.
మొన్న ఏదో నివేదిక చదివాను… మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రోెడీకరించిన వివరాలు అవి… 2019 లో థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య 146 కోట్లు కాగా, 2024కు వచ్చేసరికి అది 86 కోట్లకు పడిపోయింది… అంటే ఐదేళ్లలో థియేటర్లకు వెళ్లేవారు ఏకంగా 41 శాతం తగ్గిపోయారు…
ఎస్, ఎప్పుడూ చెప్పుకుంటున్నదే… థియేటర్లు మూతపడుతున్నయ్… థియేటర్ల దోపిడీకి భయపడి ప్రేక్షకులు ఆవైపే వెళ్లడం లేదు… ప్రత్యేకించి ఓటీటీల ప్రభావం ఇంకా ఇంకా థియేటర్లపై పడబోతోంది… కాకపోతే సినిమా స్టార్లు ఇంకా ఇంకా కొత్త థియేటర్లు కడుతున్నారు… ఇదొక పారడాక్స్…
Ads
2019లో థియేటర్ల వసూళ్లు 19,100 కోట్లు కాగా, అది 2024కు వచ్చేసరికి 18,748 కోట్లకు తగ్గింది… కానీ నిజానికి అది తగ్గుదల కాదు, దాదాపు సేమ్… మరి 41 శాతం ప్రేక్షకులు తగ్గిపోతే దాదాపు సేమ్ వసూళ్లు ఎలా..? టికెట్ రేట్ల పెంపు..! 2025 లో ఏమిటి సిట్యుయేషన్..? అదే ఓసారి చెప్పుకుందాం… ఇంకా ఘోరంగా పడిపోయాయి థియేటర్ల వసూళ్లు… ఇండస్ట్రీకి ప్రమాదఘంటికలు… (2025 లో ప్రేక్షకుల సంఖ్య ఇంకా పడిపోయింది… లెక్కలు అదే అసోసియేషన్ చెప్పాలిక…)
వందల కోట్ల సినిమా వసూళ్లు అని ప్రకటనలు చూస్తుంటాం కదా… మరి మొత్తం సినిమా పరిశ్రమ సంగతేమిటి..? సాక్‌నిల్క్ లెక్కల ప్రకారం… 2025లో సినిమాల వసూళ్లు 13,369 కోట్లు గ్రాస్… నెట్ అయితే 11,333 కోట్లు మాత్రమే… ఇందులో దాదాపు అన్ని భాషల సినిమాలు కలిపి..! గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంంజాబీ వంటివి కొన్ని కలిపితే మరో 200- 300 కోట్లు గరిష్టంగా ఉండొచ్చునేమో… అంటే 2024తో పోలిస్తే ఎంత పడిపోయిందో అర్థం చేసుకోవాల్సిందే…
Hindi : 4982.18 Cr / 235 Movies
Kannada : 454.61 Cr / 240 Movies
Malayalam : 1000.53 Cr / 191 Movies
Tamil : 1580.14 Cr / 290 Movies
Telugu : 2009.68 Cr / 283 Movies
Marathi : 80.36 Cr / 104 Movies
English : 703.04 Cr / 141 Movies
-
హిందీ సినిమా గతంతో పోలిస్తే బాగా కోలుకున్నట్టే లెక్క… కేవలం సౌత్ డబ్బింగ్ సినిమాలే ఆడుతూ, హిందీ సినిమాలు తన్నేస్తున్న నాటి రోజులతో పోలిస్తే… ఇప్పుడు దురంధర్, చావా, సయ్యారా వంటి సినిమాలు బాక్సాఫీసును కళకళలాడించాయి…
- దారుణంగా నష్టపోయింది కన్నడ సినిమా… 240 సినిమాలు తీస్తే మొత్తంగా 454 కోట్లు… అంటే సగటున రెండు కోట్లు కూడా వసూలు కాలేదు… బహుశా కాంతారా-1 వసూళ్లు తీసేస్తే ఒక్కో సినిమా సగటున కోటి రూపాయలు కూడా వసూలు చేసి ఉండదు… కన్నడంలోకి పాన్ ఇండియా పేరిట డబ్ అయిన సినిమాలు కూడా ఆడలేదు…
.
- మా పరిస్థితి బాగాలేదు మహాప్రభో అని మలయాళ నిర్మాతలు పలుసార్లు పత్రికల్లో మొరపెట్టుకున్నారు కదా… నిజానికి కాస్త బెటరే… 191 సినిమాలు తీస్తే 1000 కోట్లు వచ్చాయి… నిజానికి మలయాళ సినిమా రేంజ్ అంతే…
.
- మలయాళంతో పోలిస్తే నిజానికి తెలుగు సినిమా కూడా వీక్… 283 సినిమాలు తీస్తే 2 వేల కోట్ల వసూళ్లు… అఫ్‌కోర్స్, తమిళంకన్నా నయమే… తమిళంలో 290 సినిమాలు తీస్తే కేవలం 1500 కోట్లు వచ్చాయి… ఈ లెక్కల నుంచి థియేటర్ షేర్, టాక్సులు గట్రా తీసేస్తే… నికరంగా నిర్మాతలకు దక్కింది అంతంత మాత్రమే…
.
- కాకపోతే… ఈ వసూళ్లు ఓవర్సీస్ థియేటర్ల వసూళ్లతో కలిపి… ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌తో ఎంతోకొంత రికవరీ అవుతుంది కాబట్టి… ఇంకా నిర్మాతలు ధైర్యం కోల్పోవడం లేదు… స్థూలంగా… 2025లో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా నిరాశాపూరితంగా ఉందని సారాంశం…!!
Share this Article