Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?

December 17, 2025 by M S R

.

ఎక్కడ ఉగ్రవాద సంఘటన జరిగినా, దానికీ హైదరాబాద్‌కూ ముడిపెడుతూ… ‘హైదరాబాద్ మూలాలు ఉంటున్నాయి తెలుసా’ అంటూ… ప్రతి సంఘటకూ హైదరాబాద్ మీద ముద్ర వేయడం కరెక్టు కాదు…

ఎందుకంటే..? ఆస్ట్రేలియాలో యూదులపై కాల్పులకు తెగబడి 15 మంది మరణానికి, 35 మంది తీవ్ర గాయాలకు కారకుడైన సాజిద్ అక్రమ్ స్వస్థలంపై ఇప్పుడు రకరకాల వార్తలు, ప్రచారాలు… తనది హైదరాబాదేననీ, అప్పుడెప్పుడో 1998లోనే ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడని తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి క్లారిటీ ఇచ్చాడు…

Ads

‘‘హైదరాబాద్‌లో బీకాం చదివాడు… ఆస్ట్రేలియాలో యూరోపియన్ మూలాలున్న వెనెరా గ్రోస్సోను వివాహం చేసుకున్నాడు… అక్కడే ఓ కొడుకు, ఓ బిడ్డ పుట్టారు… వాళ్లు ఆస్ట్రేలియా పౌరులు… కొడుకు నవీద్ కూడా ఉగ్రదాడిలో తండ్రితోపాటు పాల్గొన్నాడు…

సాజీద్ అక్రమ్ ఇన్నేళ్లలో (27 ఏళ్లు) ఏవో ఆస్తి వ్యవహారాలు, వృద్ద పేరెంట్స్, ఇతర కుటుంబ వ్యవహారాల కోసం ఐదారుసార్లు వచ్చినట్టు తెలుస్తోంది… తండ్రి మరణించినప్పుడు కూడా రాలేదు… తను ఎలా టెర్రర్ భావజాలంలో పడ్డాడో ఎవరికీ సమాచారం లేదంటున్న బంధువులు… తన రాడికలైజేషన్‌కు తెలంగాణ లేదా భారత్‌తో ఎలాంటి సంబంధం లేదు… అసలు 1998కి ముందు సాజిద్ మీద తెలంగాణలో ఎలాంటి నేరచరిత్ర లేదు, కేసులు లేవు…’’




సరే, ఇక ఇప్పుడు మిత్రుడు పొట్లూరి పార్థసారథి రాసిన మరిన్ని వివరాల్లోకి వెళ్దాం…

1940 లో ఒక యూదు జంట( Jewish couple )సైకిల్ మీద పారిస్ వదిలి పారిపోయారు, ఎందుకంటే నాజీ సైన్యం ఫ్రాన్స్ ను ఆక్రమించుకోబుతున్నది! జర్మన్ల చేతిలో చావును తప్పించుకోవడానికి ఫ్రాన్స్ ని వదిలి సైకిల్ మీద పారిపోవాల్సి వచ్చింది. సైకిల్ మీద పోయేటప్పుడు ఆ జంట తమతో పాటు తీసుకెళ్లింది క్యూరియస్ జార్జ్ ‘ అనే మాన్యుస్క్రిప్ట్ ( Curious George) తో పాటు కొన్ని నిత్యావసరాలు మాత్రమే!

sydney

ఆ యూదు జంట పేర్లు హాన్స్, మార్గరెట్ రే ( Hans and Margaret Ray). ఈ జంటకి హిట్లర్ ఫ్రాన్స్ ను ఆక్రమిస్తాడు అని అనిపించి ముందుగానే స్వంతంగా రెండు సైకిల్స్ తయారుచేసి పెట్టుకున్నారు దూర ప్రయాణం కోసం!

  • నాజీ సైన్యం పారిస్ లోకి ఇంకో రెండు రోజుల్లో ప్రవేశిస్తుంది అనగా సైకిల్స్ మీద పారిస్ నుండి 1000 మైళ్ళు ప్రయాణించి పోర్చుగల్ వెళ్లి అక్కడి నుండి పడవలో అమెరికా చేరుకున్నారు!

అమెరికా చేరుకున్నాక హాన్స్, మార్గరెట్ రే కలసి అప్పటికే వ్రాయడం మొదలు పెట్టానే. తమ ప్రయాణం గురించి, అంటే జర్మనీ నుండి ఫ్రాన్స్, అక్కడినుండి పోర్చుగల్, అక్కడి నుండి పడవలో సముద్రం మీద ప్రయాణించి, అమెరికా చేరుకున్న విధానం, తప్పించుకునేటప్పుడు వాళ్ళు పడిన బాధలు, ప్రయాణ కష్టాలు గురించి చేతితో వ్రాసిన మాన్యస్క్రిప్ట్ ని పట్టుకొని పుస్తకం ప్రచురించాలని పబ్లిషర్స్ చుట్టూ తిరగగా చివరికి ఒక పబ్లిషర్ ప్రచురించడానికి ఒప్పుకున్నాడు.

1941 లో మిశ్చివియస్ మంకీ ( Mischievous monkey ) పేరుతో పిల్లల కోసం రూపొందించబడిన ఆ పుస్తకం ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది చరిత్రలో. అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు కాపాడుకోవడానికి కావల్సిన టెక్నిక్స్ ( survival techniques) గురించి ఉంటాయి ఆ పుస్తకంలో!

నిజానికి హాన్స్ అతని భార్య మార్గరెట్ రే జర్మనీ నుండి తప్పించుకుని అమెరికా చేరుకునే క్రమంలో వాళ్ళు పడ్డ కష్టాలు, ఒక కోతి తన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్ని కష్టాలు పడిందో చిత్రాల రూపంలో వివరిస్తూ ముద్రించబడింది!

నిజానికి యూదుల పిల్లలకి చిన్నతనం నుండి సర్వైవల్ టెక్నిక్స్ ను నేర్పడం కోసం చేసిన ప్రయత్నమే క్యూరియస్ జార్జ్ సిరీస్ ముద్రణ చేసింది కానీ అందరికీ ఉపయోగపడుతుంది. ఎప్పుడో 1941 తొలి ముద్రణ అయిన ఆ సీరీస్ అప్పటి కాలంలో లభ్యమయ్యే టెక్నాలజీ ను వాడుకొని ఎలా బ్రతకొచ్చో తెలియచేస్తుంది!

దాదాపుగా 2,000 ఏళ్ల క్రితం నుండి యూదులు తమ స్వంత దేశం అయిన ఇజ్రాయెల్ నుండి పారిపోయి వివిధ దేశాలలో స్థిరపడి మళ్ళీ అక్కడ కూడా ప్రాణ హాని ఉందని సురక్షిత ప్రాంతాలకు పారిపోవడం ఒక అలవాటుగా మారిపోయింది!

terror

అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు!

14, ఆదివారం డిసెంబర్, 2025 న ఆస్ట్రేలియాలోని బొండి బీచ్ దగ్గర యూదుల పండుగ అయిన ’హనూఖ’
ను జరుపుకుంటుండగా సెమి ఆటోమేటిక్ గన్స్ తో ఇద్దరు ఉగ్రవాదులు బొండి బీచ్ దగ్గర కి చేరుకొని విచక్షణారహితంగా కాల్పులు జరపగా 15 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు!

చనిపోయిన వారిలో రెండో ప్రపంచయుద్ధ సమయంలో హిట్లర్ జరిపిన హోలోకాస్ట్ ( హిట్లర్ యూదులను గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపిన ఘటన) నుండి తప్పించుకున్న చిన్న బాలుడు ( ఇప్పుడు 85 ఏళ్లు) కాల్పులలో చనిపోయాడు.

హనుఖ ( Hanukkah) అంటే ఏమిటి?
హనుఖ అంటే పునరంకితం (Hanukkah= Rededication) అవడం!
అఫ్కోర్స్! మనం ఎలా అయితే దీపావళి జరుపుకుంటామో యూదులు కూడా అలాగే హనుఖ అని అరామిక్ భాషలో, ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అని ఇంగ్లీష్ లో పిలుస్తారు. యూదుల భాష హీబ్రూ, అరబిక్ భాష లు రెండూ కూడా అరామిక్ భాష నుండి పుట్టినవే!

2వ శతాబ్దం BCE లో జెరూసలేంలోని రెండవ దేవాలయం ( SECOND TEMPLE) గ్రీకు సిరియన్ పాలకుల అధీనంలో ఉండేది. గ్రీకు సిరియన్ పాలకుల మీద తిరుగుబాటు చేసి యూదులు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత దాని గుర్తుగా చేసుకునే 8 రోజుల పండగని హనుఖ అంటారు!

గ్రీకు సిరియన్ పాలకుల నుండి సెకండ్ టెంపుల్ ను స్వాధీనం చేసుకున్నాక యూదులు టెంపుల్ ను శుద్ధి చేసి దీపం వెలిగించే క్రమంలో దీపానికి కావాల్సిన శుద్ధి చేసిన నూనె ఒక్క రోజుకే సరిపోయేంత ఉండడంతో ఆ కొద్దిపాటి నూనెతోనే దీపం వెలిగించారు!

కానీ ఆ కొద్దిపాటి నూనెతోనే దీపం 8 రోజుల వరకూ వెలిగింది! దీనిని యూదులు మిరాకిల్ అంటారు. ఒక్క రోజుకి మాత్రమే సరిపోయే నూనెతో 8 రోజుల వెలిగింది కాబట్టి హనుఖ పండుగని 8 రోజులపాటు చేసుకోవడం ఆచారంగా ఉండిపోయింది!

hanukhah

యూదుల దీపం 8 దీపాలతో వెలిగించడం 2 వ శతాబ్దం BCE నుండే మొదలయ్యింది. సాధారణంగా ప్రతీ సంవత్సరం నవంబర్ చివరి వారంలో కానీ, డిసెంబర్ మొదటి వారంలో కానీ ప్రారంభం అయ్యి 8 రోజులపాటు హనుక్కా పండుగని జరుపుకుంటారు!

యూదుల దీపం మొత్తం 9 క్యాండిల్స్ ఉన్న చిన్న స్తంభం మీద పొందుపరిచి ఉంటాయి. అందులో 8 క్యాండిల్స్ మిరాకిల్ కి గుర్తుగా, తొమ్మిదవది వాటిని వెలిగించడానికి వాడే సహాయక కాండిల్.

హనుఖ పండగ జరిగే 8 రోజులూ యూదులు నూనెతో చేసిన వంటకాలు వండుకొని తింటారు. అందరూ సమూహంగా చేరి ఒకరికొకరు కానుకలు పంచుకుంటారు!

******
ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఆస్ట్రేలియాలో యూదుల మారణకాండకి ఆస్ట్రేలియా ప్రభుత్వమే బాధ్యత వహించాలని పేర్కొన్నాడు. గత సంవత్సరం నుండి మోస్సాద్ ఇచ్చిన సమాచారాన్ని ఆస్ట్రేలియన్ ఇంటెలిజెన్స్ సంస్థతో పంచుకున్నామని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని కానీ ఆస్ట్రేలియన్ ప్రభుత్వం లెక్కచేయలేదని పేర్కొన్నాడు!

గాయపడి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న నవీద్ అక్రమ్ మీద రెండేళ్ల క్రితమే ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ ఇంటెలిజెన్స్ అధికారులు దాడి చేసి తగిన ఆధారాలు దొరకలేదని తెలిపారు! కాల్పుల ఘటన తర్వాత నవీద్ అక్రమ్ కి చెందిన కారులో, ఇంట్లోనే తయారుచేసిన బాంబులతో పాటు రెండు ISIS జెండాలు దొరికాయి! న్యూ సౌత్ వెల్స్ పోలీసులు నవీద్ అక్రమ్ ఇంట్లో సోదాలు జరపగా మొత్తం 6 సెమీ ఆటోమేటిక్ గన్స్ తో పాటు isis కి సంబంధించిన వివరాలు దొరికాయి!

ఆస్ట్రేలియాలో గన్ లైసెన్స్ ల మీద మళ్ళీ వివాదాలు మొదలయ్యాయి!

నవీద్ అక్రమ్ ఇంట్లో దొరికిన గన్స్ అన్నింటికి లైసెన్స్ లు ఉన్నాయి! ఆస్ట్రేలియాలో గన్ క్లబ్స్ కు కొదువ లేదు! వేటాడటం మీద నిబంధనలతో కూడిన అనుమతి ఉంటుంది. కానీ ఏకంగా ఒకే వ్యక్తికి 6 గన్ లైసెన్స్ లు ఎలా ఇచ్చారు?

అరగంట పాటు సాగిన కాల్పుల పర్వంలో న్యూ సౌత్ వేల్స్ పోలీసులు హంతకులు సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్ లు ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి డ్రోన్స్ ఎందుకు ఉపయోగించలేదు? 12 మంది ఘటనా స్థలంలో లో చనిపోతే, చివరలో పోలీసులు డ్రోన్స్ ద్వారా హంతకులు ఉన్న ప్రదేశాన్ని కనిపెట్టగలిగారు!

అహ్మద్ అల్ అహ్మద్!

సిరియా నుండి శరణార్థిగా ఆస్ట్రేలియా వచ్చి ఫ్రూట్ షాప్ నడుపుతూ జీవిస్తున్న అహ్మద్ అల్ అహ్మద్ అనే వ్యక్తి సాజిద్ అక్రమ్ ను అడ్డగించి, అతని చేతి నుండి గన్ లాక్కొని మరిన్ని మరణాలు జరగకుండా ఆపాడు! రెండు బులెట్స్ అహ్మద్ అల్ అహ్మద్ కి కూడా తగిలాయి! ప్రస్తుతం హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు!

ఒక ముస్లిం అయి ఉండీ అహ్మద్ అల్ అహ్మద్ సాజిద్ అక్రమ్ ను అడ్డగించి ఎందుకు ఆపాడు? గత రెండు దశాబ్దాలుగా సిరియాలో ఏం జరిగిందో, ఇప్పటికీ ఏం జరుగుతున్నదో అతనికి తెలుసు. అందుకే కదా పొట్ట చేత్తో పట్టుకొని సిరియా నుండి ఆస్ట్రేలియా వలస వచ్చాడు!

అనుభవం పాఠాలు నేర్పుతుంది! అహ్మద్ అల్ అహ్మద్ కి అనుభవం అయింది కానీ ఆస్ట్రేలియాలో ఉన్న మిగతా ముస్లిమ్స్ కి అనుభవం లేదు, అందుకే యూదుల మరణానికి సంతోషపడుతూ బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు!

అక్టోబర్ 7 ఇజ్రాయెల్ లో హమాస్ దాడి, పహల్ గావ్ లో పర్యాటకుల మీద దాడి, ఆస్ట్రేలియాలో బొండి బీచ్ దాడి ఒకే తరహాలో జరిగాయి! ఇక ముందు జరుగుతాయి!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేటీయార్ ‘యాప్’సోపాలు..! రైతుల సౌకర్యం, సౌలభ్యమూ సహించవా..?!
  • కదులుతున్న బెంగాలీ డొంక…. కూలుతున్న మమత ఫేక్ వోట్ల పునాదులు…
  • పాన్ ఇండియా కాదు.. ! తెలుగులో మాత్రమే అఖండ తాండవం.. !!
  • యూదులు ఎక్కడున్నా ప్రాణభయమే…! అసలు ఏమిటీ హనుఖ్క..!?
  • …. అలా ఈనాడుపై ఉదయం, ఆంధ్రజ్యోతి ‘పగ తీర్చుకున్నాయి’…
  • సీఎం జనంలో ఉంటే… అపహసించే ప్రతిపక్షం చరిత్రలో ఇదే తొలిసారి…
  • కీలక డాక్యుమెంట్… సాయుధ పోరాట దుస్థితిపై ఐదేళ్లుగా అంతర్గత చర్చ..!!
  • వావ్… తొలిసారిగా ఓ ‘ప్రెస్‌’టీజియస్ పోస్టులోకి లేడీ జర్నలిస్ట్..!
  • స్క్రిప్టెడ్ లవ్‌ట్రాక్ కాదు… సైలెంటుగా చిగురించి పెనవేసుకున్న బంధం..!
  • జుహీ చావ్లా తొలి తెలుగు సినిమా… అదీ సూపర్ స్టార్ డైరెక్షన్‌లో…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions