.
పాజిటివ్ దృక్పథం (Positive Mentality) ఉన్నవారు, లేదా జీవితంలో ఆశావాదాన్ని (Optimism) నమ్మేవారు, సినిమా కథల్లో కూడా సుఖాంతాన్ని (Happy Ending) కోరుకోవడం సహజం… దీనికి కొన్ని కారణాలు…
-
ఆశావాదం ప్రతిబింబం (Reflection of Optimism)…: చాలామంది, తాము చూసే కథల్లో తమ జీవిత ఆశలను, నమ్మకాలను ప్రతిబింబించే అంశాలను వెతుకుతారు. కథ ముగింపులో న్యాయం గెలిచి, కష్టాలు తొలగిపోతే, అది వారి అంతర్గత ఆశావాద ధోరణిని బలపరుస్తుంది…
-
ఎమోషనల్ రిలీజ్ (Emotional Release)…: సినిమా చూస్తున్నప్పుడు కథలోని పాత్రల కష్టాలకు ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు లేదా ఆందోళన చెందుతారు. చివరికి పాజిటివ్ ముగింపు దొరికితే, వారికి ఒక విధమైన ఎమోషనల్ రిలీఫ్ లభిస్తుంది… అది ప్రేక్షకులకు సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తుంది…
-
ప్రేరణ (Motivation)…: కష్టాలను ఎదుర్కొన్న హీరో లేదా హీరోయిన్ లేదా ఓ జంట విజయం సాధిస్తే, అది ప్రేక్షకులకు కూడా తమ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఒక ప్రేరణగా (Inspiration) పనిచేస్తుంది…
అయితే, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి యథార్థ కథా చిత్రాలు (Real-Life Stories) ఎప్పుడూ సుఖాంతం కోసం ప్రయత్నించవు… అవి కేవలం “నిజంగా ఏం జరిగింది” అనే విషయాన్ని నిజాయితీగా (Honestly) చూపించడానికి ప్రయత్నిస్తాయి… అప్పుడప్పుడు ఆ నిజం చేదుగా లేదా విషాదంగా ఉండవచ్చు…
Ads
అలాంటి ముగింపులు కొంతమందికి నచ్చకపోయినా, నిరాశావాదాన్ని ప్రొజెక్ట్ చేసినట్టు అనిపించినా… అవి సమాజంలో ఒక ముఖ్యమైన చర్చను (Important Discussion) లేవనెత్తడానికి, లేదా వాస్తవ సంఘటనల తీవ్రతను తెలియజేయడానికి ఉపయోగపడతాయి… సేమ్, ఉప్పెనలో కూడా పగ, కోపం గెలిచినట్టు కనిపించి, ప్రేమ బాధితురాలిగా మిగిలిపోతుంది..!!
మరోచరిత్ర క్లైమాక్స్‌ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేశారు కదా అంటారా..? ఆ సినిమా పాటలు, కమల్ హాసన్ గట్రా సినిమాకు బలం… అందరూ ఆ క్లైమాక్స్‌ను ఆమోదించలేదు కూడా…
.
సరే, ఆ క్లైమాక్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నా సరే, ఈ సినిమాకు సంబంధించి… కొన్ని ప్లస్సులు…
90వ దశకపు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో కథ జరుగుతుంది కదా, అప్పటి తెలంగాణ పల్లెల నేటివిటీ, యాస విషయంలో దర్శకుడు శ్రద్ధ తీసుకున్నాడు… బాగా వచ్చింది… బహుశా వేణు ఊడుగుల ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు దర్శకుడిపై…!
రాజు (అఖిల్ రాజ్), రాంబాయి (తేజస్వి రావు) మధ్య లవ్ స్టోరీ, సవాళ్లు గట్రా పెద్దగా ఇంప్రెసివ్ కాకపోయినా క్లైమాక్స్ మీదే నిర్మాత- దర్శకులు బాగా ఆశలు పెట్టుకున్నట్టున్నారు… కొత్తవాళ్లయినా సరే నటీనటుల నుంచి మంచి పర్‌ఫామెన్స్ పిండుకున్నాడు దర్శకుడు…
హీరో అఖిల్ రాజు అక్కడక్కడా ఓవర్ యాక్షన్ చేసినట్టు కనిపించినా… హీరోయిన్ తేజస్వి రావు పర్లేదు, ఆ పాత్రలో అందంగా ఒదిగిపోయింది… చెప్పుకోవాల్సింది చైతు జొన్నలగడ్డ (రాంబాయి తండ్రి)… ఈ సినిమాలో అత్యంత బలమైన పాత్ర రాంబాయి తండ్రిదే… బాగా పర్‌ఫామ్ చేశాడు…
నటీనటులందరూ గ్రామీణ నేపథ్యం ఉన్న పాత్రలకు తగ్గట్టుగా వారి బాడీ లాంగ్వేజ్ (Body Language), తెలంగాణ యాసను (Dialect) బాగా ఉపయోగించారు… ఇక్కడే చెప్పదలిచింది… ఒక ప్రాంత యాసను, ఆ ప్రాంత నేటివిటీని చూపించేటప్పుడు ఎంత శ్రద్ధ, నిజాయితీ అవసరమో…
మరో కథనంలో చెప్పుకున్నాం… 12 ఏ రైల్వే కాలనీలో అల్లరి నరేష్ పాత్ర ఎంత కృతకంగా తెలంగాణ యాస పలికించాడో… దాంతో పోలిస్తే ఈ రాజు వెడ్స్ రాంబాయి పూర్తిగా కంట్రాస్టు… ప్రస్తుతం తెలంగాణ ఫోక్ సాంగ్స్ హవా సాగుతోంది కదా… సురేష్ బొబ్బిలి ట్యూన్లు కూడా అదే దిశలో బాగానే ఉన్నాయి…
ఇక్కడ సదరు దర్శకుడు పిచ్చి కూతలు… (నెగెటివ్ టాక్ వస్తే అమీర్‌పేటలో కట్ డ్రాయర్ మీద తిరుగుతాను అనే వ్యాఖ్య, సవాల్ ఏమాత్రం బాగాలేదు, తరువాత ట్రోలింగు గమనించి, సారీ చెప్పినట్టున్నాడు… ఇదోరకం పబ్లిసిటీ కావచ్చు… కానీ ఈ కూతలతోనే సినిమా సెలబ్రిటీలు సొసైటీ నుంచి భారీగా నెగెటివిటీని పోగుచేసుకుంటున్నారు…)
చివరగా… ఏ కథయినా సరే, పగ, పరువు భావనల వికృతకోణమే గెలిచినట్టు చెబితే… అది రియల్ స్టోరీ అయినా సరే… తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎంతమేరకు కనెక్టవుతుందో ఓ వారం గడిస్తే తప్ప చెప్పలేం..!!
Share this Article