.
పాలమూరు- రంగారెడ్డి …. నీళ్లలో నిప్పు రాజుకుంది… హరీష్ రావు ఎంత ఎక్కువ మాట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి అంతకన్నా ఘాటుగా కౌంటర్లు,, ఆరోపణల డోస్ పెంచుతున్నాడు… కొత్త ప్రశ్నల్ని సంధిస్తున్నాడు… హరీష్ రావు, కేసీయార్ జాయింటు జలనిర్వాకాల్ని మరింతగా ఎక్స్‌పోజ్ చేస్తున్నాడు…
నిన్న రేవంత్ రెడ్డి ప్రధాన విమర్శ ఏమిటంటే..? ‘‘హరీష్, కేసీయార్ చేసిన ద్రోహాలకు వాళ్లిద్దర్నీ ఉరితీసినా తప్పులేదు… ఇవే తప్పులు మిడిల్ ఈస్ట్‌లో చేస్తే రాళ్లతో కొట్టి చంపేవాళ్లు… పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు నీటిని జూరాల నుంచి గాకుండా శ్రీశైలం నుంచి తీసుకునేలా మార్చడం పెద్ద ద్రోహం… మంత్రివర్గ ఆమోదం కూడా లేదు ఆ నిర్ణయానికి… అది పక్కాగా కమీషన్ల కక్కుర్తి కోసమే… దానిపై సిట్ విచారణ జరిపిస్తాం…
Ads
ఆ ద్రోహం కారణంగా మూడు స్టేజులు అయిదు స్టేజులకు.., 22 పంపులు, 37కు.., 32 వేల ఖర్చు 84 వేల కోట్లకు పెరిగింది… పదేళ్లలో వందేళ్ల ద్రోహం చేశారు..’’
ఈ పరస్పర ఆరోపణలు- విచారణలతో చివరకు ఏం జరుగుతుందనేది వదిలేస్తే… కేసీయార్ పాలనలో జరిగిన జలతప్పిదాలు మరింతగా ఎక్స్‌పోజ్ అవుతున్నాయి… చివరకు తెలంగాణకు కీలకమైన నదీజలాల విషయంలో కూడా..! ఈ విమర్శకు హరీష్ రావు వెంటనే రియాక్టయ్యాడు… రేవంత్ రెడ్డిని ఘాటుగా తిడుతూ ఓ ప్రకటన జారీచేశాడు… అందులోనూ మళ్లీ అవే పాత అబద్దపు బాష్యాలే… కొన్ని జవాబుల్లేని ప్రశ్నలు…
1) ‘‘తుంగభద్ర నుంచి ఏటా 450 నుంచి 600 టీఎంసీలు వస్తాయి… అందుకే శ్రీశైలం నుంచి నీరు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నాం… జూరాల దగ్గర నీటిలభ్యత ఉండదు…’’
- మరి అక్కడి నుంచి ఏపీకి, చెన్నై దాకా తరలిపోయే నీరెంత..? ఏపీకి నీళ్లు తీసుకుపోయే ప్రాజెక్టులు వాడుకునే నీళ్లెంత..? రోజుకు 13- 14 టీఎంసీలు తీసుకుపోగలదు ఏపీ… పైగా అది సరిపోదని జగన్‌తో కుమ్మక్కై, రాయలసీమ లిఫ్టుకు, పోతిరెడ్డిపాడు విస్తరణకు మౌనంగా ఉండి, సహకరించింది ఎవరు..? ఎవరి కోసం పీఆర్ఎల్ఐ సామర్థ్యాన్ని ఒకటి టీఎంసీకి కుదించారు..?
2) ‘‘బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి డీపీఆర్ పంపించి 7 అనుమతులు తెచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే డీపీఆర్ వాపస్ వచ్చింది…’’
- అసలు మొదట ప్రతిపాదనే తాగునీటి ప్రాజెక్టు పేరిట, అదీ జస్ట్ 7 టీఎంసీలకు… తరువాత ఐదారేళ్లకు, అదీ దాదాపు 20 వేల కోట్ల ఖర్చయ్యాక గానీ డీపీఆర్ పంపించలేదు… దీని మర్మమేంటి..? పైగా అదీ వాపస్ వచ్చిందంటేనే, అంత లోపభూయిష్టంగా పంపించినట్టు కదా… అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమే కదా… అసలు చర్చించాల్సింది సుప్రీంలో కేసు గతి ఏమిటని..?!
3) ‘‘ఎన్టీటీలో ఓ ప్రబుద్ధుడితో కేసు వేయించింది కాంగ్రెస్ ప్రభుత్వమే…’’
- మరి ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది, వెన్నుతట్టింది బీఆర్ఎస్ పార్టీ కాదా..?
హరీష్ రావు పదే పదే ఆదిత్యనాథ్ దాస్‌ను ఎందుకు తెలంగాణ ద్రోహిగా ముద్రవేస్తున్నాడో, చంద్రబాబు మనిషి అని ముద్ర ఎందుకు వేస్తున్నాడో అర్థం కాదు… 1) తను తెలుగువాడు కాదు, బీహారీ… 2) జలయజ్ఞం సమయంలో ఇరిగేషన్ సెక్రెటరీ, ఏపీ- తెలంగాణ అన్ని ప్రాజెక్టుల కథలూ తెలిసినవాడు… 3) ఐతే గియితే తను జగన్ మనిషి అవుతాడు, తన పీరియడ్‌లోనే రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు విస్తరణ వంటివి జరిగాయి అనుకుంటే..! 4) ఆ సమైక్య ఏపీ జగనేమో కేసీయార్‌కు జాన్‌జిగ్రీ, మరి హఠాత్తుగా తను చంద్రబాబు మనిషెలా అయ్యాడు..? 5) చంద్రబాబు ఏపీకి ఉపయోగపడేలా ఆదిత్యనాథ్ దాస్‌ను ఇక్కడ చేర్పించాడు అనే ముద్ర వేయటానికి ఈ విమర్శలన్నీ..!!
చివరగా... హరీష్ రావు ఆరోపిస్తున్నట్టు... రేవంత్ రెడ్డి కేసీయార్‌ను కసబ్‌తో పోల్చలేదు... ఉరేసినా తప్పులేదు అనే సదర్భంలో కసబ్‌ను కూడా మన ప్రజాస్వామిక వ్యవస్థలో కోర్టు విచారించాకే ఉరితీశాం అన్నాడు... మరి కేసీయార్‌ను కసబ్‌తో పోలుస్తావా అంటూ హరీష్ రావు దాన్ని కేసీయార్‌కు అన్వయించడం దేనికి..? కేసీయార్‌ను తనే పలుచన చేయడం దేనికి..?
Share this Article