.
మొత్తానికి స్టార్ మా వాడు కూడా భోగి సందర్భంగా సంక్రాంతి స్పెషల్ షో వేసేశాడు… ఇది కూడా జీతెలుగు వాడి సంక్రాంతి స్పెషల్ షోలాగే… అస్సలు ఏమాత్రం పండుగ వాసనల్లేకుండా, చప్పగా… ఏవో నాలుగు యాడ్స్ స్కిట్లు కలిపి కుట్టి వదిలిన షోలాగే… (సంజనా గల్రాని బిడ్డకు భోగి పళ్లు పేరిట పూల రెక్కలు చల్లడం మినహా)… (అఫ్‌కోర్స్ అవినాష్ కటౌట్‌కు పిడకలు కొట్టడం కూడా మినహాయింపు)…
ఇదివరకు యాడ్స్ అంటే మధ్యలో స్పాన్సరర్ల సొంత వీడియోలు, అంటే వేరే క్రియేటివ్ ఏజెన్సీలు రూపొందించిన యాడ్స్ వేసేవాళ్లు… కానీ ఇప్పుడలా కాదు… అలా విడిగా యాడ్స్ వేస్తే, అవి అయిపోయేవరకు చానెల్ మార్చేస్తున్నారు కదా… అందుకని ప్రోగ్రామ్‌లోనే కలిపేస్తున్నారు తెలివిగా… ఈవెన్ సీరియళ్లలో కూడా…
Ads
స్టార్ మా సంక్రాంతి వేడుకలో… 1) ఫ్రీడం ఆయిల్, బరువు పక్కాగా ఉంటుందట… అక్కడే తూచి మరీ చేపించడం… 2) ఓక్సో లోదుస్తులు, లుంగీలు… దీనికోసం ముగ్గురితో అక్కడే ర్యాంప్ వాక్… 3) రమేష్ లుంగీలు… దీనికీ ర్యాంప్ వాక్… 4) స్వస్తిక్ కారం పొడి… దీనికీ ఓ స్కిట్జ… 5) డబుల్ హార్స్ మినపగుళ్లు… అక్కడికే వడలు తీసుకొచ్చి ఓ సంభాషణ… 6) డాజిలర్ లిప్ కలర్… దీనికి ఎనిమిది మంది లేడీలతో పెదాలకు రంగు పూయించి మరీ పోటీ…
మెయిన్ స్పాన్సర్ సైకిల్ అగర్‌బత్తీ యాడ్ స్కిట్ వేశారో లేదో చూడలేదు… కానీ 3 గంటల షోలో దాదాపు 20 నిమిషాల దాకా ఇవే… దర్శకుడు అనిల్ రావిపూడి భజన కాస్త ఎక్కువైనట్టు అనిపించింది… ప్రత్యకించి అవినాష్ ఎపిసోడ్…

ఎప్పటిలాగే బిగ్‌బాస్ టీమ్ వర్సెస్ తమ సీరియళ్ల నటీనటులతో షో నడిపించేశారు… కానీ ఆసక్తికరంగా అనిపించింది తనూజ పుట్టస్వామికి కాస్త ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, ఆమెను పైకి లేపారు.. . ఇతర కంటెస్టెంట్లు కుళ్లుకునేలా…
అక్కడికి 50 మంది ఆమె ఫ్యాన్స్‌ను రప్పించి, క్వీన్ అనే బిరుదు ఇప్పించి, నాలుగు కానుకలు ఇప్పించి హంగామా చేశారు… ఆ కాసేపు ఉంది, తరువాత వెళ్లిపోయింది ఆమె… నిజంగానే బిగ్‌బాస్ మొన్నటి సీజన్ అసలు విజేత ఆమే… కాకపోతే బిగ్‌బాస్ తిక్క లెక్కలు, బయట పడాల కల్యాణ్ సోషల్ మీడియా చాతుర్యంతో వోట్ల కారణంగా కల్యాణ్ విజేత అయ్యాడు గానీ… ఓ టెంపర్‌మెంట్‌తో చివరిదాకా పోరాడింది తనూజే…
ఆమె టీవీ సీరియళ్లతో పాపులరే గానీ బయట టీవీ ప్రోగ్రాముల్లో పెద్దగా కనిపించేది కాదు… బిగ్‌బాస్‌కు ముందు ఆహా ఓటీటీలో ఏదో కుకరీ షోలో కనిపించింది… అంతే… బిగ్‌బాస్ అయ్యాక పలు ఫ్యాన్స్ మీట్లకు వెళ్లింది… కళ్ల ముందు 25 లక్షలు కనిపిస్తున్నా, టెంప్ట్ గాకుండా బిగ్‌బాస్ ట్రోఫీ కోల్పోయినా సరే… ఆమె ప్రతి తెలుగు టీవీ ప్రేక్షకుల ఇళ్లకూ పాజిటివ్‌గా పరిచయమైంది… విశేషమే…

చివరగా... పడాల కల్యాణ్ ఏదో పాటకు డాన్స్ చేశాక, చివరలో తనూజను థాంక్స్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అన్నాడు... హౌజులోనే వాళ్ల ప్రేమాయణం కనిపించింది... బయటికి వచ్చాక కూడా రీతూ, డెమోన్ పవన్ నడుమ లవ్వు కొనసాగుతున్నట్టే ఉంది... పడాల కల్యాణ్, తనూజ కూడానా..!! ఏదో బంధం బలంగానే అల్లుకున్నట్టుంది..!!
Share this Article