Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అప్పట్లో బాలయ్య, విజయశాంతి ఉంటే చాలు… సినిమా నడిచేది…

December 18, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …… యన్టీఆర్ లెవల్ సినిమా 1988 సంక్రాంతి సీజనుకు వచ్చిన ఈ హిట్ సినిమా ఇనస్పెక్టర్ ప్రతాప్ … బాలకృష్ణ యన్టీఆర్ లెవెల్లో నటించిన సినిమా . బాలకృష్ణ , విజయశాంతి కాంబినేషన్లో వచ్చిన మరో హిట్ సినిమా .

  • 1984 లో వచ్చిన కధానాయకుడుతో మొదలయిన వీరిద్దరి జోడీ 17 సినిమాల్లో జనరంజకంగా సాగింది . రెండో మూడో ఆడనట్లుగా ఉంది . మిగిలినవన్నీ ఎబౌ ఏవరేజ్ , హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్లు .

రొటీన్ దుష్టశిక్షణ శిష్టరక్షణ కధే అయినా చాలా మసాలా దినుసులు పడ్డాయి . ఏక్షన్ , సెంటిమెంట్ , ఎమోషన్ , రొమాన్స్ , దేశభక్తి , ఒకటేంటి అన్నీ కలిపి అద్భుతంగా కధను నేసారు కృష్ణ చిత్రా యూనిట్ వారు . అందుకు దీటుగా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చాలా బిర్రయిన స్క్రీన్ ప్లేని బాలకృష్ణకు అనుగుణంగా తయారు చేసుకున్నారు .

Ads

తెర వెనుక నిపుణులలో ముందుగా అభినందించవలసింది డైలాగుల రచయిత యం వి యస్ హరనాధరావునే . మధ్యమధ్యలో మనకు అనుమానం వస్తుంది . వ్రాసింది పరుచూరి బ్రదర్సేమో అని . అంత పదునుగా వ్రాసారు . ముఖ్యంగా బాలకృష్ణ డైలాగులను చాలా పదునుగా సానబెట్టారు .

తర్వాత చెప్పుకోవలసింది చక్రవర్తి సంగీత దర్శకత్వాన్ని.. , నృత్య దర్శకులు రఘు, శివ సుబ్రమణ్యంలను.. , హుషారయిన పాటల్ని వ్రాసిన సి నారాయణరెడ్డి , వేటూరి , జాలాది , వాటిని శ్రావ్యంగా వినిపించిన బాలసుబ్రమణ్యం , సుశీలమ్మ , జానకమ్మ , మనోలను .‌..

అలా చూడబాకు , నిన్ను ఎక్కడో చూసిన గుర్తుంది , రంగ రంగ వైభవంగా నిన్ను నేను పెళ్ళాడంగా , తుంటరి వాడా అంటూ సాగుతాయి ఈ నాలుగు పాటలు . వీటిల్లో రెండు బృంద నృత్యాలు కూడా . ముత్యాల సుబ్బయ్య చాలా సరసంగా చిత్రీకరించారు . హేహే తాగుబోతు నాయాలా అరే తాగినాక ఉయ్యాల అనే పాట బాలకృష్ణ అభిమానులకు బాగా నచ్చుతుంది .

  • ప్రత్యేకంగా చెప్పవలసిన పాట ఒకటి ఉంది . అదేంటంటే జయమాలిని లాగా , జ్యోతిలక్ష్మి లాగా , రాధ విజయశాంతి వంటి హీరోయిన్లలాగా కాస్ట్యూమ్స్ వేసుకుని వయ్యారాల వై విజయ డిస్కో డాన్స్ . ముందు సుత్తి వేలుతో ప్రారంభమై తర్వాత బాలకృష్ణతో ముగుస్తుంది . ఇలాంటి డాన్సుల్లో కూడా వై విజయ వై విజయే .

నటనపరంగా అగ్ర తాంబూలం హీరో గారిదే . ఏక్షన్ సీన్లలో , ఎమోషన్స్ సీన్లలో , పాటల్లో అదరగొట్టేసారు . తర్వాత విజయశాంతి . ఓరి నా మొగుడో అంటూ బాలకృష్ణని రఫ్ఫాడించేసింది . విలనాసురులుగా సత్యనారాయణ , గిరిబాబు , నర్రా , చలపతిరావు , రాళ్ళపల్లి , వీరందరికి వత్తాసు లాయరుగా బాలకృష్ణ అన్నగా గొల్లపూడి బాగా నటించారు .

క్రాంతి ముఠా అనే పేరుతో అతివాదులుగా శరత్ బాబు , ఈశ్వరరావు , విద్యాసాగర్ రాజు నటించారు . కానిస్టేబులుగా సుత్తి వేలు , అతని వాంపుగా వై విజయ నటించారు . హీరో వదినగా శ్రీవిద్య చక్కటి ఎమోషనల్ పాత్రను పోషించింది . ఇంకా వరలక్ష్మి , చిట్టిబాబు , పి జె శర్మ , జగ్గయ్య , ప్రసాద్ బాబు తదితరులు నటించారు .

మరచిపోయా . హీరోహీరోయిన్లు మారు వేషాలు కూడా వేస్తారు . రాబిన్ హుడ్ లాగా విలన్ సూపర్ మార్కెట్టుని ప్రజల చేత లూటీ కూడా చేపిస్తాడు . తానే విలన్ ఆస్తులను ధ్వంసం చేపిస్తాడు . మొత్తం మీద యన్టీఆర్ లెవెల్లో బాలకృష్ణ నటించిన ఈ సినిమా ఇంతకుముందు చూడనట్లయితే తప్పక చూడవచ్చు .

సినిమా యూట్యూబులో ఉంది . It’s a romantic , action and emotion filled , commercial entertainer . నేను పరిచయం చేస్తున్న 1197 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #తెలుగు_సినిమాలు #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
  • పాకీజా, శ్యామల, జయవాహిని… రంగులు వెలిసిన జీవితాలు…
  • రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!
  • మోహన్‌లాల్ తోపు ఐతేనేం… ఆమె కడిగేసింది… తెలుగులో ఊహించగలమా…
  • ఉన్నత శిఖరాలెక్కి… అక్కణ్నుంచి అమాంతంగా చీకటి లోయల్లోకి…!!
  • నితిన్ నబీన్..! ఈ చిత్రగుప్తుడి వారసుడి చేతిలో బీజేపీ భవిష్యత్తు..!!
  • పవర్‌లో ఉంటే పవిత్ర జంపింగ్స్-! ప్రతిపక్షంలో ఉంటే అదే అనైతికమట…!!
  • అప్పట్లో బాలయ్య, విజయశాంతి ఉంటే చాలు… సినిమా నడిచేది…
  • మొగిలయ్యా, బాధ పడొద్దయ్యా… పాడులోకం ఇంతేనయ్యా…!
  • ప్రతి తెలంగాణ బిడ్డ ఓసారి నెమరేసుకోవాల్సిన ‘కన్నీటి కాలం’ ఇది…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions