Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నితిన్ నబీన్..! ఈ చిత్రగుప్తుడి వారసుడి చేతిలో బీజేపీ భవిష్యత్తు..!!

December 18, 2025 by M S R

.

దేశవ్యాప్తంగాఆకర్షించిన వార్త… బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంటుగా నితిన్ నబీన్ ఎంపిక..! అదేమిటీ, ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కదా ఇప్పుడు జరగాల్సింది అంటారా..?

ఇక మన కిషన్ రెడ్డికి చాన్స్ లేనేలేదా అంటారా..? లేదు, తనేమిటో మోడీ షాకు ఐడియా ఉందిలే గానీ… నితిన్ నబీన్ కాబోయే బీజేపీ జాతీయ అధ్యక్షుడు… అది క్లియర్… ఎందుకంటే, ఇప్పుడు తనను వర్కింగ్ ప్రెసిడెంటుగా ఎంపిక చేయడం జస్ట్, ఓ తాత్కాలిక సర్దుబాటు… (ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంటు, తరువాత ప్రెసిడెంటు)…

Ads

అదీ ఎందుకంటే… ప్రస్తుతం మంచి రోజులు లేవు… ప్రకటించలేరు… పైగా పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకే, బహుశా జనవరిలో అధ్యక్షుడిగా ప్రకటన… ఇలా చాలా కారణాలు వినిపిస్తున్నాయి గానీ… ఎవరు ఈ నితిన్ నబిల్..! ఎందుకు తన ఎంపిక లేదా ఎన్నికకు ప్రాధాన్యం..?

పైగా ఈ పేరు బయటికి రాగానే అందరూ తన కులం ఏమిటీ అని చూస్తున్నారు గూగుల్‌లో..! మన దేశంలో ఇది కామనే కదా… కులం రాజకీయాల్ని, రాజకీయం సమాజాన్ని శాసిస్తుంది… సరే, తన వివరాల్లోకి, కులం విశేషాల్లోకి వెళ్దాం ఓసారి…

తనది బీహార్… పార్టీలో ఈ రేంజ్ పోస్టుకు ఎదిగిన నేతల్లో అత్యంత పిన్న వయస్కుడు… తండ్రి నబీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా… మూడుసార్లు ఎమ్మెల్యే ఆయన… హఠాత్తుగా ఆయన మరణించడంతో బిట్ (మెస్రా)లో చదువుతున్న నితిన్ ఆ పరిస్థితుల దృష్ట్యా రాజకీయ వారసుడయ్యాడు… ఈయన అయిదు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు… మంత్రి అయ్యాడు…

ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ ఎన్నికల పనితీరుతో ఆర్గనైజేషన్లో మంచి పేరు సంపాదించాడు… చిన్న వయస్సులోనే రాజకీయాల్లో ఆరితేరాడు, ఇక మంచి చాన్స్ ఇద్దాం అనుకుంది బీజేపీ… ప్రత్యేకించి మోడీ షా…  తన వయస్సు 45 సంవత్సరాలు… (తను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు తన వయస్సు 26 సంవత్సరాలు)… (52 ఏళ్ల వయస్సులో బీజేపీ చీఫ్ అయ్యాడు నితిన్ గడ్కరీ... అదే పేరున్న ఈ నితిన్ 45 ఏళ్లకే బీజేపీ చీఫ్ కాబోతున్నాడు...)

కులం… బీహార్ రాజకీయాల్లో కులం చాలా ఇంపార్టెంట్… ఆ రాష్ట్రంలో ఒక శాతం కూడా లేని (0.6 %) కాయస్థ కులం నుంచి వచ్చాడు నితిన్… కొన్ని రాష్ట్రాల్లో కాయస్థ కులం అగ్ర కులం… బీహార్‌లో కూడా ఓసీ… అక్కడ బ్రాహ్మణ, భూమిహార్, రాజ్‌పుత్‌లతో పాటు కాయస్థులు కూడా నాలుగు ప్రధాన అగ్రవర్ణాల్లో ఒకటి…

మన కరణాలు, పట్వారీలు, నియోగ బ్రాహ్మణుల టైపు… కాయస్థులు చిత్రగుప్తుడి (యమలోకంలో పాపపుణ్యాల రిజిష్టర్లు మెయింటెయిన్ చేసే కీలకాధికారి తనే) వారసులుగా పరిగణించబడతారు… బ్రహ్మదేవుడు తన శరీరం (కాయం) నుండి చిత్రగుప్తుడిని సృష్టించాడని, అందుకే వీరికి ‘కాయస్థ’ అనే పేరు వచ్చిందని నమ్ముతారు…

ఎంతో కాలం నుండి కాయస్థులు విద్యావంతులుగా, మేధావులుగా పేరు పొందారు… వీరు సంప్రదాయబద్ధంగా రాజులు, సంస్థానాధీశుల వద్ద కూడా అడ్మినిస్ట్రేటర్లు, అకౌంటెంట్లు, మంత్రులుగా పనిచేశారు… మొఘలుల కాలంలోనూ, బ్రిటిష్ కాలంలోనూ తమ విద్యా నైపుణ్యంతో ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పదవులు నిర్వహించారు…

కాయస్థులలో ప్రధానంగా 12 శాఖలు (ఉప కులాలు) ఉన్నాయి… వీటిని చిత్రగుప్తుడి 12 మంది కుమారుల పేర్లతో పిలుస్తారు…

  1. శ్రీవాస్తవ

  2. సక్సేనా

  3. నిగమ్

  4. మాథుర్

  5. అస్థానా

  6. భట్నాగర్

  7. అంబష్ఠ

  8. కర్ణ్

  9. గౌర్

  10. కులశ్రేష్ఠ

  11. వాల్మీకి

  12. సూర్యధ్వజ

  • ఈ సామాజిక వర్గం నుండి కొందరు ప్రముఖులు… స్వామి వివేకానంద, నేతాజీ సుభాష్ చంద్రబోస్, డా. రాజేంద్ర ప్రసాద్ (భారత తొలి రాష్ట్రపతి), లాల్ బహదూర్ శాస్త్రి (మాజీ ప్రధానమంత్రి), జైప్రకాష్ నారాయణ్, అమితాబ్ బచ్చన్ (సినీ రంగం)…

 

ప్రతి ఏటా దీపావళి తర్వాత “చిత్రగుప్త పూజ”ను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు… ఆ రోజున వీరు తమ కలం, పుస్తకాలను పూజిస్తారు.., ఒకవైపు కాంగ్రెస్ కులగణన, యాంటీ ఓబీసీ పాట పాడుతుంటే… బీజేపీ మాత్రం కులాన్ని, కులప్రాధాన్యాన్ని గాకుండా… ఏకంగా అధ్యక్ష  పదవికి అవేవీ ప్రామాణికాలుగా తీసుకోకుండా… ఇక యువరక్తానికి అధిక ప్రాధాన్యం ఇవ్వబోతున్నదీ అనడానికి నితిన్ నబీన్ ఎంపిక ఓ తార్కాణం అని చెప్పుకోవచ్చునేమో…

ఎందుకంటే..? మోడీ షా లెక్కలు మామూలుగా ఉండవు... అవి కాయస్థ చిత్రగుప్తుడి లెక్కలకన్నా పవర్ ఫుల్..!! హిందూ- హిందీ కార్డు ప్లస్ మేధోనేపథ్యం ఇది... సంఘ్ పదవుల్లో కూడా ఎక్కువగా యాభై, యాభై అయిదులోపు వయస్సు వారిని తీసుకుంటున్నారు... ఏదో మార్పు మొదలైంది..!! మోడీషా బీజేపీ అంటే కేవలం గుజరాతీల ప్రాబల్య పార్టీ అనే ముద్రనూ తొలగించుకుంటోంది..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
  • పాకీజా, శ్యామల, జయవాహిని… రంగులు వెలిసిన జీవితాలు…
  • రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!
  • మోహన్‌లాల్ తోపు ఐతేనేం… ఆమె కడిగేసింది… తెలుగులో ఊహించగలమా…
  • ఉన్నత శిఖరాలెక్కి… అక్కణ్నుంచి అమాంతంగా చీకటి లోయల్లోకి…!!
  • నితిన్ నబీన్..! ఈ చిత్రగుప్తుడి వారసుడి చేతిలో బీజేపీ భవిష్యత్తు..!!
  • పవర్‌లో ఉంటే పవిత్ర జంపింగ్స్-! ప్రతిపక్షంలో ఉంటే అదే అనైతికమట…!!
  • అప్పట్లో బాలయ్య, విజయశాంతి ఉంటే చాలు… సినిమా నడిచేది…
  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions