అది 1794… బ్రిటిష్ సైన్యానికీ, టిప్పు సుల్తాన్‌కూ నడుమ భారీ యుద్దం… బ్రిటిష్ సైన్యానికి ఆహారపదార్థాలు, దినుసులను తీసుకువెళ్తున్న ఓ బండిని పట్టుకున్నారు టిప్పు సుల్తాన్ సైనికులు… ఆ బండి తీసుకుపోతున్నది ఇండియన్… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తున్నాడు… పేరు కోసాజీ… తను మరాఠీ… తను యుద్ధసైనికుడు కాదు కాబట్టి, కసుక్కున పొడిచి, చంపేయకుండా ముక్కు కోసేసి పంపించారు… బ్రిటిష్ సైన్యం కోసం పనిచేస్తే ఊరుకునేది లేదని చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటికీ అదొక సంకేతం… లబోదిబోమంటూ కోసాజీ తమ క్యాంపుకి వచ్చాడు… James Findlay, Thomas Cruso అనే ఇద్దరు బ్రిటిష్ డాక్టర్లు తనకు ట్రీట్‌మెంట్ ఇవ్వడానికి ముందుకొచ్చారు… కానీ కోసాజీ తిరస్కరించాడు… నేను కుమ్హర్ వైజ్జ దగ్గర చికిత్స తీసుకుంటానని పట్టుబట్టాడు… ఎవరాయన అనడిగారు ఈ డాక్టర్లు… ‘ఆయన ఇటుకలు, కుండలు చేసి అమ్ముకునే కుమ్మరి..’ ఈ ఇద్దరు డాక్టర్లూ నవ్వసాగారు… ఓ కుమ్మరి సర్జరీ చేస్తాడా అంటూ..!
ఈయనే కోసాజీ… జాగ్రత్తగా చూడండి ఫోటో… మొత్తం కథ అయిపోయాక మరోసారి చూడండి… సరే, కథలోకి వెళ్తే… కోసాజీ కోరిక మేరకు ఆ కుమ్హర్ వైజ్జ దగ్గరకు తీసుకుపోయారు… కుమ్హర్ అంటే కుమ్మరి, వైజ్జ అంటే వైద్య… గ్రామీణులు అలా పలికేవారు… ఆయన కోసాజీ నుదురు నుంచి కొంత చర్మం తీసి, ముక్కు కోసేసిన దగ్గర అతికించి కట్టుకట్టాడు… తను ఎలా చేస్తున్నాడో ఆ ఇద్దరు బ్రిటిష్ డాక్టర్లూ దగ్గరుండి చూశారు… కొన్నాళ్లకు ముక్కు సెట్టయింది… నుదురు మీద మళ్లీ చర్మం వచ్చేసింది… కాస్త అటూఇటూ పాత రూపం వచ్చేసింది… రినోప్లాస్టీ, ప్లాస్టిక్ సర్జరీ అంటాం కదా ఆధునిక వైద్యంలో… ఇది అదే… 1794లో… ఈ డాక్టర్లు అబ్బురపడిపోయి లండన్‌లోని ప్రముఖ వైద్యులకు ఛాయాచిత్రాలు గీసి మరీ సర్జరీ వివరాలను పంపించారు… మద్రాస్ గెజిట్‌లోనూ పబ్లిష్ చేశారు… ఈ ఫోటో బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నదే…
Ads
ఈ విషయం తెలిసిన Joseph Constantine Carpue అనే ఇంగ్లిష్ డాక్టర్ లండన్ నుంచి హుటాహుటిన ఇండియా వచ్చాడు… ఈ కుమ్మరి సర్జన్‌ను కలిశాడు… తనకు శిష్యరికం చేస్తూ ఆ విద్యను నేర్చుకున్నాడు… తరువాత లండన్ వెళ్లిపోయాడు… 1816లో ఒక సర్జరీ చేశాడు… ప్రపంచంలో తొలి ప్లాస్టిక్ సర్జరీగా నమోదైంది… దాన్ని Carpue operation అంటారు… కోసాజీ పేరును Cowasjee అని రాసుకుని, తన నైపుణ్యం ఇండియా సంప్రదాయ వైద్యం నుంచి వచ్చిందేనని తనే చెప్పుకున్నాడు… సో, నిజానికి సర్జరీలకు ఆద్యులు ఎవరు..? ఇండియాలో కుండలు చేసుకువాళ్లు కూడా ఎలా చేయగలిగారు..? దానికి కారణం శుశ్రుతుడు… ప్రఖ్యాత ఆయుర్వేద వైద్యుడు… వేల ఏళ్ల క్రితమే సర్జరీలు చేసేవాడు… ఆ వివరాలతో శుశ్రుత సంహిత రాశాడు… ఆ ఒరిజినల్ తాళపత్రాలు, పుస్తకాలు ఎక్కడ దొరికాయనేది మరో ఇంట్రస్టింగు కథ… అదిక్కడ వద్దు…
ఇవి శుశ్రుతుడు సర్జరీకి వాడిన పరికరాలు… చిన్న చిన్న సర్జరీలయితే సరే, పెద్ద సర్జరీలకు అనస్తీషియా ఎలా..? తను ప్రత్యేకంగా తయారుచేసిన ఓ పానకాన్ని తాగించేవాడుట… తరువాత స్పృహ కోల్పోయేవాడు రోగి… మళ్లీ సోయిలోకి వచ్చేలోపు సర్జరీ చేసేసి, కట్టు కట్టేసేవాడు… ఇదంతా కథ కాదు… కల్పన కాదు… చరిత్ర… తర్వాత కాలంలో మనం కాలదన్నుకున్న విజ్ఞానం… మనం మరింత అభివృద్ధి చేసుకోలేకపోయిన సంప్రదాయ వైద్యం విశిష్టత… మాకు తెలిసిందే సైన్స్, ఇతర వైద్యవిధానాలన్నీ ట్రాష్, ప్రత్యేకించి భారతీయ సంప్రదాయ వైద్యం ఓ చెత్తా అనే భ్రమల్లో బతికేవారి కోసం కాదు ఈ కథనం… సంప్రదాయ వైద్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నవారి కోసం…!! హేమిటి, ఇదంతా నిజమేనా అనే డౌట్లున్నవాళ్లు నెట్‌లోకి వెళ్లండి ఓసారి.., కుప్పలుకుప్పలుగా వివరాలు, ఆధారాలు దొరుకుతయ్…!
Share this Article