.
ఈ సంవత్సరం మొదట్లో అనుకుంటా… యాంకర్ శ్రీముఖి ఏదో సినిమా ఫంక్షన్‌లో మాట్లాడుతూ రాముడు, లక్ష్మణుడు ఫిక్షనల్ కేరక్టర్స్ అంది… తరువాత నెటిజనం, హిందూ సంఘాలు అగ్గిమండేసరికి తత్వం బోధపడి, అర్జెంటుగా క్షమాపణలు చెప్పింది ఏదో వీడియోలో…
సినిమా సెలబ్రిటీలందరూ పిచ్చి కూతలకు ప్రసిద్ధులు కదా… తరువాత సారీలు, లెంపలేసుకోవడాలు కూడా… శ్రీముఖి వివాదం ఎందుకు గుర్తొచ్చిందీ అటే… నిన్న చంద్రబాబు ఎక్కడో మాట్లాడుతూ కొన్ని అంశాలు చెప్పుకొచ్చాడు…
Ads
కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ నేనే కనిపెట్టాను, హైదరాబాద్ నేనే కట్టాను వంటి ప్రహసన వచనాలు కాదు… కాస్త డిఫరెంటుగా…. ప్రస్తుతం ఎన్డీయేలో ఉన్నాడు కదా, పైగా ఆ ప్రోగ్రామ్‌కు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వచ్చాడు… దాంతో బాబు గారు పొలిటికల్ స్వామీజీ అయిపోయాడు కాసేపు… ఇలా చెప్పుకొచ్చాడు…
‘‘భారతీయత మన బలం… బ్యాట్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్‌లకంటే మన హనుమంతుడు, అర్జునుడే గొప్ప… మన పురాణేతిహాసాలే మనకు స్పూర్తి కావాలి… కృష్ణుడి మహిమలు, శివుడి మహత్యం, రాముడి ఆదర్శాలు, పురుషోత్తముడి పాలన, రామరాజ్యం వంటి పాజిటివ్ విషయాలతోపాటు బకాసురుడు, కంసుడు వంటి రాక్షసుల గురించి చెప్పి, మంచికీ చెడుకూ నడుమ తేడాను వివరించాలి…’’
ఏ అంశమైనా సరే, మళ్లీ ఎన్టీయార్ దగ్గరకు తీసుకువస్తాడు కదా… ‘‘ఆరోజుల్లో ఎన్టీఆర్ తన సినిమాల ద్వారా పురాణేతిహాసాల విలువను కళ్లకు కట్టినట్టు చూపించి చైతన్యం తీసుకొచ్చాడు.,.’’ అన్నాడు…

ఇక విషయానికొద్దాం… బీజేపీని వ్యతిరేకించి, మోడీ మీద కుసంస్కార వ్యాఖ్యలు చేసి… నానా తిప్పలు పడి, తన ప్రాపకం సంపాదించి, సరే, ఏపీలో అధికారం సంపాదించాడు చంద్రబాబు… అది తన ఘనత కాదు, జస్ట్, పరమ అరాచకంగా పాలన నడిపిన జగన్ మీద తీవ్ర ప్రజా వ్యతిరేకత కారణంగా…. పవన్ పాసయ్యాడు, చంద్రబాబు పాసయ్యాడు… పిటీ జగన్…
అలాగని చంద్రబాబు గ్రేట్ అని కాదు కదా… అంతకుముందే జనం ఛీత్కరించారు కదా… గతంలో మోడీని నానా తిట్లూ… చివరకు మోడీ భార్యను కూడా బజారుకు లాగిన కుసంస్కారి కదా చంద్రబాబు…!
సరే… మోహన్ భగవత్ వచ్చాడు… తన మీదే హిందూ సమాజంలో బోలెడు విమర్శలున్నాయి… (తరువాత చెప్పుకుందాం)… తన మెప్పు పొందడం కోసం ఏదేదో స్క్రిప్టెడ్ మాటలు చెప్పుకొచ్చాడు చంద్రబాబు… ఏకంగా కాషాయపు అంగీ తొడుక్కున్నాడు… ఏవో వ్యాఖ్యలు చేశాడు…

అయ్యా, సారూ, నయా దొరవారూ… బ్యాట్స్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ జస్ట్ టైం పాస్ పల్లీ బఠానీ పాత్రలు… కానీ హనుమంతుడు, అర్జునుడు ఎట్సెట్రా పాత్రలు కావు… ఈ దేశం, ఈ జనం తరతరాలుగా ఆరాధిస్తున్న ఓ చరిత్ర, ఓ పురాణంలో ప్రముఖులు… వాళ్లకూ ఈ చిల్లర హాలీవుడ్ పాత్రలకూ పోలిక ఏమిటసలు..? అంటే… నువ్వు కూడా బ్యాట్స్‌మ్యాన్, స్పైడర్‌మ్యాన్ పాత్రల్లాగే అర్జునుడు, హనుమంతుడు కూడా ఫిక్షనల్ కేరక్టర్లు అంటున్నావా..?
నీ సమర్థక వీర, భీర, ధీర, గంభీర, తీవ్ర సనాతన ధర్మపరిరక్షకుడు పవన్ కల్యాణుడు కూడా ఆమోదించాడా నీ వ్యాఖ్యల్ని..! నీ తోక పట్టుకుంటేనే మోక్షం అని బలంగా నమ్మే ఏపీబీజేపీ కూడా ఆమోదించిందా..? ఏపీలో ఎలాగూ హిందూ సమాజం చైతన్యరహితమై ఏడుస్తోంది గానీ… చివరకు నీ పక్కనే కూర్చున్న సదరు మోహన్ భగవతుడు కూడా తలూపాడా..? ఫాఫం, ఆర్ఎస్ఎస్..!!
అన్నట్టు... తమరి బాధిత మామ... ఎన్టీయారుడు కూడా కీచకుడు, దుర్యోధనుడు, రావణుడు, కర్ణుడు ఎట్సెట్రా పురాణ పాత్రలకు హీరోయిజం అద్ది, గ్లోరిఫై చేసినవాడే... నీకు అంత తెలిసి ఉంటుందని మాకు తెలియదు..!!
Share this Article