.
హరీష్‌రావు మీద పదే పదే కేసీయార్ బిడ్డ కవిత ఆరోపణల దాడి చేస్తూనే ఉంది కదా… నిజానికి కేసీయార్ కూడా అదే కత్తెర పనిలో పడ్డాడా..? నిన్నటి పరిణామాలన్నీ అవే సందేహాలకు దారితీస్తున్నాయి…
ఎలాగంటే..? కేసీయార్ జలఖడ్గం, జలసమరం అని ఏదో అన్నాడు… పాలమూరు- రంగారెడ్డి బేస్‌గా ఇక ప్రభుత్వంపై పోరాటం అన్నాడు కదా… సహజంగానే అప్పటి సాగునీటి మంత్రిగా హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శల దాడిని ఎదుర్కోవాలి… దానికి తగినట్టుగానే వారం రోజుల నుంచి హైలైట్ అవుతున్నాడు…
Ads
కేటీయార్ చాలా వెనకబడిపోయాడు, తనకు ఇరిగేషన్ సబ్జెక్టు పెద్దగా తెలియదు… కేసీయార్ ఎలాగూ జనజీవితంలోకి రాడు… మరోవైపు పాలమూరు- రంగారెడ్డి అక్రమాలపై ప్రత్యేక విచారణ అంటూ రేవంత్ రెడ్డి కేసీయార్- హరీష్ రావు మెడలపై మరో కత్తిని వేలాడదీసే పనిలోపడ్డాడు…
15 రోజులు అసెంబ్లీ సమావేశాల్ని పెట్టండి, కాంగ్రెస్ కువిమర్శల్ని కడిగేస్తాను అన్నాడు, రెడీ అయ్యాడు హరీష్ రావు… హఠాత్తుగా కేసీయార్ ‘అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ’ అని నిర్ణయం తీసుకున్నాడు… హరీష్ రావు షాక్… కానీ ఏం చేయగలడు..? తనకు మైక్ ఇవ్వడం లేదనే ఓ చిన్న సాకుతో ఈ సెషన్ బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి, సైలెంటుగా ఇంటి బాట పట్టాడు, చిన్నబోయి..!!

ఎర్రవల్లి ఫామ్‌హౌజుకు చేరుకున్న కేసీయార్… ఈరోజు పత్రికల్లో చిన్నగా అక్కడక్కడా కనిపించిన వార్త… చదివిన వెంటనే తెలంగాణ సమాజంలో పుట్టే ప్రశ్నలు ఏమిటి..?
జలఖడ్గం అన్నాడు, తోలు తీస్తా అన్నాడు, జల్‌జంగ్ అన్నాడు, ఇక నుంచీ మరో లెక్క అన్నాడు… మరేమైంది..? ఎప్పటిలాగే ఫామ్ హౌజు బందిఖానాలోకి మళ్లీ ప్రవేశించాడు… తను అంతే… తనను ఇంతవాడిని చేసిన తెలంగాణ జనం మీద, ప్రతిపక్ష నేతగా తన బాధ్యత మీద, ప్రజాజీవనం బాపతు కర్తవ్యం మీద చిన్నచూపు…

మరి తప్పులో ఒప్పులో, వక్రబాష్యాలో… హరీష్ రావు బాగానే వాదిస్తున్నాడు కదా, హఠాత్తుగా అసెంబ్లీ సమావేశాల బహిష్కరణ పిలుపు దేనికి తీసుకున్నట్టు..? దీంతో తెలంగాణ సమాజానికి ఏం సంకేతాలు ఇచ్చినట్టు..?
ప్రతిపక్షం పారిపోయిందని అధికార పక్షం ఎద్దేవా చేయడానికి చాన్స్ ఇచ్చినట్టు..? గతంలోని తమ జలనిర్ణయాల్లో అక్రమాలు, తప్పుటడుగుల్ని సమర్థించుకోలేక ఏదో ఓ పిచ్చి సాకుతో తప్పించుకుని పోయినట్టు వాళ్లే స్వయంగా చెబుతున్నట్టు కాదా..?

దీంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పర్ హ్యాండ్ ఇచ్చింది బీఆర్ఎస్ చేజేతులా..! సెల్ఫ్ గోల్ కొట్టుకుంది పొలిటికల్‌గా… అసెంబ్లీలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయటానికి ఇలా బాయ్‌కాట్ నిర్ణయం తీసుకుంది… కానీ తన పోరాటాన్ని తనే డైల్యూట్ చేసుకుంది…
అధికారపక్షం ఏం చెబుతుందో సావధానంగా విని, తరువాత తమ వాదన వినిపించటానికి స్పీకర్‌పై ఒత్తిడి తీసుకువచ్చి, ఆయన అంగీకరించకపోతే అప్పుడు బాయ్‌కాటో, వాకౌటో చేస్తే అది జనంలోకి సరిగ్గా వెళ్లేది… హరీష్‌రావుకు మైలేజీ కూడా వచ్చేది… కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ప్లాన్ ఎటెటో వెళ్లి, ఎక్కడో చతికిలపడింది… ఏమో, ఆల్రెడీ పొలిటికల్ విశ్లేషణల్లో కనిపిస్తున్నట్టు… హరీష్‌రావుకు కత్తెర పెట్టే ఆలోచనేమో..!!
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్యాకేజీలను హరీష్ రావు అమ్ముకున్నాడని కవిత ఆరోపిస్తోంది... రేవంత్ రెడ్డి కూడా అదే చెబుతున్నాడు... హరీష్ రావు అవన్నీ అధికారికంగా అసెంబ్లీ రికార్డుల్లో నమోదు కావొద్దని అనుకుంటే మాత్రం, బాయ్‌కాట్ చేస్తే మాత్రం... ప్రభుత్వం ఊరుకోదు కదా...!!
Share this Article