.
సాధారణంగా బిగ్‌బాస్ షోలో లవ్ ట్రాకులు కామన్… కాకపోతే అవి స్క్రిప్టెడ్… ప్రేక్షకులను ఎంటర్‌టెయిన్ చేయడం కోసం, కాస్త రొమాంటిక్ టచ్ కోసం… ఆ క్రియేటివ్ టీమ్స్ రాసిచ్చిన స్క్రిప్ట్ మేరకు అలా నటిస్తారు… అంటే ఆ లవ్వు ఒక షో… బయటికి వెళ్లాక ఎవరి బతుకులు వాళ్లవే…
కానీ ఈసారి బిగ్‌బాస్ 9వ సీజన్‌లో ఓ ప్రేమ కథ కాస్త డిఫరెంటుగా నడుస్తున్నది… మొన్నమొన్నటిదాకా డిమోన్ పవన్, రీతూ చౌదరి లవ్ ట్రాక్… మాస్ తరహా… ఇద్దరూ రక్తికట్టించారు స్క్రిప్ట్ ప్రకారం నటించి… గుడ్…
Ads
ఇప్పుడు చెప్పుకునేది వేరు… తనూజ, పడాల కల్యాణ్… ఈ ఇద్దరి నడుమ ప్రణయం చిగురించి, నిశ్శబ్దంగా పెరుగుతోంది… కొన్నాళ్లుగా యూట్యూబ్, సోషల్ మీడియా రాస్తూనే ఉంది… కానీ రాత్రి కల్యాణ్ బయటపడ్డాడు…
రాత్రి ఐదుగురు ఫైనలిస్టులు బిగ్‌బాస్ షోతో తమ తత్వాల్లో వచ్చిన మార్పుల గురించి చెప్పుకున్నారు… ఆ సందర్భంగా కల్యాణ్ తనూజ వైపు చూస్తూ… అనురాగ దృక్కులతో… జీవితాంతం ఈమె ఫ్రెండ్‌షిప్ కోరుకుంటున్నాను, కాదు, ఫ్రెండ్‌షిప్‌ను మించి అని స్ట్రెయిటుగా చెప్పేశాడు… ఆమె నుంచి సానుకూల చూపులు, కాస్త సిగ్గుతో…
సో, ఇది స్క్రిప్టెడ్ లవ్ ట్రాక్ కాదు… ఏదో బంధం బలంగానే పెనవేసుకున్నట్టుంది… మంచిదే… కల్యాణ్‌కు తన పేరెంట్స్‌తో పెద్దగా ఎమోషనల్ బాండింగ్ ఉన్నట్టు లేదు, అది తనే చెప్పుకున్నాడు… తనూజ కథ వేరు… అక్క పెళ్లయింది, ఓ కొడుకు… ఈమె హౌజులో ఉన్నప్పుడే చెల్లెలి పెళ్లయింది… హౌజులోకి వస్తే గాజులు, పువ్వులతో ‘పెళ్లికూతుర్ని’ చేసుకుని మురిసిపోయింది…
మరి తనూజకు ఏమైనా బ్రేకప్ వ్యవహారాలున్నాయేమో… తను మాత్రం పెళ్లికి దూరంగా ఉంది… పెద్దగా నవ్వదు, సీరియస్‌గా ఉంటుంది, ఎమోషనల్, ఏడుపు తన్నుకొస్తూ ఉంటుంది చిన్న ఇష్యూలకు కూడా… 14 వారాలుగా ఇంట్లో ఉంటున్నారు కదా… సమాజానికి దూరంగా… టీవీలు, ఫోన్లు లేకుండా… సో, మాటలు తోటి కంటెస్టెంట్లతో… తమ గురించి చెప్పుకుంటూ… దగ్గరవుతారు… వీళ్లది ఇంకాస్త ముందుకు వెళ్లి, జీవితాల్ని కలుపుకుందాం అనేదాకా…

నిజానికి ఇద్దరూ మంచి జంటే చూడటానికి..! కల్యాణ్‌కు కూడా ఓ లవ్ ఎఫయిర్ ఉన్నట్టుంది… కల్యాణ్ అమ్మ హౌజులోకి వచ్చినప్పుడు కూడా ఈ ప్రస్తావన వచ్చింది… ఐనాసరే, ఈ ఇద్దరి నడుమ ఇప్పుడు పెరిగిన ప్రేమ సరే, మరి బయట ప్రేమల మాటేమిటి..? అదొక్కటే ప్రశ్న…
హౌజులోకి వచ్చినప్పుడు కల్యాణ్ కామనర్… తనూజ సెలబ్రిటీ… ఇప్పుడు ఇద్దరూ సెలబ్రిటీలే… కల్యాణ్ తల్లి హౌజులోకి వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు తనూజ ఓ చీరెను ప్రజెంట్ చేసింది అనూహ్యంగా… ఎందుకని కల్యాణ్ తరువాత అడిగితే ‘ఇవ్వాలనిపించింది ఇచ్చాను, అంతే’ అంటూ అందరికన్నా నువ్వే నన్ను బాగా అర్థం చేసుకున్నావు కదా అంది… తరువాత కల్యాణ్ ఇక తనూజ తోక అయిపోయాడు…
ఇప్పటికిప్పుడు అడిగితే తనూజ కోసం కప్పు త్యాగం చేస్తాను అంటాడేమో… అంత పెనవేసుకుపోయింది ప్రేమ… తనూజ డీసెంటుగా ఉంటుంది హౌజులో… కావాలని దగ్గరయ్యే ప్రయత్నాలను ఎవరినీ చేయనివ్వదు… కల్యాణ్ కూడా ఒకటీరెండు సందర్భాల్లో తప్ప డీసెంటుగా ఉంటాడు అందరితోనూ… అన్నట్టు... ప్రస్తుతం వోటింగులో కల్యాణ్ టాప్, తరువాతే తనూజ... ఏమో, చివరకు బిగ్‌బాస్ ఏమంటాడో గానీ..!!
Share this Article