.
బహుశా కేసీయార్ ఊహించి ఉండడు కలలో కూడా..! తను అనేకానేక కేసులు పెట్టి వేధించినా సరే, కక్షపూరితంగా వ్యహరించినా సరే… రేవంత్ రెడ్డి అవన్నీ మనసులో పెట్టుకోకుండా, అసెంబ్లీకి ఏదో తప్పనిసరి తంతులాగే వచ్చినా సరే, సాదరంగా కరచాలనం చేస్తాడని… ఆరోగ్యం బాగుందా అని అడుగుతాడని…
ఊహించి ఉండడు, తన దొరతనం అంచనా వేసి ఉండదు… మంత్రులతో సహా మొత్తం కాంగ్రెస్ శాసనసభాపక్షం కూడా ఒక్క వెకిలి మాటతో ర్యాగింగు చేయకుండా వచ్చి తనను పలకరిస్తారని… ఏ ఒక్కరూ పల్లెత్తు మాట అనకుండా హుందాతనాన్ని, సంస్కారాన్ని, గౌరవం చూపిస్తారని.,. తన పార్టీ, తన ధోరణి, తన వారసుల నిజతత్వాలకు భిన్నంగా సంయమనాన్ని ప్రదర్శిస్తారని…
Ads
తుండి విరిగి మంచం మీద పడినా, ఇదే రేవంత్ రెడ్డి హాస్పిటల్ వచ్చి పరామర్శించాడు… ఎవరిపాపాన వాళ్లే పోతారు అని… కక్షతోె వ్యవహరించకుండా… లిఫ్ట్ చేసి, జైలులో పారేయకుండా… కేసీయార్ వయస్సుకు, తన మాజీ హోదాకు గౌరవం ఇస్తాడని నిజంగానే కేసీయార్‌లోని దొరతనం అస్సలు ఊహించి ఉండదు…
జనం మీద కక్ష తగదు, నీకు తరతరాలకు సరిపడా సంపదను నీకూ నీ పరివారానికి ఇచ్చిన తెలంగాణ ప్రజల మీద కోపం తగదు, నువ్వు అసెంబ్లీకి రా, నీ మర్యాదుకు నాదీ పూచీ అన్న రేవంత్ రెడ్డి అక్షరాలా అదే చూపించాడు… ఇక్కడ కేసీయార్‌లోని దొరతనం భంగపడినట్టుంది…
అదుగో వచ్చాడు, బయల్దేరాడు, అడుగుపెట్టాడు, ఇక కాచుకో, ఎండగడతాడు, నారతీస్తాడు, చీరిచింతకు కడతాడు, వచ్చేశాడు, అదుగో కారు దిగాడు………… వంటి అనేకానేక కృత్రిమ, నిరర్థక ఎలివేషన్లను పటాపంచలు చేస్తూ…. అటెండెన్స్ వేసి 4 నిమిషాల్లోనే ఇక పత్తాకు లేకుండా పోయాడు కేసీయార్… తన అసలు ధోరణి అదే… జనం పట్టని, రాష్ట్రం పట్టని, తన ప్రతిపక్ష పాత్ర పట్టని నిజనిర్లక్ష్యం..!!

చివరకు మొన్న కూడా జనంలోకి నామ్‌కేవాస్తే వచ్చి… నీ తోలు తీస్తా అని క్షుద్ర బెదిరింపులకు పూనుకున్నా సరే… రేవంత్ రెడ్డి నవ్వుతూ, తలెత్తి, తనకు సాక్షాత్తూ శాసనసభలో మర్యాద ఇస్తాడని కేసీయార్‌లోని దొర అనుకుని ఉండడు బహుశా….
చివరకు అసెంబ్లీలో సంతాపాలు ప్రకటించే వరకూ ఆగకుండా…. అనర్హత వేటు పడకుండా అటెండెన్స్ రిజిష్టర్‌లో సంతకం చేసి పారిపోయిన దొరతనం బహుశా లోలోపల ఆత్మమథనంతో కుమిలిపోయి ఉంటుంది….
మంత్రులు, ఎమ్మెల్యేలు, చివరకు కొత్తగా ఎన్నికైన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే సహా…. కేటీయార్, హరీష్ రావు ధూర్త వ్యాఖ్యలకు కోపగించుకోకుండా… కేసీయార్ పట్ల మర్యాద చూపించారు కదా… తమకు అలవాటు లేని ఈ మర్యాదను కాంగ్రెస్ కనబర్చడం నిజంగానే ఎవరూ ఊహించి ఉండరు…
ఆగండాగండి… తోలు తీస్తా, తాట తీస్తా భాష మాట్లాడి వెళ్లాడు కదా మొన్న… తను వస్తే గిస్తే అసెంబ్లీకి అటెండెన్స్ కోసమే వస్తాడు అనైతికంగా అని అందరూ అనుకుంటున్నదే…. తన దొరతనం తెలిసినవాళ్లు… అక్షరాలా అలాగే చేశాడు… తను జనంలోకి వచ్చేది లేదు, ఓ ప్రజాజీవనంలో ఉండే నాయకుడికి ఉండాల్సిన పరిపక్వత, విజ్ఞత చూపించిందీ లేదు…
వెరసి, కేసీయార్ మారిందీ లేదు, అసలు మారడు కూడా… అక్షరాలా ఆ కేసీయార్ వారసులే కదా, హరీష్ రావు, కేటీయార్ తమ బాస్ అటు నిష్క్రమించాడో లేదో మళ్లీ మొదలు పెట్టారు కువిమర్శలు, యధావిధి ప్రేలాపనలు…. కువారసత్వం…! సరే, కేటీయార్‌లోని నయా దొర గురించి తెలిసిందే, ఫాఫం హరీష్ రావుకు ఏమైంది..? సేమ్ షేమా…!! తనంతటతానే అప్రతిష్టను మూటగట్టుకుంటున్నాడు…
ఎస్, అంతిమంగా కేసీయార్ తన దొరతనాన్ని, ప్రజాతీర్పు పట్ల తన అగౌరవాన్ని, అసెంబ్లీ పట్ల తన మర్యాదను తనే ప్రదర్శించుకున్నాడు… జస్ట్, అనర్హత వేటు పడకుండా రెండే నిమిషాలు అక్కడ కూర్చుని, నిష్క్రమించాడు… కేసీయార్…, చరిత్ర లిఖించుకోవడం అహంతో కాదు, పరిణత రాజకీయంతో,, అడుగడుగునా అహంతో కాదు… జాతిపిత అనే అనర్హత కీర్తనలు, భజనలతో కాదు… సరైన హుందాతనంతో..!!
చివరగా…… రేవంత్ రెడ్డి సభలోకి వస్తున్నప్పుడు, తన వద్దకు వస్తున్నప్పుడు కేసీయార్ లేచి నిలబడిన సీన్… నభూతో… అదే అల్టిమేట్… కేసీయార్ సార్, దొరలు, రాజులు, రాజరికాలు, నియంతృత్వాలు, అహాలు… ఎల్లకాలమూ సాగవు… ప్రత్యర్థులు, శత్రువులు అనుకున్న కేరక్టర్లే పాఠాలు చెబుతున్నారని అర్థమైంది అనుకుంటా..!!
Share this Article