Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గ్రేట్… కథాకాకరకాయ జానేదేవ్… అదే విజువల్ వండర్… ఇది మరో లోకం..!!

December 19, 2025 by M S R

.

అవతార్3 ఎలా ఉంది..? ఈ ప్రశ్న ప్రధానమే… దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్లు దొరకనంత గిరాకీ… అందరికీ ఒకే ఆసక్తి… థియేటర్లలోనే చూడాలి… లార్జ్ స్క్రీన్ మీద చూడాలి… త్రీడీలో చూడాలి… మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్లలో చూడాలి…

ఎందుకంటే… అదొక విజువల్ ట్రీట్… విజువల్ వండర్… ప్రపంచ సినిమా చరిత్రలో జేమ్స్ కామెరూన్ టెక్నాలజీని వాడుకున్నంతగా వేరే దర్శకుడు ఇంకొకరు లేరు… అఫ్‌కోర్స్, ఇక్కడ చిన్న డిస్‌క్లెయిమర్…

Ads

మిస్టర్ బీన్…. కొన్ని కోట్ల మంది, ప్రత్యేకించి పిల్లలు…. పదే పదే చూస్తూనే ఉంటారు… ఇప్పుడు జూనియర్ బీన్ కూడా వచ్చాడు… కొన్ని ఎపిసోడ్లు రక్తికట్టకపోవచ్చు, కొన్ని బ్రహ్మాందంగా పేలవచ్చు…. సేమ్, జురాసిక్ పార్క్, ఇది వచ్చిన కొత్తలో థియేటర్లకు జాతరగా జనం పోలోమంటూ వెళ్లారు… బోలెడు సీక్వెన్స్ వచ్చాయి, అన్నీ నచ్చాలని లేదు.,. కానీ ప్రేక్షకుడు ఏదీ వదల్లేదు… అదొక హ్యాంగోవర్…

సేమ్… అవతార్… ఫస్ట్ పార్ట్ ఓ అద్భుతం.., థియేటర్ వండర్… సెకండ్ పార్ట్ కాస్త తగ్గింది ఆ మోజు ఆ థ్రిల్… ఎందుకు..? అదే విజువల్ వండర్… కానీ కథలో కొత్తదనం కరువై… సేమ్, ఇప్పుడు అవతార్ 3 వచ్చింది… ఫైర్ అండ్ యాష్… కొత్తదనం లేదు… కానీ థియేటర్లకు వెళ్లి చూడతగిన విజువల్స్…

ఈ ఎఐ యుగంలో నాలుగు గొప్ప గ్రాఫిక్స్ పెద్ద కథేమీ కాదు…. కానీ ఓ ఎమోషన్‌లో ఇమిడ్చి కథ చెప్పి రక్తికట్టించడం చిన్న విషయం కాదు… అదీ కామెరూన్‌కు తెలుసు… కథ పాతబడినా సరే, విజువల్ వండర్ నిరాశను కలిగించదు… మరీ లార్జ్ స్క్రీన్ మీద త్రీడీ చూస్తుంటే… అదీ అసలు ఆకర్షణ… రెండో భాగం తీస్తున్నప్పుడే 2017లో మూడో భాగం వర్క్ స్టార్ట్ చేసేశాడు…

ఎస్, అవతార్1, అవతార్2 లతో పోలిస్తే అవతార్3 కొత్తగా ఉండదు… పైగా 3 గంటలు… ఐనా నిరాశపరచదు… మన చెత్తా సినిమాలు చూసీ చూసీ అలిసిన కళ్లకు ఎంత ఆనందమో… ఎంత పండుగో… ఇంకొన్ని వివరాల్లో వెళ్దాం…

సానుకూల అంశాలు (Pros)….

  • విజువల్ వండర్….: జేమ్స్ కామెరూన్ మరోసారి విజువల్స్ విషయంలో అద్భుతం చేశాడు… కొత్తగా పరిచయం చేసిన ‘యాష్ పీపుల్’ (అగ్ని తెగ) కి సంబంధించిన విజువల్స్ కళ్లు చెదిరేలా ఉన్నాయి…

  • క్లైమాక్స్ యాక్షన్…: సినిమా చివరి 30- 40 నిమిషాల్లో వచ్చే యుద్ధ సన్నివేశాలు హైలైట్‌… రియల్ థియేటర్ ఎక్స్‌పీరియెన్స్…

  • కొత్త లోకాలు…: పండోరా గ్రహంలోని ఇప్పటివరకు చూడని కొత్త ప్రాంతాలు, వింత జీవులను చూపించడంలో దర్శకుడు సక్సెస్…. పిల్లలకైతే ఓ పెద్ద ట్రీట్…

ప్రతికూల అంశాలు (Cons):

  • కథలో కొత్తదనం లేదు….: మొదటి రెండు భాగాల తరహాలోనే కథ సాగుతుంది… కథనం (Screenplay) కొంత ఊహజనితంగా (Predictable) ఉంది…

  • నిడివి (Length)…: సినిమా సుమారు 3 గంటల 15 నిమిషాలు… మొదటి సగం చాలా నెమ్మదిగా (Slow paced) సాగుతుంది…

  • రిపీట్ సీన్స్…: కొన్ని సన్నివేశాలు ‘అవతార్ 2’ (Way of Water) ని గుర్తుచేస్తాయి… అంటే థీమ్ మారింది తప్ప, కొత్తదనం ఫీల్ రాకపోవడం…

ఇంకా…?

ఫైర్ అండ్ యాష్’ (Fire and Ash) కథ ప్రధానంగా ‘పక్షపాతం’, ‘ప్రతీకారం’ చుట్టూ తిరుగుతుంది… మొదటి రెండు భాగాల్లో నవి (Na’vi) జాతిని మంచివారిగా చూపించిన జేమ్స్ కామెరూన్, ఈసారి వారిలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు… అనగా నెగెటివ్ షేడ్స్…

1. అగ్ని తెగ (The Ash People) పరిచయం

ఈ సినిమాలో ‘వరాంగ్’ (Varang) నాయకత్వంలోని ‘యాష్ పీపుల్’ అనే కొత్త నవి తెగను పరిచయం చేస్తాడు దర్శకుడు…. వీరు అగ్నిపర్వతాల ప్రాంతంలో నివసిస్తారు… వీరు అడవిలో ఉండే ‘ఓమటికాయ’ లేదా సముద్ర తీరాన ఉండే ‘మెట్కయినా’ తెగల వలె శాంత స్వభావులు కాదు… వీరు చాలా కోపంగా, క్రూరంగా, అధికార దాహంతో ఉంటారు…

2. నవి వర్సెస్ నవి (Na’vi vs Na’vi)

ఇప్పటివరకు జరిగిన యుద్ధాలు మనుషులకు (RDA), నవి జాతికి మధ్య జరిగాయి… కానీ ఈ భాగంలో నవి జాతుల మధ్యే అంతర్గత యుద్ధం మొదలవుతుంది… జేక్ సల్లీ కుటుంబం మనుషుల నుండి పండోరాను కాపాడుకోవడమే కాకుండా, స్వజాతి వారైన ఈ అగ్ని తెగ నుండి కూడా పోరాడాల్సి వస్తుంది… అదే పాత రెండు కథలతో పోలిస్తే భిన్నమైన విషయం…

3. జేక్ సల్లీ, కిరి పాత్రలు

  • జేక్ సల్లీ (Jake Sully)…: తండ్రిగా తన కుటుంబాన్ని కాపాడుకుంటూనే, పండోరాలో శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తాడు…

  • కిరి (Kiri)…: ఈమెకు ప్రకృతితో (Eywa) ఉన్న అద్భుతమైన సంబంధం ఈ కథలో కీలక మలుపు తీసుకుంటుంది… ఆమె శక్తులు పండోరాను కాపాడతాయా లేదా అన్నది ఆసక్తికరంగా ఉంటుంది…

4. కల్నల్ క్వారిచ్ తిరిగొచ్చాడా?

అవును, కల్నల్ క్వారిచ్ ఈసారి మరింత పగతో రగిలిపోతుంటాడు… అయితే, ఈసారి అతను నేరుగా దాడి చేయడం కంటే, నవి తెగల మధ్య ఉన్న విభేదాలను వాడుకుని వారిని దెబ్బతీయాలని ప్లాన్ చేస్తాడు…


కథలోని ముఖ్య అంశాలు…

  • అగ్ని vs నీరు….: గత భాగంలో నీటి అందాన్ని చూపించగా, ఇందులో అగ్ని విధ్వంసాన్ని చూపిస్తారు…

  • భావోద్వేగాలు…: జేక్ సల్లీ కొడుకును కోల్పోయిన బాధ నుండి బయటపడి, తన మిగిలిన పిల్లలను ఎలా రక్షించుకున్నాడనేది ఎమోషనల్ పాయింట్…

మొత్తానికి..., "అన్ని నవి తెగలు మంచివి కావు, అందరు మనుషులు చెడ్డవారు కాదు" అనే పాయింట్ మీద ఈ సినిమా కథ నడుస్తుంది... ప్రపంచంలో రికార్డు వసూళ్లు సాధించిన మూడు సినిమాల్లో రెండు (అవతార్, టైటానిక్) జేమ్స్ కామెరూన్‌వే... ఎస్, ఇదీ ఆ సరసన చేరడం ఖాయం...

ది టర్మినేటర్ 1984, టర్మినేటర్2 జడ్జిమెంట్ డే 1991, ఏలియెన్స్ 1986, ది అబిస్ 1989,  ట్రూ లైస్ 1994... మరోసారి... కామెరూన్, నువ్వు పెద్ద మాయగాడివిరా..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • గ్రేట్… కథాకాకరకాయ జానేదేవ్… అదే విజువల్ వండర్… ఇది మరో లోకం..!!
  • జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…
  • అంత వణికిపోయే ముప్పేమీ కాదు… నందాదేవి అణుముప్పు అసలు స్టోరీ..!!
  • రేవంతుడు ధన్యుడు… వందలేళ్ల ఆదివాసీ చరిత్ర ‘చెక్కబడుతోంది’…
  • ఎడ్యుకేటెడ్, రిటైర్డ్, ఇంగ్లిషు తెలిసినవాళ్లే… ఈజీ సైబర్ టార్గెట్లు..!
  • ఒక బ్రహ్మపుత్రుడు… ఒక బ్రహ్మపుత్రిక… వెరసి ఓ బ్రహ్మపదార్థం సినిమా..
  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
  • పాకీజా, శ్యామల, జయవాహిని… రంగులు వెలిసిన జీవితాలు…
  • రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions