.
Subramanyam Dogiparthi…. 10000% comedy guaranteed . పొట్ట చెక్కలు కావలసిందే . దర్శకుడు రేలంగి నరసింహారావే అయినా క్రెడిట్ మాత్రం కధా రచయిత , డైలాగుల రచయిత , మా గుంటూరు వాస్తవ్యులు Divakara Babu Madabhushi గారికే చెందాలి . సినిమా పేరు చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం.
టైటిల్సులో మూలకధ క్రెడిట్ ఇరువురికి ఇవ్వడం జరిగింది . ఒకరు వెంకట్ , ఇంకొకరు దివాకర్ బాబు గారు . వెంకట్ గారి సంసారం ఒరు మీమ్ సారం , దివాకర బాబు గారి పుటుక్కు జరజర డుబుక్కుమే నాటికలు మూలకధలు అని పేర్కొన్నారు .
Ads
మొత్తం మీద కధ , డైలాగుల క్రెడిట్ దివాకర బాబు గారికే ఇచ్చారు . ఈ సినిమాలో ఆయన సృష్టించిన పాత్రలు , వాటి మేనరిజమ్స్ ప్రేక్షకుల పొట్టలు నవ్వలేక పగలాల్సిందే . హీరోహీరోయిన్లు రాజేంద్రప్రసాద్ , రజనిలే అయినా , మన పొట్టల్ని పగలకొట్టేది పొట్టి ప్రసాద్ , సంజీవి , శ్రీలక్ష్మి , డా శివప్రసాద్ .
చుట్టుపక్కల ఇళ్ళల్లో ఏ వస్తువు కనపడ్డా ఎత్తుకొచ్చుకోవటం ఆవిడ మోడల్ . ఒకరోజు పక్కింటావిడ చీరెను కట్టేసుకుంటుంది . తన భార్యే అనుకుని పొట్టి ప్రసాద్ కౌగలించుకుంటాడు . పొరపాటున కౌగిలించుకున్నానని కనపడ్డ ప్రతోడికీ చెపుతుంటాడు . అసలు మొగుడు సంజీవికి పిచ్చెక్కుతుంది . ఈ ఎపిసోడ్ చూస్తుంటే నవ్వలేక మనకు పిచ్చెక్కుతుంది .
ఈ పొట్టి ప్రసాదుకు మరో డైలాగ్ . సలహా చెప్పటానికి సమయానికి మా ఆవిడ కూడా ఊళ్ళో లేదు అనే డైలాగ్ . సినిమా చివరిదాకా వస్తూనే ఉంటుంది . అమాయకపు మొహంతో అతను చెప్పే ఆ డైలాగ్ కూడా మన పొట్టల్ని పగలకొడుతాయి .
శ్రీలక్ష్మికి మూడ్ వస్తే పద్యాలు ఎత్తుకుంటుంది . ఆమె పద్యాలు ఎత్తుకోగానే వాళ్ళింటి బట్టలు ఉతికే డా శివప్రసాద్ కూడా ఎక్కడ ఉన్నా గబగబా వచ్చేసి పద్యాలను ఎత్తుకుంటాడు . ఈ గోల చూడలేక మన పొట్టలు పగలాల్సిందే . ఇదంతా ఒక కామెడీ ట్రూప్ .
మరో పాత్ర నిర్మలమ్మది . హీరోయిన్ రజని నానమ్మ . తన మాట వినకపోయినా , తిక్క రేగినా రోడ్డు మీదకొచ్చి అందరినీ పోగేసి ఎవరినయినా ఎడాపెడా వాయించేస్తుంది . తన ఇష్టప్రకారం జరగ్గానే పోగయిన అందరినీ వాయించి పంపించేస్తుంది . మరో పాత్ర రాధాకృష్ణ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ నూతన్ ప్రసాదుది . ఎక్కడో ఉండి బ్రాంచి మేనేజర్ బుర్రలో ఏముందో చెప్పేస్తుంటాడు .
ఇంక కధానాయకుడు , కధానాయకి . రాజేంద్రప్రసాద్ బుధ్ధిమంతుడు . రజని పక్కా నానమ్మ కూచి , చాదస్తురాలు . తన చాదస్తంతో మెగుడిని విసిగిస్తూ ఉంటుంది . పాపం రాజేంద్రప్రసాద్ ఇద్దరితో సర్దుకుపోతుంటాడు .
ఇంక స్టోరీ ఏందంటే : రాజేంద్రప్రసాదుకు హెడ్డాఫీసుకు ప్రమోషన్ మీద బదిలీ అవుతుంది . ఇల్లు దొరికే వరకు కొలీగ్ తనింట్లో ఉండమంటాడు . భార్య ఊళ్ళో లేనప్పుడు అతను పెట్రోమాక్స్ లైటును తెచ్చుకుంటూ ఉంటాడు . దీనిని భరించలేక భార్యను తెచ్చుకునేందుకు ఊరికి బయలుదేరుతాడు . రైల్లో ఓ పెట్రోమాక్స్ లైట్ తారసపడి లాడ్జింగుకు వెళ్ళి పోలీసులకు దొరుకుతారు . వారిద్దరూ భార్యాభర్తలే అని నూతన్ ప్రసాద్ చెప్పటంతో పోలీసులు వదిలేస్తారు .
గోలంతా ఇక్కడ నుంచే . నూతన్ ప్రసాద్ ఖాళీగా ఉన్న పోర్షన్లో ఉండమంటాడు . ఇంతలో భార్య నానమ్మతో దిగిపోతుంది . ఇద్దరి మధ్య ఫుట్ బాల్ అవుతాడు హీరో . ఈమె చాలదన్నట్లు పెట్రోమాక్స్ లైట్ అక్క కూడా దిగిపోతుంది . రాజేంద్రప్రసాద్ , నూతన్ ప్రసాద్ , పెట్రోమాక్స్ లైట్ , ఆమె అక్క మమత , నూతన్ ప్రసాద్ భార్య వై విజయ , రాజేంద్రప్రసాద్ భార్య రజనిల మధ్య mistaken identities తో గోలగోల అవుతుంది .
ఇప్పుడు ఈ సినిమా చూస్తుంటే 2003 లో వచ్చిన పెళ్ళాం ఊరెళితే సినిమా గుర్తుకొస్తుంది . మధ్యలో పాలు పోసే పాలమ్మాయి కూడా రాజేంద్రప్రసాదుని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది . క్లైమాక్సులో అందరూ పోలీస్ స్టేషన్లో కలుసుకుని జరిగిన స్టోరీ అంతా ఒకరికి ఒకరు చెప్పుకోవడంతో మబ్బు తెరలు వీడి కధ సుఖాంతం అవుతుంది .
జె వి రాఘవులు సంగీత దర్శకత్వంలో పాటలు బాగుంటాయి . టైటిల్ సాంగ్ చలాకీ మొగుడు శంభో లింగా చాదస్తపు పెళ్ళాం ఆత్మా లింగా సరదాగా ఉంటుంది . ముద్దుకు వేళ కాదు వద్దయ్యా , శ్రీరంగ రంగ , చేయి పట్టి లాగినట్లు అంటూ సాగుతాయి పాటలు . సిరివెన్నెల వారు , ముళ్ళపూడి శాస్త్రి పాటల్ని వ్రాయగా బాలసుబ్రమణ్యం , చిత్ర పాడారు .
It’s a full comedy of mistakes and mistaken identities . మస్తు కామెడీ సినిమా . ఇంతకుముందు చూసినా మళ్ళా చూడొచ్చు . మూడ్ బాగా లేనప్పుడు , బాగా ఉన్నప్పుడు యూట్యూబులో చూసేయండి . Worth watching comedy , feel good movie .
నేను పరిచయం చేస్తున్న 1209 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_స్కూల్ #సినిమా_కబుర్లు
Share this Article