) చారిత్రక మార్గాలను విస్తరించి, కొత్త రోడ్లుగా అభివృద్ధి చేశారు…

  • రాం పథ్ (Ram Path): ఇది సహదత్‌గంజ్ నుండి కొత్త ఘాట్ వరకు విస్తరించి, పట్టణంలో కీలకమైన కనెక్టివిటీని అందిస్తుంది…
  • భక్తి మార్గ్ (Bhakti Path): అయోధ్య ప్రధాన రహదారి నుండి హనుమాన్ గర్హి మీదుగా శ్రీరామ జన్మభూమి ఆలయం వరకు భక్తులు సులభంగా చేరుకోవడానికి ఈ మార్గాన్ని అభివృద్ధి చేశారు…
  • ధర్మ మార్గ్ (Dharma Path): ఇది NH-27 నుండి నయా ఘాట్ వరకు కలుపుతుంది…
  • అయోధ్య బైపాస్ ప్రాజెక్ట్: 67.57 కి.మీ. పొడవు గల ఈ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టు, లక్నో, బస్తీ, గోండా వంటి ముఖ్య జిల్లాలను కలుపుతూ అయోధ్య నగరంలో సరకు రవాణా రద్దీని తగ్గిస్తుంది…

రవాణా, పార్కింగ్… 

  • ప్రపంచ స్థాయి బస్ టెర్మినస్: భక్తులు, సందర్శకుల సులభ రాకపోకల కోసం సుమారు ₹400 కోట్ల వ్యయంతో కొత్త బస్ టెర్మినస్‌ నిర్మాణం…
  • బహుళ అంతస్తుల పార్కింగ్ (MLCP): పర్యాటకుల వాహనాల కోసం మహర్షి అరుంధతి పార్కింగ్, కమర్షియల్ కాంప్లెక్స్‌తో సహా అనేక కొత్త పార్కింగ్ ప్రదేశాలు ప్రారంభించబడ్డాయి…

సరయూ నది, ఘాట్ల అభివృద్ధి…

  • ఘాట్ల పునరుద్ధరణ: గుప్తార్ ఘాట్, రాజ్‌ఘాట్ మధ్య కొత్త కాంక్రీట్ ఘాట్ల నిర్మాణం, పాత ఘాట్ల పునరభివృద్ధి పనులు జరుగుతున్నాయి…
  • రామ్ కీ పౌడీ: సరయూ నది ఒడ్డున ఉన్న ‘రామ్ కీ పౌడీ’ ప్రాంతానికి కొత్త రూపు ఇచ్చి, దాన్ని పర్యాటక ఆకర్షణగా మార్చారు…
  • క్రూయిజ్ కార్యకలాపాలు: సరయూ నదిలో క్రూయిజ్ (Cruise) కార్యకలాపాలు… అనేక ప్రైవేటు హోటళ్లు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • హికమత్, ఇంగితం కలిస్తేనే… ప్రాణహితం… తెలంగాణ ప్రయోజనం…
  • ధరల పెంపు దేనికి..? ప్రేక్షకులను ఎందుకు దోచుకోనివ్వాలి..?
  • ఆ గ్రామీణ ఆర్టీసీ బస్సులు పుష్పక విమానమంత అద్భుతాలు..!!
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ఒక అధ్యాయం సమాప్తం..!!
  • రాఫెల్ పైలట్ శివాంగీ సింగ్ అసలు జీవిత స్వప్నం ఏంటో తెలుసా..?!
  • పవర్ ఫుల్ సినిమా పెన్… ఓ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం…
  • జాన్వి స్వరూప్..! నో, శ్రీదేవి వారసురాలు కాదు… మంజుల వారసురాలు…!!
  • గ్రేట్ నికోబార్…! ఇక ‘ఆ మూక’ మొత్తం దీనిపై పడి ఏడుస్తోంది..!!
  • ఎవరు ఈ ధూల్‌పేట లేడీ గంజాయ్ డాన్ అంగూర్ బాయ్..?
  • లవ్ ఎట్ ఫస్ట్ మూవీ… అరంగేట్రంతోనే ఆమెకు నాగార్జున పడిపోయాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions