.
దేశభక్తి, క్షుద్ర మాంత్రికులు, దైవశక్తి, మూఢ నమ్మకాలు, సనాతన ధర్మ ప్రవచనాలు, అతీంద్రియ పోరాటాలు…. ఇదే కదా ఇండియన్ సినిమా ప్రజెంట్ ట్రెండ్… అఖండ2 సినిమాలో అవన్నీ ఉన్నాయి కదా… అత్యధిక తీవ్ర మోతాదులో… పైగా హిందీ ప్రమోషన్లు కూడా చేశారు కదా హీరో దర్శకులు, వచ్చీరాని హిందీలో…
పైగా ఆర్ఎస్ఎస్ బాసు మెచ్చుకుని, ప్రధాని ప్రత్యేక షో వేయించుకుని చూసి… కాషాయ క్యాంపు నెత్తినెత్తుకున్నా సరే… ఇన్ని అనుకూలతలున్నా సరే… బాలకృష్ణను పాన్ ఇండియా స్టార్‌గా ఇతర భాషలు గుర్తించాయా..? ప్రత్యేకించి హిందీ బెల్ట్ తనను యాక్సెప్ట్ చేసిందా..?
Ads

సమాధానం…. లేదు, నిష్కర్షగా ఉన్నా సరే, నిజం మాత్రం ఇదే… దానికి వసూళ్ల తీరే నిదర్శనం… సదరు నిర్మాణ సంస్థ ప్రచారం చేసుకునే వసూళ్లను పక్కన పెడితే… 5 రోజుల్లో మొత్తం వసూళ్లు 94.5 కోట్లు… గుడ్, కానీ తమిళం, మలయాళం, కన్నడం, హిందీ మొత్తం కలిపినా 3 కోట్ల వసూళ్లు లేవు… అంటే..?

క్లియర్ కట్‌గా అఖండను తెలుగు తప్ప వేరే భాషల ప్రేక్షకులు ఏమాత్రం పట్టించుకోలేదని అర్థం… నాలుగు రోజుల్లో మలయాళం వెర్షన్ మరీ 6 లక్షలు, కన్నడం 12 లక్షలు వసూలు చేసింది… పెద్ద మార్కెట్ హిందీ బెల్టులో 52 లక్షలు… వీటితో పోలిస్తే తమిళం పిసిరంత బెటర్… 1.78 కోట్లు… అంటే బాలయ్య ప్రభావం తెలుగు మార్కెట్‌పై మాత్రమే… తెలుగేతర భాషల్లో డిజాస్టర్…

రాంచరణ్, జూనియర్ ఎన్టీయార్, ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్లు… కారణాలు, ప్రభావాలు ఏమైనా కానీ… వాళ్లు హిందీ బెల్టులోకి కూడా దూసుకుపోయారు… అల్లు అర్జున్, ప్రభాస్ కాస్త ఎక్కువగా… మిగతా హీరోలు జస్ట్, తెలుగు హీరోలు మాత్రమే… (అల్లు అర్జున్‌కు మలయాళంలో చాన్నాళ్లుగా క్రేజ్ ఉంది…) మరి అన్ని అనుకూలతలున్నా అఖండ2 తెలుగేతర మార్కెట్లలో ఎందుకు చతికిలపడింది..?

కారణం… సింపుల్… అతి..! అసలే బాలయ్య, ఆపై బోయపాటి… అత్యంతాతి..! అనేక సీన్లు అసహజంగా ఉన్నాయి… ప్రత్యేకించి హిందీ ప్రేక్షకుడు అస్సలు కనెక్ట్ కాలేదు… పైగా దురంధర్ సినిమా దెబ్బకు వేరే సినిమాలన్నీ కొట్టుకుపోయాయి… చివరకు అంతటి ఫేమస్ షోలేను రీరిలీజ్ చేసినా, 5 రోజుల్లో 2 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది… ధర్మేంద్ర మరణం పట్ల సానుభూతి కూడా పనిచేయలేదు…

దురంధర్ ఏకంగా ఛావా, పుష్ప2 వంటి సినిమాల రికార్డులను కూడా బ్రేక్ చేసి, ఐదారు రోజుల్లోనే 620 కోెట్లను ఇప్పటికే కొల్లగొట్టింది… ఇంకా హవా నడుస్తూనే ఉంది… కావాలని కొందరు దాని మీద నెగెటివ్ క్యాంపెయిన్ చేస్తున్నా సరే, థియేటర్లు నిండుతూనే ఉన్నాయి…

ఏతావాతా తేలేది ఏమిటయ్యా అంటే… కథ ప్రజెంట్ ట్రెండుకు సరిపడా ఉన్నా సరే… ఆకట్టుకునేలా చెప్పగలగాలి, చూపగలగాలి… అది లేకపోతే ఇలాగే… బాలయ్య అంటే తెలుగువాడికి ప్రేమ, అభిమానం, హిందీ వాడికి ఉండాలనేముంది..?! అదే జరిగింది..!!

Share this Article