.
Pardha Saradhi Upadrasta …….. బెంగాల్‌లో ఓటర్ లిస్ట్ శుద్ధి ప్రక్రియలో భారీ అసమానతలు బయటపడ్డాయి… నిన్న ఎన్నికల సంఘం తన మొదటి డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేసింది , ఇది మొదటి డ్రాఫ్ట్ మాత్రమే . ఇంకా చాలా reverification లో వున్నాయి… విస్తుగొలిపే వాస్తవాల్లోకి వెళ్దాం…
ECI (ఎన్నికల కమిషన్) అధికారిక డేటా ప్రకారం…
ఫారమ్‌లు & ఓటర్లు… : 58,08,232 ఎన్యుమరేషన్ ఫారమ్‌లు, BLO యాప్‌లో అప్లోడ్ కాలేదు…
వాటిలో 24,18,699 – మరణించిన ఓటర్లు,
12,01,462 – గుర్తించలేని (Untraceable) ఓటర్లు,
19,93,087 – శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారినవారు,
1,37,475 – ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు,
57,509 – ఇతర కేసులు
Ads
అర్థం ఏమిటి?
ఓటర్ లిస్ట్‌లో ఉన్న పెద్ద సంఖ్యలో పేర్లు వాస్తవానికి ఓటు హక్కు కలిగినవారే కాదన్న మాట. వీరిని సూటిగా తీసేస్తారు ; తీసేసారు …
కుటుంబ & తల్లిదండ్రుల డేటాలో భారీ గందరగోళం
85,01,486 కేసుల్లో తండ్రి పేరు తప్పుగా / మిస్మాచ్‌గా నమోదు
ఇది మొత్తం ఓటర్లలో 11.09%
24,21,133 ఓటర్ల తండ్రులకు 6 మందికిపైగా పిల్లలు ఉన్నట్లు నమోదు. ఇది సహజమా? లేక డేటా మానిప్యులేషనా?
వయస్సు వ్యత్యాసాల్లో అనుమానాలు
13 లక్షల కేసుల్లో తల్లిదండ్రులు–పిల్లల మధ్య వయస్సు తేడా 15 ఏళ్లలోపే, 8,77,736 కేసుల్లో వయస్సు తేడా 50 ఏళ్లకు మించి, 3,29,152 కేసుల్లో తాత–మనవళ్ల మధ్య వయస్సు తేడా 40 ఏళ్లలోపే
లింగ డేటాలో తప్పులు
13,46,918 ఓటర్ల లింగ వివరాలు తప్పుగా నమోదు, ఓటర్ గుర్తింపు ఖచ్చితత్వంపై తీవ్ర సందేహాలు
కొత్త ఓటర్లలో మరో షాక్…
45 ఏళ్లకు పైబడిన 20,74,256 మంది, తొలిసారి ఓటర్ లిస్ట్‌లో నమోదు, వీరిలో చాలా మంది 2024 ఓటర్ లిస్ట్ లో లేరు . ఇంత ఆలస్యంగా ఎందుకు?

మొత్తం ఓటర్ డేటా (2025 – బెంగాల్)
👉 58 లక్షలు – ఫారమ్‌లు సేకరించలేదు. సూటిగా తీసేసారు ; వాళ్ళు ఇక ఓటర్ లిస్ట్ లో ఉండదు ;
👉 30 లక్షలు – మ్యాపింగ్ లేని ఓటర్లు. Reverification చేస్తున్నారు
👉 2.93 కోట్లు – Self-mapping
👉 3.84 కోట్లు – Progeny-mapping
ECI నిర్ణయం:
ఈ కేసులన్నింటిపై వివరణాత్మక పరిశీలన అవసరమైన ఓటర్లను హెరింగ్‌కు పిలుస్తారు. తుది నిర్ణయం విశ్లేషణ తర్వాత. అంటే 58,08,232 ఇప్పటి వరకు తీసేసినవి , కానీ ఇంకా 1.5 కోట్లకు పయిగా ఫారంలను reverify చేయాలి ; బొమ్మ ఇంకా వుంది …
BLO ల పని దాదాపు ముగిసినట్లే , కానీ ఇక ERO , DM ల రివెరిఫికేషన్ మిగిలి వుంది . …..
ఫైనల్ క్లీనప్….
నిర్ధారణ అయిన తర్వాత
✔️ మరణించిన ఓటర్ల తొలగింపు
✔️ డూప్లికేట్ ఓటర్ల డిలీషన్
✔️ ఫేక్ / మానిప్యులేటెడ్ ఎంట్రీల తొలగింపు
✔️ జెన్యూన్ ఓటర్లకు క్లియర్ స్టేటస్
📌 ఫైనల్ ఎలక్టోరల్ రోల్ ప్రచురణ కు ఫిబ్రవరి, మార్చ్ దాకా సమయం వుంది …
📌 ముఖ్యమైన ప్రశ్న…: ఇది నిర్లక్ష్యమా? లేక ఓటర్ లిస్ట్‌లతో జరిగిన వ్యవస్థాగత ఉద్దేశపూర్వక గందరగోళమా?…………. — ఉపద్రష్ట పార్ధసారధి
#SIR #BengalPolitics #ElectoralRolls #VoterFraud #ECI #IndianDemocracy #ElectionIntegrity #pardhatalks
నిజంగానే భయమేస్తోంది... ఒక మమత, ఒక స్టాలిన్, ఒక అఖిలేష్... జాతిని అక్రమ వలసదార్లకు... అమ్మేసి, తాకట్టు పెట్టి... దీన్ని హిందూ మైనారిటీ దేశంగా మార్చి.... పండుగ చేసుకుంటున్న ప్రమాదాన్ని ఊహించి..!!
Share this Article