.
Chakradhar Rao …… “నష్టం లేని వ్యవస్థ లేదు — సినిమా పరిశ్రమ కూడా దీనికి మినహాయింపు కాదు”
సమాజంలోని ప్రతి ఉత్పత్తి, ప్రతి సేవ, ప్రతి వ్యవస్థ ఒక సాధారణ సూత్రంపై నడుస్తుంది:
“ఉత్పత్తి జరుగుతున్నచోట నష్టం సహజం. నిర్వహణ, బాధ్యత ఉన్నచోట దాన్ని తగ్గించే తెలివి అవసరం.”
- వ్యవసాయం నుంచీ ఈ సత్యం మనకు తెలిసినదే.
బీజం వేయడం నుండి చివరి కోత దాకా ప్రతి దశలో రైతు కొంత మేర నష్టాన్ని బడ్జెట్‌లో భాగంగా అంగీకరిస్తాడు.
దానిని ఓడిపోవడమని భావించడు.. అది ప్రకృతి పన్ను అని అర్థం చేసుకుంటాడు.
మన ఇంటి వంట గదిలో కూడా ఇదే సూత్రం పనిచేస్తుంది.
వంట ఎక్కువై పోవచ్చు.. మిగిలినది పనిమనిషికి ఇస్తాం లేదా కొన్నిసార్లు బయట పడేయవచ్చు.
ఈ చిన్న నష్టాలను మనం ఎలాంటి ఆవేదన లేకుండానే జీవిత ఖర్చులో భాగంగా స్వీకరిస్తాం.
Ads
ఈ చిన్న ఉదాహరణలతో మనం అర్థం చేసుకోవలసింది ఏంటంటే..
నష్టం అనేది అనివార్యం. తగ్గించుకోవటం నిర్వహించాల్సిన వాస్తవం.
సినిమా పరిశ్రమ — నష్టాన్ని “నేరం”గా చూడటం బాధాకరం.
సినిమా పరిశ్రమ మాత్రం ఈ సహజ నష్టాన్ని అతిశయంగా, వ్యక్తిగత దాడిగా తీసుకుంటోంది.
ఒకవైపు వందల కోట్ల బడ్జెట్‌తో చిత్రాలు నిర్మించబడుతుండగా,
మరోవైపు కొంతమంది వ్యక్తులు సినిమాను ఫ్రీగా చూస్తున్నారు అన్న కారణంతో మొత్తం ప్రేక్షక వ్యవస్థను శత్రువులా చూస్తున్నారు.
పరస్పరం విరుద్ధమైన ఈ స్పందన, బాధ్యతారాహిత్యం, భ్రమల మిశ్రమం.
ప్రశ్న సులభం:
ఇంట్లో అన్నం మిగిలింది కాబట్టి వండిన వాళ్ళని తప్పుబడతామా?
లేదు.
అదే విధంగా సినిమాను థియేటర్‌లో చూడని ప్రజలను పూర్తిగా దోషులుగా చూసేందుకు పరిశ్రమకు నైతిక హక్కు లేదు.
ప్రచారం — పరిశ్రమ మర్చిపోయిన బాధ్యత
ముకేష్ పొగాకు యాడ్ తర్వాత ప్రతి థియేటర్లో ఒక చిన్న సందేశం
“సినిమాలు అధికారిక వేదికల్లోనే చూడండి”
అంటూ హీరోలు, హీరోయిన్లు, దర్శకులు చెప్పి ఉంటే
పరిస్థితి వేరేగా ఉండేది.
కానీ తమ సినిమాకు వచ్చిన ప్రీ-రిలీజ్ ఈవెంట్లలో మాత్రం కోట్లు ఖర్చు పెట్టీ.. జనంతో చప్పట్లు కొట్టించడానికి సాహసించే పరిశ్రమ,
ప్రజలకు బాధ్యతను సందేశం రూపంలో చెప్పడంలో మాత్రం మౌనంగా ఉంటుంది.
ఇది నాయకత్వం లోపం, కంపెనీ కమ్యూనికేషన్ వైఫల్యం.
చిన్న చెల్లింపుల మోడల్ — అనివార్య భవిష్యత్తు
విదేశాల్లో డిజిటల్ మీడియా మైక్రో- పేమెంట్‌లపై ఆధారపడి ముందుకు సాగుతోంది.
మన దేశంలో మాత్రం ఇంకా “మాసి సబ్స్క్రిప్షన్” అనే పాత పద్ధతిపైనే పరిమితమైపోయాం…
సినిమా ఒక్కసారి చూడటానికి
₹10 / ₹20 / ₹30
అనే చిన్న మొత్తాన్ని వేసి ఉంటే
ఫ్రీగా చూసేవారి భారీ శాతం చట్టబద్ధంగా చూసేవారిగా మారుతారు.
ఇది వాస్తవిక ఆర్థిక విజ్ఞానం.
సాచెట్ శాంపూ మాదిరిగా,
ఒక్కసారి ఉపయోగం కోసం చిన్న మొత్తాన్ని చెల్లించడానికి ప్రజలు సిద్ధంగానే ఉంటారు.
ఈ మోడల్‌ను ఇంకా పరిశ్రమ లోపించటం ఆశ్చర్యకరం.
BMS ఫీజులు — పరిశ్రమ ఎందుకు సొంత ప్లాట్‌ఫారమ్ కలిగించుకోదు?
టికెట్ కోసం ఇచ్చే సేవా చార్జీలలో కొంత భాగం భాగం బుక్ మై షో కి వెళ్తుంది.
అయితే వందల కోట్లతో సినిమాలు నిర్మించే పరిశ్రమ
సొంత టికెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడంలో ఎందుకు పూర్తిగా వెనుకబడింది?
ఇది దృషి లోపమా?
లేదా ఆవిష్కరణను అడ్డుకునే వ్యవస్థాత్మక అలసత్వమా?
ఏది అయినా సరే,
పరిశ్రమ దీని నుంచి బయటకు రావాల్సిన సమయం ఇది.
జిల్లాలో థియేటర్లు — ప్రజలకు చేరువ చేసినప్పుడే పరిశ్రమ నిలుస్తుంది
సినిమాను థియేటర్‌లో చూడాలంటే
టికెట్ ధర, పార్కింగ్ చార్జీలు, స్నాక్, పానీయాల ధరలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
ఇది సినీ పరిశ్రమ
సినిమా సంస్కృతిని సంరక్షించే సామాజిక బాధ్యతగా చూడాలి.
ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే
పరిశ్రమ వారిని ఆహ్వానించే వాతావరణాన్ని సృష్టించాలి.
- పక్షులను పట్టుకొని చంపితే పంట పెరుగుతుందా?
లేదంటే వాతావరణాన్ని మార్చితే మంచి దిగుబడి వస్తుందా?
పరిశ్రమకు ఈ ప్రశ్నను నిజాయితీగా వేసుకునే సమయం వచ్చింది.
ముగింపు:
నష్టం అనేది శత్రువు కాదు —
నిర్వహించాల్సిన వాస్తవం*
ప్రతి చిన్న పరిశ్రమలోనూ,
ప్రతి ఇంట్లోనూ,
ప్రతి కార్యకలాపంలోనూ నష్టం ఒక సహజ వ్యవహారం.
దాన్ని అంగీకరించకపోవడం అజ్ఞానం.
సినిమా పరిశ్రమ కూడా ఇదే సత్యాన్ని అంగీకరించాలి.
నష్టాన్ని పూర్తిగా నిలిపివేయడం అసాధ్యం.
కానీ దాన్ని తెలివిగా తగ్గించడం,
వ్యవస్థలను మెరుగుపరచడం,
ప్రేక్షకుడిని భాగస్వామ్యం చేయడం
పరిశ్రమకు మరింత బలాన్ని ఇస్తాయి.
పిచ్చుకలు గింజలు తింటున్నాయనే కారణంగా పిచ్చుకలను నాశనం చేయడమే నేటి పరిశ్రమ దృక్పథంగా ఉంది
దాన్ని మార్చాల్సిన సమయం ఇది….
Share this Article