.
బిగ్‌బాస్ అంటే టాస్కులు, గేమ్స్, వినోదం మాత్రమే కాదు… అదొక మైండ్ గేమ్… బిగ్‌బాస్ ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం నడుస్తూనే మనదైన ఆట ఆడాలి… అది ఎదుటివాళ్ల బలహీనతలు, పరిస్థితులను బట్టి నడుచుకునే ఆట… పక్కాగా మైండ్ గేమ్…
నేను కామెడీ చేస్తున్నాను, నేనే నంబర్ వన్ అనుకోవచ్చుగాక ఇమాన్యుయెల్… కానీ చాలాసార్లు సేఫ్ గేమ్, అటూఇటూ కాని ఒపీనియన్… అందరితో బాగుండాలి అనుకుంటే కుదరదు… ఏదో ఓ స్టాండ్ తీసుకోవాలి… కీలక సందర్భాల్లో తడబాటుకు గురయ్యేది అందుకే…
Ads
అనేక వారాలు అసలు నామినేషన్లలోనే లేడు తను… పైగా పలుసార్లు కెప్టెన్… ఇప్పుడు నామినేషన్లలో వచ్చాక తెలుస్తోంది బయట తనకు ఎంత ఆదరణ ఉందనేది… పడాల కల్యాణ్ తనకన్నా చాలాముందున్నాడు… ఓవరాల్ యాక్సెప్టెన్సీ వోటింగులో తనూజ అందరికన్నా టాప్… ఇమ్మూ మూడో ప్లేసు… దాదాపు భరణి, సుమన్ శెట్టిల రేంజులో…
సంజన, దివ్య ఎలిమినేషన్ అంచుల్లో ఉన్నప్పుడు… నీ దగ్గరున్న పవర్ అస్త్ర వాడితే ఎలిమినేషన్ ఉండదు, దాని పవర్ ఈవారం వరకే, మరుసటి వారం పనిచేయదు అని నాగార్జున చెప్పినప్పుడు… ఎలాగూ వచ్చేవారానికి పనిచేయదు కదా అనే ఓ ఏకైక భావనతో ఎలిమినేషన్ వద్దు అన్నాడు… బహుశా సంజన గనుక ఎలిమినేషన్ అంచులో ఉంటే కాపాడాలనే మమ్మీ బాండింగ్ ప్రభావం కావచ్చు….
కానీ తప్పు… ఇది ఆట… ఒక పోటీదారు ఆట నుంచి వైదొలగాల్సిందే… ఇప్పుడు గాకపోతే మరుసటి వారం తప్పదు కదా… అదుగో అక్కడ ఇమ్మూ తప్పులో కాలేశాడు… నిజానికి తను పవర్ అస్త్ర వాడకపోయి ఉంటే దివ్య హౌజు నుంచి విడిపోయేది… కాస్త హౌజులో కాలుష్యం తగ్గేది… సంజన వెళ్లిపోయినా ఫరక్ పడేది కాదు, ఆమె ఇన్ని వారాలు ఉండటం అంటే ఆమెకు ఎక్కువ బోనసే…
పైగా ఉన్నది మూడు వారాలు, హౌజులో ఉన్నది 9 మంది… ఎలాగూ ముగ్గురినో, నలుగురినో వచ్చే రెండు వారాల్లో కొట్టేయకతప్పదు… మరిక ఒక్క వారం బోనస్ టైమ్ ఇవ్వడం వల్ల ఇమ్మూ సాధించేది ఏముంది..? అఫ్‌కోర్స్, దివ్య అలాగే ఉంటే, తనూజతో డిష్యూం డిష్యూం కథ నడిపించవచ్చు కదా అనుకున్నాడేమో బిగ్‌బాస్.,. కానీ దీనివల్ల మైనస్ అయ్యింది మాత్రం ఇమ్మూయే…
మరోవైపు తనూజ… మహానటి… ఎవరితో ఎలా ఉండాలో, ఎప్పుడు తగ్గాలో, ఎప్పుడు రెయిజ్ కావాలో మైండ్ గేమ్ ఆడుతోంది… ఏడుస్తుంది, అలుగుతుంది, మళ్లీ వెంటనే వెళ్లి హగ్ చేసుకుంటుంది… సిట్యుయేషన్ ఏది డిమాండ్ చేస్తే అది… నిజానికి ఆమె నుంచి ఇంత పర్‌ఫామెన్స్ ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎవరూ ఆమె ఎంట్రీ సమయంలో…!
ఆమె తన దగ్గర ఉన్న ‘అస్త్ర’ కూడా వాడలేదు… అంతేకాదు, పవర్ అస్త్ర వాడి ఎలిమినేషన్ రద్దు చేశాడు గానీ… ఒకవేళ వాడకపోయి ఉన్నట్టయితే టికెట్ టు ఫినాలేకు ఏమైనా చాన్స్ ఉంటుందా అని కూడా అడగలేదు… తనూజ అదే ప్రస్తావించింది… నిజానికి అడగాల్సిన ప్రశ్న అదే… నాగార్జున కూడా ‘వాడేశాడు, అయిపోయింది, ఇక ఆ ప్రశ్నకు తావులేదు’ అంటూ తప్పించుకున్నాడు…
ఇక్కడే తనూజకూ ఇమ్మూకు నడుమ తేడా… మరోవైపు వీళ్లకు పోటీ ఇక కల్యాణ్ ఒక్కడే… ఈ ముగ్గురే కీలక కంటెండర్లు విజయం దిశలో… డెమోన్, దివ్య, రీతూ, సంజనల పని అయిపోయినట్లే… సుమన్ శెట్టి, భరణిలు కూడా ఆ ముగ్గురికీ దూరంగా ఉన్నారు…!!
Share this Article