.
వింత పాత్రికేయమో, వితండ పాత్రికేయమో…. సాక్షిలో నిన్న రెండు స్టోరీలు ‘అడ్డగోలుగా దారి తప్పిన సాక్షి’ని చూపిస్తున్నాయి…
మొదటిది… తిరుమల వైకుంఠ ద్వార దర్వనాల టోకెన్లకు సంబంధించి… ఇదుగో ఇలా…
Ads

ఏందయ్యా సాక్షి బాధ అంటే..? ఆఫ్ లైన్ టోకెన్లు రద్దు చేశారట, చేతకాని అసమర్థత, ఇది విడ్డూరం అని రాసుకొచ్చింది… గత ఏడాది భక్తులు టోకెన్లకు విరగబడటంతో తొక్కిసలాట జరిగి, ఆరుగురు మరణించారు, 40 మంది దాకా గాయపడ్డ విషాదం… ఈసారీ అలాగే విపరీతంగా భక్తులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి…
అందుకని ఆఫ్ లైన్ టోకెన్ల జారీని ఆపేసి… ఆన్ లైన్‌లో బుక్ చేసుకున్న దర్శనాలకు మాత్రమే చాన్స్ అని ప్రకటించారు… మూడు రోజులపాటు ఆన్ లైన్ టికెట్లు లేనివాళ్లు అసలు తిరుమలకు రావద్దనీ ప్రకటించారు… అంతేకాదు, అలిపిరి దగ్గరే చెక్ చేసి, ఆల్ రెడీ బుక్ చేసుకున్నవారినే పైకి అనుమతిస్తున్నారు… గుడ్ డెసిషన్…
పెళ్లాంపిల్లలతో వృద్ధులతో క్యూలలో మగ్గిపోకుండా… తోపులాటల్లో బలిగాకుండా… ఏ విషాదమూ చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్త ఇది… అది అసమర్థత ఎలా అవుతుంది..? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్… ఆన్ లైన్ సౌకర్యాన్ని తప్పుబడుతూ, ఆఫ్ లైన్ ను ప్రమోట్ చేస్తున్నట్టుంది…
ఓ శాడిస్టిక్ నేచర్ ఉన్న వార్త ఇది… చదువుకోని వారు, గ్రామీణ భక్తులకు తీవ్ర అన్యాయం అట… మనోభావాలు దెబ్బతీయడం అట… రద్దీ ఉండే రోజుల్లో ప్రోటోకాల్ దర్శనాలు మినహా అన్నిరకాల (వీఐపీ, బ్రేక్ దర్శనాలు ఎట్సెట్రా ) దర్శనాలనూ రద్దు చేసి… సర్వదర్శనాలకే ప్రయారిటీ ఇస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ… మరో వితండవాదం ఏమిటంటే..?
8 లక్షల జనాభా ఉంటే తిరుపతి స్థానికులకు కేవలం 15 వేల టికెట్లు ఇవ్వడం ఏమిటని రాయడం… మరెంతమందికి ఇవ్వాలి మాస్టారూ..? జనవరి 2 నుంచి సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో కూడా ఇస్తామనీ ప్రకటించారు… ఈ విషయంలో సాక్షి వాదన అస్సలు బాగాలేదు… ఏదో ఒకటి ఆడిపోసుకోవాలనే ఆకాంక్ష తప్ప..!
నిన్నటి ఏడుపు ఎలా ఉన్నా… ఈరోజు ఇచ్చిన వార్త ప్లెయిన్‌గా, ఏ శోకమూ, మొత్తుకోలూ లేకుండా బాగుంది… భక్తులకు అవసరమైన సమాచారం… ఇలా…

గ్రామీణులకు, చదువుకోని వారికి ఆన్ లైన్ టికెట్లు ఎలా బుక్ చేయించుకోవాలో తెలుసు… వాళ్లు అజ్ఞానులు, పట్టణ భక్తులకు మాత్రమే అన్నీ తెలుసు, పాపం పల్లె భక్తులకు వెంకన్న దర్శనం అందని ద్రాక్ష అనే బాష్యాలు మాత్రం విడ్దూరం…
మరో వార్తకు వద్దాం… ఇది అల్లు అర్జున్ మీద స్టోరీ…

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి పోలీసులు చార్జి షీటు దాఖలు చేశారు… అందులో థియేటర్ యాజమాన్యంలోని అందరిపైనా ప్లస్ అల్లు అర్జున్ మీద కూడా చార్జెస్ ఫ్రేమ్ చేశారు… ఖచ్చితంగా ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ బాధ్యతారహిత ప్రవర్తన కూడా ఓ ప్రధాన కారణం… ఆ విశ్లేషణ మళ్లీ ఇక్కడ అక్కర్లేదు కానీ… ఇది కక్ష సాధింపు అట…
ఎందుకంటే..? బాధిత కుటుంబాన్ని పరామర్శించాడట, గాయపడిన శ్రీతేజ చికిత్సకు అవసరమైన ఖర్చు భరిస్తున్నాడట… ఐనా ఈ చార్జెస్ ఏమిటనేది సాక్షి బాధ… తెగ బాధపడిపోయింది ఈ స్టోరీలో… సో, చికిత్స ఖర్చు భరించి, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే కేసు మాఫ్ అయిపోవాల్సిందేనట… హేమిటో…
మళ్లీ ఈ వార్తలోకి చంద్రబాబును లాక్కొచ్చి, తన మీద ఎన్ని కేసులు పెట్టాలి మరి అని ప్రశ్నిస్తోంది… అవును, అది అడగాల్సింది ఏపీ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని కాదు కదా… ఏ సెలబ్రిటీ అయినా సరే, బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే, ఏదైనా నష్టం జరిగితే బాధ్యత వహించాల్సిందే అని చెబుతున్నారు తెలంగాణ పోలీసులు… అది కక్షసాధింపు ఎలా అవుతుంది..?
ఈ ప్రేమకు కారణం ఏమిటయ్యా అంటే…? తనది మెగా ఫ్యామిలీ అయినా సరే, పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేయకుండా, అల్లు అర్జున్ ఓ వైసీపీ అభ్యర్థికి మొన్నటి ఎన్నికల్లో మద్దతు ప్రకటించడం… సో, మనవాడు అనుకుని ప్రేమిస్తే పర్లేదు, మంచిదే, కానీ మరీ ఇలాంటి కేసుల్లో వితండవాదంతో వెనకేసుకురావడం ఏమిటి..?
Share this Article