.
కల్వకుర్తి లిఫ్ట్‌ను హరీష్ రావు మరో మేడిగడ్డను చేశాడా..? ఇదీ కవిత లేవనెత్తిన మరో ప్రశ్న… నిజానికి బీఆర్ఎస్ కృష్ణా జలాల ద్రోహాలపై ప్రభుత్వ వివరణలు ఒకెత్తు… కవిత వేసిన కీలక ప్రశ్నలు మరో ఎత్తు…
ఆమె ఏమంటున్నదంటే..? ‘‘ఏపీ, తెలంగాణ వాటాలు 63ః37 శాతాలుగా ఉంటే, అందులో తెలంగాణ వాటాను 3 శాతం తక్కువకు, అంటే 34 శాతానికి అంగీకరిస్తూ 2016లో కృష్ణా రివర్ వాటర్ మేనేజ్‌మెంట్ బోర్డు ఎదుట తెలంగాణ ప్రభుత్వం సంతకం ఎందుకు చేసింది..? అప్పుడు ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్న హరీష్ రావు సమాధానం చెప్పాలి…’’
Ads
(299 టీఎంసీలకు ఎందుకు కేసీయార్ ప్రభుత్వం అంగీకరించి, తెలంగాణ ప్రయోజనాలకు మరణశాసనం లిఖించిందో జవాబు చెప్పాలన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నకు ఈరోజుకూ సరైన జవాబు లేదు… పైగా నిన్నటి పీపీటీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వమే 2024-25లో ఈ 3 శాతం వాటా తగ్గింపునకు ఆమోదం చెప్పిందని హరీష్ రావు చెప్పాడు… 2016లోనే హరీష్ రావు నేతృత్వంలోనే ఈ తప్పు జరిగిందని కవిత చెబుతోంది…)
ఆమె మరో ప్రధాన ప్రశ్న… ‘‘వాటర్ ఇన్‌టేక్ సోర్స్ జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చాల్సి వచ్చింది హరీష్ రావూ?’’ సరే, ఈ ప్రశ్న తెలంగాణ సమాజం మొత్తం అడుగుతున్నదే… ప్రభుత్వమూ అడుగుతున్నది… ఏవో పొంతన లేని జవాబులు ఇస్తూ వస్తున్నాడు… నిజంగా జవాబులు చెప్పాల్సిన కేసీయార్ మళ్లీ సైలెంటుగా తన కకూన్‌లోని వెళ్లిపోయాడు…
వీటికి మించి ఆమె వేసిన మరో ప్రశ్న కీలకమైంది… ‘‘మొదటి లిఫ్ట్ ఎల్లూరు పంప్ హౌజ్… అది ఓపెన్ పంప్ హౌజుగా ఉంటే, దాన్ని అండర్ గ్రౌండ్ పంప్ హౌజుగా మార్చారు… దాంతో ఏకంగా 1400 కోట్ల మేరకు ఖర్చు పెరిగింది… హరీష్ రావు ధనదాహం సంగతి ఎలా ఉన్నా… దీనివల్ల పంపుల కెపాసిటీ తగ్గింది…
దీనివల్ల శ్రీశైలం తక్కువ నీటిమట్టాల ఎత్తు నుంచి నీటిని డ్రా చేసుకునే వీల్లేకుండా… 30 మీటర్ల ఎత్తు పెరిగింది… అంటే ఎగువ నీటిమట్టాల నుంచి మాత్రమే నీటిని డ్రా చేసుకోగలం… అదొక నష్టం… అంతేకాదు, ఈ దెబ్బతో కల్వకుర్తి మోటార్లను కొడితే… అప్పటి నుంచీ కేవలం 3 మోటార్లతోనే నడుస్తోంది కల్వకుర్తి లిఫ్టు… ఐదేళ్లు తను ఇరిగేషన్ మినిస్టర్‌గా ఉన్నా రిపేర్లు చేయించలేదు..’’
(పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు వాటర్ ఇన్‌టేక్ సోర్స్‌ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చడం అనేది ఎక్కువ లిఫ్టులు, ఎక్కువ ఖర్చు, ఎక్కువ పంపు హౌజులకు మారిపోవడం కేవలం కేసీయార్, హరీష్ రావు ధనదాహం కోసమే అనే ఆరోపణ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా చేస్తున్నది…)
ఐతే హరీష్ రావు కారణంగా కల్వకుర్తి లిఫ్ట్ కూడా మరో కాళేశ్వరం, మరో మేడిగడ్డలాగా మారిపోయిందని కవిత చేస్తున్న ప్రధాన ఆరోపణ… విచిత్రంగా దీనికి బీఆర్ఎస్ నుంచి సహజంగానే ఏ జవాబూ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీన్ని పెద్దగా తన ఆరోపణల్లోకి తీసుకురాలేదు…
పదే పదే కృష్ణా జలాల ఇష్యూ చర్చకు వచ్చినప్పుడల్లా… కేసీయార్ పాకాల- జూరాల ప్రాజెక్టు చేపడతాను అనేవాడు… జస్ట్, మాటలు… అంతేకాదు, రాయలసీమ లిఫ్టు, పోతిరెడ్డిపాడు విస్తరణల అంశం వచ్చినప్పుడు కూడా ఆలంపూర్ దగ్గర భారీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడతాను అనేవాడు… (నిన్నటి హరీష్ రావు పీపీటీలో కూడా ఈ ఆలంపూర్ రిజర్వాయర్ ప్రస్తావన ఉంది…)
నిజంగానే కృష్ణా జలాల సద్వినియోగం దిశలో మరెందుకు ఇలాంటి ప్రాజెక్టులకు పూనుకోలేదు అని ఎవరూ అడగలేదు, ఆ కారణాల జోలికీ ఎవరూ పోలేదు గానీ… మరో కీలక విషయం ఏమిటంటే..? పాలమూరు- రంగారెడ్డి డీపీఆర్‌ను కేంద్రం వాపస్ పంపించడం…
అది రేవంత్ రెడ్డి వైఫల్యం ఎలా అవుతుంది..? పనులు మొదలుపెట్టిన ఐదారేళ్లకు డీపీఆర్ అత్యంత లోపభూయిష్టంగా పంపించిందే కేసీయార్ కదా… ఎవరు బాధ్యులు అవుతారు..? పైగా హరీష్ రావు పీపీటీలో డీపీఆర్‌కు ఆమోదం పొందామని చెప్పాడు… అదెలా..?
9.5 ఏళ్లలో పలు ప్రాజెక్టులకు 11 డీపీఆర్‌లు పంపించిందని చెప్పిన హరీష్ రావు 7 ఆమోదం, ఒకటి పెండింగ్ అన్నాడు… మరి మిగతా 3 మాత్రం కాంగ్రెస్ వచ్చాక రిటర్న్ వచ్చాయన్నాడు… అంటే అంత తప్పులతడక రిపోర్టులు తను పంపించినట్టు అంగీకరిస్తున్నట్టే కదా పరోక్షంగా..! ఐనా కేసీయార్ పాత తప్పిదాల్ని కడుక్కోవడానికే కాంగ్రెస్‌కు సరిపోవడం లేదు… ఇంకేం కొత్త డీపీఆర్‌లు..? ఒక మేడిగడ్డ బరాజ్, ఒక కల్వకుర్తి పంప్ హౌజ్… ఏది చూసినా అంతే..!!
Share this Article