.
కొన్ని అంతే… ఆగిపోయినవి కదలడానికి ఓ ప్రేరణ కావాలి… ఆ సందర్భం తన్నుకురావాలి… మహిళల వరల్డ్ కప్ విజయం కూడా అంతే… ఎక్కడో చిక్కుకుపోయిన ఓ బాలీవుడ్ మూవీ మళ్లీ కదులుతోంది… కారణం, హఠాత్తుగా మన లేడీ క్రికెటర్లకు ఆదరణ అమాంతం పెరిగిపోవడమే…
ఝలన్ గోస్వామి గురించి నిన్న చెప్పుకున్నాం కదా… చక్దా ఎక్స్‌ప్రెస్… ఓ బయోపిక్‌కు అవసరమైనంత పెయిన్, కన్నీళ్లు, సవాళ్లు, విజయాలు, రికార్డులు అన్నీ ఉన్నయ్ ఆమె లైఫులో… ఇండియన్ వుమెన్ క్రికెట్ ఈ స్థితికి రావడం వెనుక ఈమె కూడా ఓ పునాది శిల… ముచ్చట కథనం ఈ లింకులో…
Ads
చక్దా ఎక్స్‌ప్రెస్..! ఈ ప్రపంచకప్ విజయ నిర్మాణంలో ఒక పునాది శిల..!!
2022లో ఈ బయోపిక్ షూటింగ్ పూర్తయింది… అనుష్క శర్మ కథానాయిక… (క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య)… నిజానికి అనుష్క అప్పటికే సినిమాలకు దూరమైంది… పిల్లల కోసం, కుటుంబం కోసం… 2018లో ఆమె చివరిసారి తెరపై కనిపించింది… (జీరో మూవీ)… 2022లో కేవలం ఈ బయోపిక్ కోసం మళ్లీ షూటింగుకు వచ్చింది…

దర్శకుడు ప్రొసిత్ రాయ్… దీనికి నిర్మాత ఎవరో కాదు, అనుష్క సోదరుడు కర్నేష్ శర్మ… (క్లీన్ స్లేట్ ఫిల్మ్స్)… ఇది థియేటర్లలో రిలీజు కోసం కాదు, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ఒరిజినల్ సినిమాగా షూట్ చేశారు… అది ఎప్పుడో విడుదల కావల్సింది, కానీ కాలేదు… కారణం..?
పేరుకు క్రియేటివ్ డిజగ్రిమెంట్స్ అని పైకి చెబుతున్నా… నిర్మాతకూ, ఓటీటీకి నడుమ ఫైనాన్షియల్ టరమ్స్‌లో విభేదాలు తలెత్తడం… నెట్‌ఫ్లిక్స్ రెండేళ్ల క్రితమే రిలీజ్ చేయాల్సి ఉన్నా సరే, ఆ కారణాలతో పక్కన పడేసింది…
తాజా ప్రయత్నాలు…: ఇటీవల భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిన నేపథ్యంలో, ఈ బయోపిక్‌కు మళ్లీ ప్రాధాన్యత పెరిగింది… దాంతో, సినిమా నిర్మాతలు ‘చక్దా ఎక్స్‌ప్రెస్’ ను త్వరగా విడుదల చేయాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్ అధికారులతో సంప్రదింపులు ప్రారంభించారు…
త్వరలో ఓటీటీపై ఝలన్ గోస్వామిగా అనుష్క శర్మ కనిపించడం ఖాయమే అంటున్నారు… ఐతే అప్పట్లోనే ఈ సినిమాపై నెటిజన్ల నడుమ జోరుగా చర్చలు జరిగాయి… అదేమిటంటే..? అసలు ఝులన్ పాత్రకు అనుష్క ఫిట్టయిందా..?
అదీ ఆసక్తికరం… ఒకరి బయోపిక్ తీస్తున్నప్పుడు ఆ లుక్ కనిపించేలా జాగ్రత్తలు తీసుకుంటారు… మరింత ప్రభావవంతంగా ఆ పాత్ర ఫోకస్ కావడం కోసం..!
శారీరక పోలికలు (Physical Resemblance)…: ఝులన్ గోస్వామి ఆరు అడుగుల పొడవైన, దృఢమైన ఫిట్‌నెస్ ఉన్న ఫాస్ట్ బౌలర్. అనుష్క శర్మ ఎత్తు, శరీరాకృతి (body type) ఝులన్‌తో పోలిస్తే భిన్నంగా ఉండటం ప్రధాన సమస్య… పోస్టర్లు, టీజర్ విడుదలైనప్పుడు కూడా ఈ ‘లుక్’ విషయంలోనే నెటిజన్ల నుండి విమర్శలు వచ్చాయి…

క్రికెట్ నైపుణ్యం (Cricket Skills)…: ఝులన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన మహిళా బౌలర్‌లలో ఒకరు… ఆ ‘బౌలింగ్ యాక్షన్’ను, పేస్‌ను అనుష్క ఎంతవరకు నమ్మశక్యంగా పండించగలిగిందో చూడాలిక…
ప్రాంతీయత (Regional Accent)…: ఝులన్ గోస్వామి పశ్చిమ బెంగాల్‌కు చెందిన రూరల్ లేడీ… అనుష్క బాలీవుడ్ నటిగా హిందీ మాట్లాడే యాక్సెంట్, బాడీ లాంగ్వేజ్ బెంగాలీ యాక్సెంట్‌కు ఎంతవరకు న్యాయం చేసింది అనే అంశంపైనా అనుమానాలు ఉన్నాయి…
అనుష్క శ్రమ – ప్రయత్నం
అయితే, ఈ విమర్శలను దాటి పాత్రకు న్యాయం చేయడానికి అనుష్క తనవంతు కృషి చేసింది…
నిజమైన శిక్షణ (Intense Training)…: అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ, నెలల తరబడి క్రికెట్ శిక్షణ తీసుకుంది… నటనలో ఆ ఇంటెన్సిటీ రావడం కోసం… ఝులన్ గోస్వామి బౌలింగ్ యాక్షన్ కోసం ఆమె చాలా కష్టపడిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి…
మేకప్ , ప్రోస్తేటిక్స్ (Makeup & Prosthetics)…: తన లుక్‌ను ఝులన్‌కు దగ్గరగా తీసుకురావడానికి ఆమె జుట్టును చిన్నది చేయడం, మేకప్‌లో మార్పులు చేయడం వంటివి చేశారు…
నటనపై నమ్మకం…: అనుష్క ఎప్పుడూ తన పాత్రల్లో ఒదిగిపోయే నటిగా పేరు తెచ్చుకుంది (ఉదా: NH10, సుల్తాన్, సూయీ ధాగా)… ఆమె శారీరక పోలికల కంటే, ఝులన్ పట్టుదల, ఆమె పోరాటం వంటి భావోద్వేగాలను పండించగలిగిందని చిత్ర యూనిట్ చెబుతోంది…
కో-స్టార్ ప్రశంస…: ఈ సినిమాలో నటించిన నటులు (ఉదాహరణకు దిబ్యేందు భట్టాచార్య) కొందరు, సినిమా విడుదల కాకముందే చూసి, “ఇది అనుష్క కెరీర్‌లోనే అత్యుత్తమ నటన” అని ప్రశంసించడం గమనార్హం…
కథనంలో బలం, దర్శకుడి విజన్, అనుష్క నటనలోని చిత్తశుద్ధి ఈ సినిమా ఫలితానికి ప్రధాన కారణాలు అవుతాయి… కేవలం లుక్ సరిపోలేదు అనే ఒకే ఒక్క కారణంతో సినిమాను కొట్టిపారేయలేం…
Share this Article