Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

…. అందరూ తనూజను ఇక్కడే అండర్ ఎస్టిమేట్ చేశారు మరి..!!

December 12, 2025 by M S R

.

పర్‌ఫెక్ట్ గేమ్‌ప్లాన్… తెలివైన ఆట… అందరూ ఈ బిగ్‌బాస్ 9వ సీజన్‌లో తనూజను చాలామంది అండర్ ఎస్టిమేట్ చేశారు… ‘‘ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో తెలిసిన చతుర ప్లేయర్… ఎప్పుడూ ఏడుపుతో సానుభూతి పొందుతుంది, బాండింగుతో సపోర్ట్ తీసుకుంటుంది…’’ ఇలా ఆమె మీద ట్రోలింగ్… వోట్ అప్పీల్ అవకాశం వచ్చినప్పుడు అందరూ ఆమెతో ఆడుకున్నారు అనే విమర్శలూ, పోస్టులు కూడా కనిపించాయి… కానీ..?

రియాలిటీ వేరు… రెండుసార్లు ఆడియెన్స్ ఆమెకే వోట్ అప్పీల్ అవకాశం ఇచ్చారు… బయట వినిపించే ప్రశ్నలన్నీ సంధించారు… ఎక్కడా తొణక్కుండా బ్యాలెన్స్‌డ్‌గా, మెచ్యూర్డ్‌గా జవాబులు ఇచ్చింది… దాదాపు అందరూ ఆమెను ‘నువ్వే విన్నర్’ అంటూ ముందస్తు శుభాకాంక్షలు చెప్పారు…

Ads

తాజాగా ఏమిటీ అంటే…? బిగ్‌బాస్ సెకండ్ ఫైనలిస్టు పోటీ నుంచి భరణి ఔట్… తరువాత టాస్కులో సంజన ఔట్… ఇమ్మూ, తనూజ గెలుస్తారు… తరువాత చేతులు ఉపయోగించకుండా బెలూన్ ఊదుతూ పైపులో వేయాలి… ఇమ్మూ లీడ్… తరువాత మళ్లీ ఆ ఇద్దరికే వెయిట్ లిఫ్టింగ్ టాస్క్… అందులో తనూజ విన్…

సో, మొత్తంగా తనూజ లీడ్ పాయింట్స్… నేరుగా ఆమెను సెకండ్ ఫైనలిస్టు అని డిక్లేర్ చేయకుండా… కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి… నీ దగ్గర అమౌంట్‌ను ఖాతాలో వేయాలా లేక సెకండ్ ఫైనలిస్టు అవుతావా అనడుగుతాడు…

మామూలుగా వేరే కంటెస్టెంట్ అయితే వెంటనే ఎగిరి గంతేసి, సెకండ్ ఫైనలిస్ట్ ఆప్షన్ ఎంచుకుంటారు.,. కానీ తనూజ డిఫరెంట్ కదా… ఓటమో, గెలుపో జానేదేవ్… ఆడియెన్స్ తీర్పుపైనే నమ్మకంతో… ఈ రెండు ఆప్షన్స్ వద్దు, ఆడియెన్స్ వోట్లతోనే ఫైనల్స్‌కు వెళ్తాను అంటుంది… ట్రూ గేమ్ స్పిరిట్… దీంతో ఆడియెన్స్‌లో మరింతగా ఎదిగింది…

tanuja

ఒక చెత్తా ట్రోలింగ్, ఆమెపై వ్యతిరేక ప్రచారాన్ని చెప్పుకోవాలి… (వేరే కంటెస్టెంట్ల పీఆర్ టీమ్స్)… ఆమె కన్నడ కదా, ఎలా వోట్లేస్తారు అని..! క్షుద్ర ప్రచారం… అది ఫలించదు… మూర్ఖపు ఎత్తుగడ అది… గతంలో శిల్పాశెట్టి మీద, ప్రియాంక జైన్, ప్రేరణల మీద ఇలాగే… తరువాత నిఖిల్ మీద ఇదే… కానీ ప్రేక్షకులు నిఖిల్‌ను గెలిపించారు…

కొందరేమో కల్యాణ్ కులాన్ని తెర మీదకు తీసుకొచ్చారు… తను ఆర్మీ కాదు అనే మరో వాదన… అది మరో మూర్ఖపు ప్రయత్నం… గతంలో నబీల్‌కు ఇలాగే మెహబూబ్ కమ్యూనిటీ వోటింగు అని చెబితే… ప్రేక్షకులు లైట్ తీసుకున్నారు… అది నబీల్‌కే మైనసయింది… (గతంలో సోహైల్‌తోనూ మెహబూబ్ ఇదే తంతు…)

ఇలాంటి ధోరణులకు బిగ్‌బాస్ గానీ, ప్రేక్షకులు గానీ ప్రభావితం గాకపోవడం ప్రశంసనీయం… (కాకపోతే పల్లవి ప్రశాంత్ విషయంలో మాత్రం ప్రేక్షకులు అడ్డంగా బోల్తా కొట్టారు, అది వేరే సంగతి)…

సరే, మరో అంశానికి వద్దాం… మొదట్లో ఇమూన్యుయెల్ విజేత అన్నంత పాపులారిటీ వచ్చింది… నిజంగానే తను ఎంటర్‌టైనర్, తెలివైన ప్లేయర్… తనూజకు దీటైన పోటీ… కానీ సేఫ్ గేమ్ కావచ్చు, ఇంకేదైనా కారణం కావచ్చు… కల్యాణ్ దూసుకొచ్చాడు తనూజకు పోటీగా… (ఇద్దరికీ తనూజ పట్ల సాఫ్ట్ కార్నర్)… మరీ ఓ అనఫిషియల్ వోటింగు చూస్తే ఆశ్చర్యమేసింది… (అఫ్‌కోర్స్, జస్ట్ ఫర్ డిబేట్ ఓన్లీ… ఇమ్మూ మరీ అంత బలహీన కంటెస్టెంట్ కాదు…)

bb9

ఈ జాబితాలో ఉన్నట్టుగానే సుమన్ శెట్టి లీస్ట్ వోటింగ్… బహుశా ఈసారి ఎలిమినేట్ అయ్యేది తనేనేమో… కానీ దిగువ నుంచి ఇమాన్యుయెల్ రెండో ప్లేసులో ఉండటమే ఆశ్చర్యం… డబుల్ ఎలిమినేషన్ ఉండే పక్షంలో సుమన్ శెట్టితోపాటు ఇమాన్యుయెల్‌ను కూడా పంపించేస్తారా..? మరీ సంజనకన్నా, భరణికన్నా తీసిపోయాడా..?

అదే సందేహం… అసలు సంజనకు అన్ని వోట్లు అనేదే పెద్ద సందేహం… సో, తనూజ పట్ల ఆదరణ ఇలాగే కొనసాగితే… కల్యాణ్, తనూజ చివరి వరకూ విజేత పోటీలో ఉంటారు… లేడీ విన్నర్ అనుకునే పక్షంలో… మొదటి నుంచీ నామినేషన్లలో ఉంటూ, నిలబడిన తనూజకు చాన్స్… అఫ్‌కోర్స్, కల్యాణ్ వోటింగును కూడా తక్కువ అంచనా వేయటానికి వీల్లేదు… అర్హుడు కూడా..!!

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మేడారంలో మంత్రి సీతక్కతో డాన్స్… ఎవరామె..? ఒక్కసారిగా వైరల్..!!
  • బహుపరాక్..! అత్యంత చంచలంగా వెండి- బంగారం ధరలు…!!
  • టేబుల్ టాప్ రన్ వే..! అజిత్ పవార్ ప్రమాదంతో మళ్లీ చర్చల్లోకి..!!
  • గాంధీ టాక్స్..! మాటల్లేనితనానికి రెహమాన్ సంగీతంతో భర్తీ…!
  • కులవివక్ష..! యూజీసీకి సుప్రీంకోర్టు అక్షింతలు ఎందుకో తెలుసా..?
  • ఓం శాంతి శాంతి శాంతి – మలయాళం రీమేక్‌కు దర్శకుడి తడబాటు..!
  • ఓ శాపగ్రస్త… ఆమె బతుకంతా బాధలే… గాయాలే… మళ్లీ తాజాగా మరో చేదు…
  • తిరుమలలో ఆ రోజులే వేరు… ఆశీస్సులు, బుట్టల నిండా ప్రసాదాలు…
  • త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆ ఐదు రాష్ట్రాలు ఏమంటున్నాయి..?
  • బీఆర్ఎస్, వైసీపీ… ఎక్కడేసిన గొంగళి అక్కడే… MOTN సర్వే…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions