.
Raghu Mandaati ….. హెచ్చరిక : బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయి. ఇది ఫేక్ న్యూస్ గా భావించకుండా ప్రభుత్వానికి విన్నపం, ప్రజలకు అప్రమత్తం కొరకై…
18 ఏళ్ల నుండి 45 ఏళ్ల మధ్య వయస్సు గల యువతులు, మహిళల్లో ఇటీవల రోజుల్లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
Ads
ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతిరోజూ నమోదవుతున్న కేసుల వివరాలను పారదర్శకంగా ప్రజలకు తెలియజేస్తూ సమాజాన్ని అప్రమత్తం చేయాలని ప్రజాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నిన్న ఒక్క రోజే రెండు ప్రధాన ఆసుపత్రుల్లో 20కి పైగా కేసులు, చిన్న ఆసుపత్రుల్లో కనీసం 5 కేసులు నమోదయ్యాయని న్యూరాలజీ మిత్రులు తెలియజేశారు.
ఇది ఒక చిన్న హెచ్చరిక కాదు, ఒక సమాజ ప్రమాద సంకేతం. జీవనశైలి మార్పులు, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, నిద్ర లోపం వంటి అంశాలు కారణమవుతున్నాయేమో అని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్న లక్షణాలనైనా నిర్లక్ష్యం చేయకండి… డాక్టర్స్ మిత్రులు ముందస్తు జాగ్రత్తగా ఈ లక్షణాలు కనపడిన వెంటనే న్యూరాలాజీ డాక్టర్ ని సప్రదించి బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందే జాగ్రత్త పడొచ్చు అని చెప్తున్నారు.
భుజాలు కండరాలు నొప్పిగా ఉన్నా, మెడ వెనక భాగం నుండి వెన్నుముక నొప్పిగా ఉన్నా, తలలో విపరీతమైన నొప్పి, మైగ్రేన్, కళ్ళు మసకబారాడం, చిన్న అక్షరాలు కష్టంగా చదవాల్సి రావడం ఈ లక్షణాలు స్ట్రోక్ కి దారి తీసే అవకాశంగా గుర్తించాలి…
అలాగే స్ట్రోక్ వచ్చినట్టు ఎలా తెలుస్తుంది అనే అవగాహన కూడా ఉండాలి. దానికి ప్రధానంగా
ఒక్కసారిగా తలనొప్పి, చేతులు, కాళ్ళు పడిపోవడం, ముఖం వంకరగా తిరగడం, మాట తడబడటం, చూపు మసకబారటం, ఉన్నట్టుండి పడిపోవడం వీటిలో ఏది జరిగిన స్ట్రోక్ గా గుర్తించాలి.
ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ఎక్కువగా కోవి షీల్డ్ వాక్సిన్ గ్రహీతలే ఎక్కువ ఉండడం చర్చనీయంశంగా ఉన్నప్పటికీ అధికారికంగా రుజువు కావాల్సి ఉంది. విమర్శ కాదు. చింతనతో కూడిన విజ్ఞప్తి.
ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు, ఆరోగ్య బీమా సంస్థలు, ఆరోగ్య శాఖ, మీడియా ఛానెల్స్, సీనియర్ వైద్యులు… మీ అందరినీ ఒక సామాజిక మేధస్సుతో ఆలోచించాలని కోరుతున్నాను.
సాధారణ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మహిళలు తమ జీవితంలో కుటుంబాన్ని కాపాడడమే తమ ధ్యేయంగా చూసే వారు. కానీ వారి ఆరోగ్యం గురించి ఆలోచించడానికి సమయం, సౌకర్యం, ధైర్యం, ఈ మూడు కూడా వారికి అరుదుగా దొరుకుతాయి.
ఒకప్పుడు కుటుంబ ఆరోగ్యం అంటే భర్త, పిల్లల ఆరోగ్యమే అనుకునే సాంప్రదాయం ఇప్పుడు కూడా ఇంకా వారి మనసుల్లో బలంగా ఉంది. వారే ఇళ్ల కాంతి, కానీ వారి ఆరోగ్యం చీకట్లో మునిగిపోతోంది. ప్రభుత్వం ఈ వాస్తవాన్ని గుర్తించి ప్రత్యేక “Women Stroke Awareness & Screening Camps” ప్రతి జిల్లాలో నెలకోసారి ఏర్పాటు చేయాలి.
ఆరోగ్య బీమా సంస్థలు ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌లను సాధారణ పాలసీలలోనే ఉచితంగా కల్పించాలి.
ప్రైవేట్ ఆసుపత్రులు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద మధ్యతరగతి మహిళలకు ఉచిత కన్సల్టేషన్‌లు, స్క్రీనింగ్ డ్రైవ్‌లు నిర్వహించాలి.
మీడియా ఛానెల్స్ రోజువారీ సెన్సేషనల్ వార్తల మధ్య ఒక చిన్న మానవతా స్లాట్‌గా ఈ విషయం మీద అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయాలి. సీనియర్ డాక్టర్లు, న్యూరాలజిస్టులు తమ అనుభవాల ఆధారంగా ప్రజలకు సరళంగా అర్థమయ్యే భాషలో మార్గదర్శక వీడియోలు, పబ్లిక్ మెసేజెస్ ఇవ్వాలి.
సమాజం అంటే కేవలం భవనాలు, రోడ్లు, ప్రాజెక్టులు కాదు. సమాజం అంటే ఆరోగ్యంతో ఉన్న మనుషులు.
ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఒక కుటుంబం నిలుస్తుంది, ప్రతి కుటుంబం నిలిస్తేనే ఒక దేశం నిలుస్తుంది.
మన శ్రద్ధ, మన సాంకేతికత, మన వైద్య విజ్ఞానం సమాన హక్కుగా, అందరికీ చేరే విధంగా పునర్నిర్వచించుకోవాలి.
జీవితం కేవలం ప్రాణాల కొనసాగింపు కాదు
సజీవ చైతన్యానికి ఇచ్చే గౌరవం…..
Share this Article