.
Subramanyam Dogiparthi …… కృష్ణ కెరీర్లో మరో మాస్ మసాలా ఏక్షన్ సినిమా 1988 జూలైలో వచ్చిన ఈ అశ్వత్థామ . తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ కాస్ట్యూమ్స్ డిజైనర్ , తర్వాత కాలంలో నటుడు అయిన , కృష్ణ ఈ సినిమాకు నిర్మాత . కృష్ణ కోసం పరుచూరి బ్రదర్స్ చాలా పవర్ఫుల్లుగా నేసిన కధ . కధకు ధీటుగా పదునైన డైలాగులను కూడా అందించారు .
అప్పటికే ఇలాంటి ఏక్షన్ కం రాబిన్ హుడ్ సినిమాలను చాలా చేసిన కృష్ణకు ఈ సినిమా కొట్టిన పిండే అయింది . కృష్ణకు జోడీగా , హుషారుగా , షీరోయిక్కుగా కస్టమ్స్ ఆఫీసర్ పాత్రలో నటించింది విజయశాంతి . బహుశా ఫైట్లను ఈ సినిమాతోనే మొదలు పెట్టిందేమో ! ఇద్దరూ పాటల్లో బాగా డాన్సించారు .
Ads
వీరిద్దరి తర్వాత చెప్పుకోవలసిన పాత్ర లాయరుగా శారదదే . పరుచూరి బ్రదర్స్ రైటర్లుగా ఉంటే ఆమె పాత్రను ప్రత్యేక శ్రధ్ధతో మలచుతారు . ఆ తర్వాత నామాలు పేరుతో సబ్ ఇనస్పెక్టరుగా మోహన్ బాబు గుర్తుండిపోయేలా నటించారు . పబ్లిక్ ప్రాసిక్యూటరుగా , శారద భర్తగా జగ్గయ్య నటించారు . ఆయన గురించి చెప్పేదేముంది ? A veteran .
విలనాసురులుగా నూతన్ ప్రసాద్ , చలపతిరావు , ట్రైనీ విలనుగా రాజేష్ , ఇతర పాత్రల్లో రాజా , వరలక్ష్మి , ముచ్చెర్ల అరుణ , నర్రా , పి జె శర్మ , రాజ్ వర్మ , తదితరులు నటించారు . ప్రేక్షకులకు భాగా గుర్తుండిపోయేది రాబిన్ హుడ్ పాత్రలో కృష్ణ విలన్ల దగ్గర నుండి డబ్బుల్ని ఎత్తేసేటప్పుడు చక్కగా పట్టుబట్టలు పెట్టి , బొట్టు పెట్టి , చెవిలో పువ్వెట్టి , హుండీలో వేయించటం .
సినిమా రొటీన్ దుష్టశిక్షణ శిష్టరక్షణ అయినా సినిమాలో ఫేమిలీ సెంటిమెంట్ , కోర్టు సీన్లు , చక్రవర్తి సంగీతంలో బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడిన వేటూరి పాటలు సినిమాను విజయపధం వైపు నడిపించాయి .
అశ్వత్థామ ఎదురే లేదు అనే పాటను బాలసుబ్రమణ్యం చాలా పవర్ఫుల్లుగా పాడారు . అంతే పవర్ఫుల్లుగా కృష్ణ అదరగొట్టేసారు . హీరోహీరోయిన్ల మూడు డ్యూయెట్లను దర్శకుడు బి గోపాల్ చాలా బాగా చిత్రీకరించారు . కృష్ణ కాస్ట్యూమ్స్ వెరైటీగా ఉంటాయి .
జాబిల్లి పెళ్ళికొడకా , ఓ అందగాడా నీ సోకు మాడా , సిగ్గెట్టి కొట్టమాకు చిట్టెమ్మా అంటూ సాగే మూడింట్లోనూ కృష్ణ ఫ్రెష్ గా , హుషారుగా కనిపిస్తారు . ఫీల్ గుడ్ పాట అందాల బొమ్మ సీతమ్మ బంగారు తండ్రి రామయ్య ఫేమిలీ సెంటిమెంటుతో బాగుంటుంది .
కమర్షియల్గా కూడా సక్సెస్ అయిన ఈ అశ్వత్థామ సినిమా యూట్యూబులో ఉంది . కృష్ణ , విజయశాంతి అభిమానులు చూడతగ్గ సినిమాయే . తరచూ టివిలో కూడా వస్తూనే ఉంటుంది . కాస్ట్యూమ్స్ కృష్ణ లక్కీ కృష్ణే అనుకుంటా . అతను నిర్మించిన సినిమాలన్నీ బాగానే డబ్బు చేసాయని అనుకుంటా .
నేను పరిచయం చేస్తున్న 1162 వ సినిమా ఇది . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article