Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తదుపరి ప్రధాని రేసులో లోకేష్..!! చివరకు ఇది ‘యెల్లో రాయిటర్స్‌’..!!

December 23, 2025 by M S R

.

వార్ రూమ్ ఏర్పాటు చేసి మరీ ఇండిగో సంక్షోభాన్ని లోకేష్ మానిటర్ చేశాడనే టీడీపీ అధికార ప్రతినిధి వ్యాఖ్య, దానిపై రిపబ్లిక్ ఆర్నబ్ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు… టీడీపీ పరువు పోయిందనేది నిష్ఠురనిజం…

ఆ అక్కసు ఆర్నబ్‌ మీద ఎంత వెళ్లగక్కినా, ఆ టీవీనీ బాయ్‌కాట్ చేసినా… అది ఆకులు పట్టిన యవ్వారమే… అంతకుమించి ఇప్పుడు మరో పీఆర్ తప్పిదం కలకలం రేపుతోంది… లోకేష్‌ను ఫ్యూచర్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయడానికి టీడీపీ క్యాంపు చేస్తున్న ప్రయత్నాల్లో ఇది మరో తప్పుటడుగు…

Ads

ఐతే ఆర్నబ్ తన టెంపర్‌మెంట్‌తో తలెత్తుకున్నాడు… కానీ ఇప్పుడు చెప్పుకునే యవ్వారంలో పేరుప్రఖ్యాతులున్న రాయిటర్స్ మీడియా సంస్థ తలదించుకుంది… కారణం దాని ప్రతినిధి శ్రీతమ్ బోస్ చేసిన మూర్ఖపు అంచనాలు, జోస్యాలు… పరిణతి లేనివి కావు అవి… అంతకు మించి…

 


From @Breakingviews: Indian Prime Minister Narendra Modi will be halfway through his third term in 2026. A fourth stint is possible but improbable. @ShritamaBose identifies some possible successors whose names may come to the fore in the year ahead #BVPredicts pic.twitter.com/EkSrdCcw3g

— Reuters (@Reuters) December 19, 2025



‘‘మోడీ తరువాత ఎవరు..? ఈ టరమ్ పూర్తయ్యేలోపు ఆయన 78 ఏళ్ల వయస్సు దాటతాడు… బహుశా మలి టరమ్ ప్రధాని కాకపోవచ్చు… మరి ఎవరు తన వారసుడు..? ఆ రేసులో ప్రథముడు మోడీ కుడిభుజం, ప్రస్తుత హోం మంత్రి అమిత్ షా, తరువాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్…

బీజేపీ మిత్రపక్షాలకు చెందిన చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ కూడా ఈ రేసులో ఉంటారు… ఒకవేళ రాజకీయ ముఖచిత్రం మారితే రాహుల్ గాంధీ లేదా ప్రియాంక గాంధీ… చంద్రబాబు, లోకేష్ వారస పోటీదారులు ఎందుకంటే ఏపీకి డేటా సెంటర్ తీసుకొచ్చారు…’’ ఇలా సాగిపోయాయి రాయిటర్స్ అంచనాలు…

reuters

దీని మీద సోషల్ మీడియాలో రకరకాల జోక్స్, వెక్కిరింతలు, అపహాస్యం చేసే విశ్లేషణలు కనిపిస్తున్నాయి… అంటే ఇండిగో ఎపిసోడ్‌ను మించి అనేక రెట్లు… పీఆర్ అవసరమే, కానీ ఏకంగా అప్పుడే ప్రధాని పదవి పోటీదారుగా ప్రొజెక్ట్ చేయించుకోవడం, దానికి రాయిటర్స్ వంటి మీడియా సంస్థ తన పాత్రికేయ ప్రమాణాన్ని పూర్తిగా పణంగా పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశం…

  • చివరకు రాయిటర్స్ మహాన్యూస్, ఏబీఎన్, టీవీ5 స్థాయికి చేరుకుందనే విమర్శలు ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి… రాయిటర్స్ వ్యాఖ్యానాల్ని బేస్ చేసుకుని ఆల్రెడీ ఒకటీరెండు టీడీపీ బాపతు చానెళ్లు, జర్నలిస్టులు స్టార్ట్ చేశారు డప్పు… ఇంకా ఆర్నబ్ గోస్వామి దృష్టికి రానట్టుంది ఇదంతా… లేకపోతే వేసుకుంటాడు ఈసారి మరింత బలంగా, ఇండిగో ఎపిసోడ్‌ను మించి…

reuters

కనీసం చంద్రబాబు వరకు ఏదో ఊహించారు అంటే వోకే… సంకీర్ణ రాజకీయాల్లో దేవెగౌడ వంటి నేతలు ప్రధానులు కాలేదా..? కానీ మరీ లోకేష్ తదుపరి ప్రధాని పదవి పోటీదారు అనే విశ్లేషణ మరీ నవ్వులాట పాత్రికేయమే… పాపం రాయిటర్స్..!

  • ఆశలు అందరికీ ఉంటాయి… లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేసేసి, ఇక చంద్రబాబు ఢిల్లీకి వెళ్లాలని టీడీపీ సగటు కార్యకర్త … కేటీయార్‌ను ముఖ్యమంత్రిని చేసేసి, కేసీయార్ ఢిల్లీ పగ్గాలు చేపట్టాలని బీఆర్ఎస్ సగటు కార్యకర్త అనుకోవడంలో, ఆశించడంలో తప్పు లేదు… కానీ ఏకంగా లోకేష్‌నే ప్రధాని పదవికి పోటీదారుగా ప్రొజెక్ట్ చేయడం నవ్వు తెప్పించేదే…

వోకే, బీజేపీ వచ్చే ఎన్నికల్లో చతికిలపడితే… రాహుల్, ప్రియాంక పోటీదారులు అవుతారనేది కొంత బెటర్… కానీ వర్తమాన పరిస్థితుల్లో, సోకాల్డ్ ఇండి కూటమి గనుక బీజేపీ గెలిచే సీట్ల సంఖ్యను మించిపోతే… పర్ సపోజ్ మించిపోతే… ఆ కూటమి నుంచి మమత వంటి చాలామంది పోటీదారులు ఉంటారు… అసలు గత ఎన్నికల్లోలాగా ఇండి కూటమి బీజేపీకి వచ్చే ఎన్నికల్లో పోటీ ఇవ్వగలదా అనేదే అనుమానం… మహారాష్ట్ర, బీహార్ ఫలితాలు రాబోయే ఎన్నికల్లో మరింత అనూహ్య ఫలితాలకు సూచికలు కావచ్చు కూడా..!!

చివరగా.... ఓ తెలుగు సీనియర్ జర్నలిస్టు చెణుకు ఏమిటంటే..? వై ఓన్లీ లోకేష్, వై నాట్ పవన్ కల్యాణ్... వీర సనాతన ధర్మ ఎజెండాధారి... కాదంటే వై నాట్ అఖండ తాండవుడు, కొత్త సనాతనధర్మ వీరుడు బాలకృష్ణ... ఆశలకు, సంకల్పాలకు... ప్రత్యేకించి రాయిటర్స్ తరహా జోస్యాలకు హద్దులు ఎందుకు ఉండాలి..?! 

  • మరో జర్నలిస్టు సరదాగా చెప్పినా ఇంట్రస్టింగు అనిపించింది… ‘‘నో అమిత్ షా, నో నితిన్ గడ్కరీ, నో ఫడ్నవీస్, నో యోగీ… జస్ట్ వోన్లీ నితిన్ నబీన్…!!

 

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏ కుంపటి రాజేసినా మెచ్చరు… మారిన ఇండియన్ వోటర్ ఆలోచన సరళి…
  • ఒక ఛావా… ఒక ధురంధర్… హిందీ సినిమాకు మళ్లీ పూర్వ వైభవం…
  • తదుపరి ప్రధాని రేసులో లోకేష్..!! చివరకు ఇది ‘యెల్లో రాయిటర్స్‌’..!!
  • సత్వర న్యాయం Vs చట్టప్రకారం విచారణ… జనానికి ఏది నచ్చుతుంది..?!
  • జల్ జంగ్ సరే..! కానీ కేసీయార్ వదిలేసిన కీలక నీటి ప్రశ్నలేమిటంటే..!!
  • నో, నో…! బిగ్‌బాస్ పాపులారిటీతో ఏదో ఒరుగుతుందని అనుకుంటే భ్రమే..!!
  • యశోధర రాజే ఎవరు..! KCR ఎదుట తన సీఎం, తన పీఎం పరువు తీసిందా..?!
  • సినిమాల్లోకి ఆమని రీఎంట్రీ..! ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ..! కానీ..?!
  • కాంచనసీత..! ఏదో ఓ పురాణగాథను వర్తమానీకరించడం దాసరికి అలవాటే..!
  • BRS to TRS…? పార్టీ పేరులో తెలంగాణ ఆత్మకు పునఃప్రతిష్ట..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions