.
ముందుగా ఓ డిస్‌క్లెయిమర్…. తిరుమల లడ్డూ మీద సీబీఐ దర్యాప్తులో తేలిన ఫలితాలు విభ్రాంతిని కలిగిస్తున్నాయి… రాజకీయ రాబందులు, ఉన్నతాధికార తిమింగిలాలు కోట్ల మంది భక్తుల విశ్వాసాన్ని, మనోభావాల్ని ఎంత ఘోరంగా దెబ్బతిన్నాయో తెలిసేకొద్దీ మాటలుడిగి మాన్పడిపోతున్న అవస్థ…
ఆలయాలు రాజకీయ చెరలో ఉంటే కలిగే దుష్ఫలితాలు… చివరకు దేవుడూ నిశ్చేష్టుడయిపోయిన దురవస్థ కళ్లకు కడుతోంది… సరే, సీబీఐ దర్యాప్తు నిజమేనా కాదా చివరకు కోర్టు తేలుస్తుంది… కానీ సగటు వెంకన్న భక్తుడు ఖచ్చితంగా అవలోకనం చేసుకోవాలి, ఆలోచించాలి… హిందూ మత విశ్వాసాలకు, వెంకన్న భక్త గణానికి తగులుతున్న దెబ్బలకు కారకులెవరు..? ఆ ద్రోహాలకు బాధ్యులెవరు..?
Ads
తిరుమల లడ్డూలో జంతు అవశేషాల నెయ్యి వాడారు అని చంద్రబాబు ప్రకటన చేసినప్పుడు… విస్మయం… తన మీద ఎదురుదాడి… ఈ అపచారానికి ఎవరికి ఏ శిక్ష పడాలో ఆ దేవుడికే వదిలేయాలి, మన వ్యవస్థ ఏమీ చేయలేదు, అది రియాలిటీ…
కనిపిస్తున్న, వినిపిస్తున్న లడ్డూ- నెయ్యి అక్రమాల వార్తలు, సీబీఐ దర్యాప్తు వివరాల సారాంశం ఏమిటంటే..?
– ఐదేళ్ల పాటు వాడింది అసలు నెయ్యే కాదట… కల్తీ నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు అనేది ఆశ్చర్యకరం…
– కల్తీ నెయ్యి కాదు, మరి..? దొంగ నెయ్యి, నెయ్యిలా కనిపించే అదేదో పదార్థం… చుక్క పాలు గానీ, గ్రాము వెన్న గానీ లేని కృత్రిమ నెయ్యి…
– కిలో, రెండు కిలోలు కాదు… 68 లక్షల కిలోల నెయ్యిని నెయ్యి పేరుతో భోలే బాబా డెయిరీ సరఫరా చేసింది.
– పామాయిల్ లో రసాయనాలు కలిపి తయారు చేశారట ఈ కల్తీ నెయ్యి… ఈ విషయాలన్నీ ఎట్లా తెలిశాయి..?
…. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తిని సిబిఐ సిట్ అరెస్ట్ చేసింది… తను ఢిల్లీలో ఉంటాడు… కెమికల్స్ సప్లై చేసే వ్యాపారి… ఈ కెమికల్స్ ఎవరికి సప్లై చేశాడు…? భోలే బాబా డెయిరీకి…
– ఈ కేసులో ఇతను ఏ16… నెల్లూరు కోర్టుకు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్టులో ఈ వివరాలున్నాయి… ఇన్నాళ్లూ కల్తీ నెయ్యి అనుకున్న దేశం, అసలు నెయ్యే కాదని తెలిసి విస్తుపోయింది…
– అసలు ఈ భోలే బాబా డెయిరీ ఏమిటి..? ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది… ఇదే టీటీడీ ఈ డెయిరీని 2022లో బ్లాక్ చేస్తే… దొడ్డిదోవన సప్లయ్ చేస్తూనే ఉంది… అదెలా జరిగిందీ అంటే..?
– వాళ్లకు దగ్గరలో హర్షా డెయిరీ అనే ఓ సిక్ యూనిట్ ఉంటే దాన్ని కొన్నారట… దాని పేరుతో మలేషియా నుంచి పెద్ద ఎత్తున పామాయిల్ ఆర్డర్ చేశారు…
– ఇందులో కలపడానికి రసాయనాలు కూడా కొన్నారట. మోనోగ్లిజరైడ్స్, అసిటిక్ యాసిడ్ ఈస్టర్, లాక్టిక్ యాసిడ్, బేటా కెరటీన్, ఆర్టిఫిషియల్ ఘీ ఎసెన్స్… ఇలాంటివి ఈ పామాయిల్‌లో కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేశారన్నమాట…
– సప్లయ్ చేసిన మొత్తం విలువ 250 కోట్లు… మరి భోలే బాబా డెయిరీని బ్లాక్ చేశారు కదా, ఎలా సప్లయ్ చేశారు..? తిరుపతిలో వైష్ణవి డెయిరీ, యూపీలో మాల్ గంగా డెయిరీ, తమిళనాడులో ఏఆర్ డెయరీ… ఏఆర్, వైష్ణవి డెయిరీ వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు…
– సో, తయారీ భోలే బాబా డెయిరీ, సప్లయ్ చేసేది వేరే పేర్లతో… ఇలా 68 లక్షల కిలోల సరఫరా…
ఈ భోలే బాబా డైరెక్టర్స్ పేర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్… వీళ్ళని ఎప్పుడో అరెస్ట్ చేశారు… ఈ కేసులో ఏ3, ఏ4… వాళ్లకు బెయిళ్లు కూడా వచ్చాయి…
ఇక్కడ తేలాల్సిన మరో ప్రధానాంశం ఉంది… ఈ నెయ్యిలో యానిమల్ ఫ్యాట్స్ ఉన్నాయని పదే పదే చెబుతున్నారు కదా మొదటి నుంచీ… కానీ సీబీఐ దర్యాప్తు వివరాల్లో అదేమీ లేదేం..? అంటే, కేవలం రసాయనాల కృత్రిమ నెయ్యి తప్ప జంతు అవశేషాల వాడకం లేనట్టేనా..? మున్ముందు ఆ వివరాలూ వస్తాయా..?
అక్టోబరు 4న కేసును సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు అప్పగిస్తే ఇప్పటివరకు పురోగతి ఇది… ఇంకా తవ్వుతూనే ఉన్నారు… కొన్ని అరెస్టులు… అసలు ఛార్జి షీటు ఎప్పుడు..? సమగ్ర దర్యాప్తు సారాంశం దేశానికి చెప్పేది ఎప్పుడు..? అవునూ, దేవుడెందుకు ఉపేక్షిస్తున్నాడు ఈ ద్రోహుల్ని…!?
.
- హైకమాండ్ చెబితేనే కొన్నాను అంటున్నాడట అధర్మారెడ్డి… ఆ సిట్ వల్ల కాదు గానీ… ఈమాత్రం దానికి మరీ అజిత్ ధోబాల్ దాకా ఎందుకు గానీ… మా హైదరాబాద్ సెంట్రల్ క్రైం స్టేషన్ వాళ్లకు అప్పగించండి తనను… పది నిమిషాల్లో అసలు ద్రోహుల పేర్లన్నీ కక్కిస్తారు..!!
Share this Article