.
Suraj Kumar... ధూమకేతువు కాదది దుష్టకేతువు..!? వినువీధిలో ఓ విశిష్ట అతిథి..!!
Wow అంటూ 1977 లో నిజంగానే షాకయ్యారు ఖగోళ శాస్త్రవేత్తలు! విశ్వాంతరాల నుంచి ఒక రేడియో వేవ్ భూమిని చేరడమే అందుకు కారణం! 72 సెకన్ల నిడివి కలిగిన ఆ సిగ్నల్ అంతకు ముందు ఎన్నడూ నమోదు కాలేదు, ఆ తరవాత రిపీట్ కూడా అవలేదు! గడచిన 48 ఏళ్లుగా ఆ మిస్టరీ అలాగే ఉంది!
Ads
ఒకవేళ, అది గ్రహాంతరవాసులు పంపిన సంకేతం కాదు కదా? అన్న అనుమానాలు అలాగే ఉన్నాయి! ఆశ్చర్యార్థం వచ్చేలా ఆ సిగ్నల్స్ కు Wow అని నామకరణం చేసి ఆస్ట్రోఫిజిస్టులు ముమ్మర పరిశోధనలు సాగిస్తున్నారు!
ఇదిలా ఉండగానే, మానవాళిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే మరో పరిణామం ఇప్పుడు ఖగోళంలో చోటు చేసుకుంటోంది! అంతర్ తారా మండలం [#InterStellarRegion] నుంచి ఒక అరుదైన అతిథి మనను పలకరిస్తోంది!
అదొక ధూమకేతువు [#Comet] మాత్రమేని ప్రస్తుతం నాసా శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నా, మన సౌరవ్యవస్థను అధ్యయనం చేసి, ఆ విశేషాలు తెలుసుకోవడానికి విశ్వంలోని సుదూరతీరాల నుంచి గ్రహాంతరవాసులు పంపిన స్పై స్పేస్ షిప్ కాదు కదా అన్న సంశయాలను హార్వర్డ్ యూనివర్సిటీ థియారిటికల్ ఫిజిసిస్టు ఎవి లోబ్ రేకెత్తుతున్నారు!
దాని లక్షణాలు సైతం సరిగ్గా అలాంటి సందేహాలకు ఊతమిచ్చేలానే ఉన్నాయి! అంతర్ నక్షత్ర మండలం నుంచి వచ్చిన 3 వ భౌతికరాశి కావడం [ఒకటోది 1ఐ/ఓమూవమూవ, రెండోది 2ఐ/బోరిసోవ్], హవాయిలోని అట్లస్ దూరదర్శిని [#Telescope] ఫస్ట్ గుర్తించడం వల్ల, దానికి ఖగోళశాస్త్రవేత్తలు 3ఐ/అట్లస్ అని పేరు పెట్టారు!
ఐతే, ఏలియన్ల ఉనికిని ప్రస్తావించే ఆనాటి ఆ వావ్ రేడియో సిగ్నలైనా, ఈనాటి ఈ 3ఐ/అట్లసైనా, ఒకే దిశ నుంచి రావడం పెద్ద సందడి [#Buzz] కి కారణమైంది! గ్రహాంతరవాసుల సిద్ధాంతాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది!
సాధారణంగా మనకు కనిపించే తోకచుక్కలు సౌర మండలంలోని క్యూపియర్ బెల్టు [#KuiperBelt] లో పురుడు పోసుకుంటాయి! హేలీ, షూమేకర్ కామెట్స్ ఈ క్యాటగరీకి చెందినవే! ఆ జోన్ నుంచి విడివడే ధూమకేతువులు, శని, బృహస్పతి లాంటి బాహ్య గ్రహాల [#OuterPlanets] ను దాటి, భూమి, మార్స్ లాంటి అంతర్ గ్రహాల [#InnerPlanets] వైపు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తాయి! కానీ, చాలా వరకు విఫలం ఔతాయి!
జుపిటర్ గురుత్వాకర్షణ శక్తికి లోనై, దానిపైనే పడిపోతుంటాయి! అలా, భూమిని కాపాడుతూ బృహస్పతి మానవాళికి ఒక రక్షకుడిగా పని చేస్తుంటాడు! కానీ, ఈ 3ఐ/అట్లస్ ఆ కోవలోకి రాదు! ఇది ఒక అంతర్ తారా మండల బాటసారి [#Traveller].
అమెరికాలోని మన్హట్టన్ నగరం అంత విస్తీర్ణం ఉండే దీని వయసు 8 నుంచి 10 బిలియన్ సంవత్సరాలు! మన సౌరమండలం వయసు 4.5 బిలియన్ ఏళ్లు! అంటే, ఈ తోకచుక్క, భూమి, ఆమాటకొస్తే మన సౌరవ్యవస్థ పుట్టక ముందే పుట్టిందన్నమాట!
మన పాలపుంత [#MilkyWayGalaxy] లో, అంటే మనకు దక్షిణాకాశంలో ధనురాశి [#Sagittarius] నక్షత్ర మండలం ఉంది! వావ్ రేడియో వేవ్ ఐనా, 3ఐ/అట్లస్ ఐనా ధనురాశి వైపు నుంచి భూమిపైకి దూసుకొచ్చాయి అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.
ఈ దృగ్విషయం కేవలం కాకతాళీయమేనా? లేక ఈ పరిణామాల వెనక ఎవరైనా తెలివైన జీవులు [#IntelligentBeings] ఉన్నారా? అన్న కోణంలో ప్రపంచవ్యాప్తంగా శాస్త్రలోకంలో సంవాదనలు జరుగుతున్నాయి!
మన పాలపుంత మధ్యభాగంలో ఉన్న ఒక నక్షత్రం లేదా గ్రహం నుంచి 5 బిలియన్ కాంతి సంవత్సరాల క్రితం విడిపోయి ఇటువైపు దూసుకొచ్చిన ఆ శకలం ధూమకేతువు కాదు దుష్టకేతువు అన్న చర్చ గట్టిగా జరుగుతోంది! భూగ్రహవాసులకు దానివల్ల ముప్పు పొంచి ఉందన్న సిద్ధాంతాలు కూడా ఉన్నాయి!
అందులో నిజంగానే ఏలియన్స్ ఉంటే, ఏ క్షణమైనా వాళ్లు మనపై తెగబడే అవకాశం ఉంటుందన్న గుబులు కూడా వెంటాడుతోంది! కర్మ కాలితే మనం కూడా ఈ వింత పరిణామాలకు అనివార్యంగా ప్రత్యక్షసాక్షులం, బాధితులం కూడా ఔతాం!
సరే, ఆ సంగతి పక్కన పెడితే, సామాన్య జనంలో సైతం ఖగోళ విజ్ఞానం పట్ల ఆసక్తి పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, ఆ విశిష్ట [#దుష్ట] అతిథి విశేషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది!
ఇంతకీ, ఈ 3ఐ/అట్లస్ లక్షణాలు ఏంటి? అది ఒక తోకచుక్క కాదు, అంతరిక్షనౌక అనదగ్గ ఫీచర్స్ దానికి ఏమున్నాయి? అన్న ప్రశ్నలు తలెత్తితే, దాని నియమవిరుద్ధమైన [#Anomalous] ప్రవర్తన అనేక ఊహాగానాలకు తావిచ్చేలా చేస్తోంది! దానికి మాత్రమే ఉన్న కొన్ని స్వభావాలు యావత్ ఖగోళశాస్త్ర ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి!
ఈ ఏడాది జులై 1 వ తేదీన మనిషి దృష్టిలో పడ్డ ఈ అంతరిక్ష అతిథి అతివలయకక్ష్య [#HyperbolicOrbit] లో సెకనుకు 61 కిలో మీటర్ల [గంటకు లక్షా 30 వేల మైళ్ల] వేగంతో వినువీధిలో దూసుకెళ్తోంది! 2023 చివర్లో లేదా 2024 మొదట్లో ఈ ధూమకేతువు గప్చిప్గా మన సౌరవ్యవస్థలోకి ప్రవేశించింది!
2024 వ సంవత్సరం మధ్యలో అది నెప్ట్యూన్ గ్రహాన్ని దాటింది! 2025 జనవరి – ఫిబ్రవరి మధ్యలో శనిగ్రహం మీదుగా అక్టోబర్ 29 వ తేదీన సూర్యునికి అతి దగ్గర [#Perihelion] కు చేరింది! సాధారణంగా ఏ ఖగోళ వస్తువైనా సూర్యుని గురుత్వాకర్షణ శక్తికి ఇట్టే లొంగిపోతుంది! ఫలితంగా సూర్యగోళంలో పడిపోతుంది! కానీ, 3ఐ/అట్లాస్ ప్రవర్తన అందుకు పూర్తి భిన్నంగా ఉంది!
అవసరానికి అనుగుణంగా పక్కకు తప్పుకుంటూ అది పయనిస్తున్న మార్గాన్ని సైతం మార్చుకుంటోంది. అంటే, దాన్ని ఎవరో నియంత్రిస్తున్నారన్నది ఒక అంచనా! మామూలు ఖగోళ వస్తువులకు 0.1% కూడా సాధ్యంకాని ఒక అరుదైన కక్ష్య [#RareOrbit] లో 3ఐ/అట్లస్ ప్రయాణిస్తోంది!
మార్గమధ్యంలో ఎర్త్, వీనస్, మార్స్ జుపిటర్ లాంటి ప్లానెట్స్ ను ఫోటోలు తీసుకునేంత కచ్చితమైన ట్రాక్ ను అది ఫాలో అవడం ఆశ్చర్యకరం! అలా మన సోలార్ సిస్టంను, అందులోని గ్రహాలను మ్యాప్ చేసి అధ్యయనం చేయడానికే ఈ అంతరిక్ష నౌకను గ్రహాంతరవాసులు ప్రయోగించారేమో అన్నది ఒక సీరియస్ డౌట్!
అన్నిటికంటే ముఖ్యంగా ఈ అంతర్ తారా మండల గ్రహ శకలంపై నికెల్ [#Ni] ఉండటం మిస్టరీగా మారింది! అది నిజంగా ఒక సహజసిద్ధమైన ఖగోళ రాశి అయుంటే, దానిపై ముడి ఇనుము తాలూకు ఆనవాళ్లు ఉండాలి! కానీ, నికెల్ లోహ మిశ్రమం [#MetalAlloy] జాడ స్పష్టంగా కనిపిస్తోంది!
ఒక్క నాగరిక జీవులు [#CivilisedBeings] మాత్రమే ఇలా ముడి ఇనుమును నికెల్ గా శుద్ధి చేసి, వాళ్లకు అవసరమైన రీతిలో మన్నికైన వస్తువులను తయారు చేసుకోగలుగుతారు! అంటే, ఆ క్రాఫ్ట్ లో ఏలియన్స్ ఉండి ఉంటారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది!
3ఐ/అట్లస్ ఊసరవెల్లిలా రంగులు మార్చడం మరో అంతుచిక్కని ప్రక్రియ! అట్లస్ దుర్భిణీకి చిక్కిన తొలిదశలో అరుణవర్ణ కాంతిలో మెరిసిన ఈ ధూమకేతువు, ఆ తరవాత గ్రీన్ బ్లూ షేడ్ లోకి మారిపోయింది! సూర్య ప్రదక్షణ తరవాత తాజాగా అది నీలం రంగులో కనిపిస్తోంది!
- క్రయోజెనిక్ ఇంజన్ల సాయంతో పయనిస్తూ కృత్రిమ లైట్లు కలిగిన వ్యోమనౌక కావడం వల్లనే అది ఎరుపు రంగులో కనిపించిందేమో! అలాగే, ఆకుపచ్చగా కనిపించేది, ఆ అంతరిక్ష నౌక చుట్టూ ఉన్న నికెల్ అయాన్ల రక్షణ కవచం కావచ్చేమో! ఇక, దట్టమైన వాయుమేఘం [#GaseousCloud] లా సూర్యునికి వ్యతిరేక దిశలో కనిపించే తోక, ఆ స్పేస్ షిప్ ను నడిపే చోదకవ్యవస్థ [#ThrusterPropulsionSystem]] అయుండొచ్చేమో! అన్న విశ్లేషణలు ఉన్నాయి!
ఏది ఏమైనా, 3ఐ/అట్లస్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది గ్లోబ్! రిటర్న్ షూట్ ఔట్ లో భాగంగా అది, డిసెంబర్ 19 వ తేదీన భూగోళానికి దగ్గరగా అంటే, 170 మిలియన్ మైళ్ల దూరం నుంచి మెరుపువేగంతో దూసుకుపోనుంది! ఈ అనుకోని అతిథి గుట్టు రట్టు చేయడానికి సరిగ్గా ఇదే అదునుకోసం ఎదురుచూస్తున్న భూ, అంతరిక్ష ఆప్టిక్, రేడియో టెలిస్కోపులన్నీ ఇప్పుడు ఆవైపే ఎక్కుపెట్టి ఉన్నాయి!
ఆ లెన్సులకు చిక్కిందే తడవు, సదరు ఖగోళ వస్తువు స్పష్టమైన ఛాయాచిత్రాలు సేకరించి, దాని పథం [#Trajectory] ని కచ్చితంగా లెక్కగట్టడం, దాని వర్ణపటం [#Spectrum] ను స్టడీ చేయడం, ఆ ఖగోళ రాశి అసలు పరిమాణం [#CoreSize], దాని ద్రవ్యరాశి [#Mass], దాని చుట్టూ ఆవరించి ఉన్న వాయువులు, రసాయన కూర్పు [#ChemicalComposition], లోపల ఏమైనా జీవం ఆనవాళ్లు [#BioSignatures] ఉన్నాయా? అన్న వివరాలను విశ్లేషిస్తారు!
ఇక, 3ఐ/అట్లస్ హాట్ టాపిక్ గా మారడానికి కచ్చితమైన నేపథ్యం, అప్రమత్తత రెండూ ఉన్నాయి! 2017 లో భూగ్రహానికి అతిదగ్గరగా వచ్చిన మొట్టమొదటి ఇంటర్ స్టెల్లార్ ఆబ్జెక్టు ఓమూవమూవను పసిగట్టలేకపోయాం అన్న చింత ఖగోళ భౌతిక శాస్త్రజ్ఞులను ఇంకా వెంటాడుతోంది!
ఆనాడు కనిపించిన ఆ ఖగోళ వింత వస్తువు కూడా ఒక గ్రహాంతర వ్యోమనౌకనే అనీ, మానవాళి కళ్లుగప్పి సౌరవ్యవస్థ రహస్యాలను తెలుసుకునేందుకు ఏలియన్సే దాన్ని పంపించి ఉంటారన్నది కొందరు ఆస్ట్రోఫిజిసిస్టుల భావన!
ఆ ఖగోళ శకలం ఆకారం, వేగం, కదలికలు, దాని ట్రాజెక్టరీ, కెమిస్ట్రీ, అన్నీ వింత [#Weird] గా ఉండటం అప్పట్లో శాస్త్రలోకాన్ని ఉలిక్కిపాటుకు గురి చేశాయి! కనువిప్పు కలిగి ఓమూవమూవ విశేషాలు కనుక్కుందాం అని కాస్మాలజిస్టులు అనుకునేలోపే అది వినువీధిలో సుదూర తీరాలను దాటేసి మాయమైపోయింది!
సో, ఈసారి ఆ ఛాన్స్ మిస్సవకుండా డిసెంబర్ 19 కోసం వాళ్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు! నభోరంగంలో విశిష్ట అతిథి ఐన 3ఐ/అట్లస్ పై డేగకన్ను వేసి ఉంచిన సైంటిఫిక్ కమ్యూనిటీ, 24 అవర్స్ ఆన్ టోస్ కీన్ అబ్జర్వేషన్లో ఉంది! ………………….. సూరజ్ వి. భరద్వాజ్.
Share this Article