Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అన్నీ మసాలాలే… కానీ కథ అనే ఉప్పు మరిచాడు రాఘవేంద్రుడు…

January 18, 2026 by M S R

.

Subramanyam Dogiparthi ……. ఈ సినిమా జనానికి నచ్చిందో లేదో నాకు తెలీదు . కానీ , నాకు మాత్రం ఒకందుకు నచ్చింది . సినిమా ఆఖర్లో విజయశాంతి , రాధ హీరో చిరంజీవి విషయంలో ఒక అండర్ స్టాండింగుకు , అడ్జస్టుమెంటుకు వచ్చామని చెవులలో ఉదేస్తారు . చిరంజీవేమో మనకు చెపుతాడు . ఎంత సామరస్యం ! ఇదే సామరస్యం అందరు సపత్నుల దగ్గర , లైట్లు పెట్రోమాక్స్ లైట్ల దగ్గర ఉంటే ఎంత బాగుండు ! సినిమాల్లో అయితే ఒకరిని చంపకుండా .

ఇంక సినిమాకొస్తే యండమూరి వీరేంద్రనాథ్ గారి ఇదే పేరుతో ఉన్న రుద్రనేత్ర నవల ఆధారంగా ఈ సినిమా రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకుంది . నేత్ర ఓ సీక్రెట్ ఏజెంట్ . కొంతమంది విదేశీ ద్రోహులతో స్వదేశీ ద్రోహులు కుమ్మక్కై దేశ వినాశనానికి కొమ్ము కాస్తున్నారని ప్రభుత్వం రుద్రనేత్ర అనే సీక్రెట్ ఏజెంటుని నియమిస్తుంది .

Ads

అతనికి తోడుగా సీక్రెట్ ఏజెంటయిన విజయశాంతిని కేటాయిస్తుంది . అప్పటికే విజయశాంతి రుద్రనేతకు ప్రేయసి . ఇద్దరూ కలిసి పరిశోధన మొదలుపెడతారు . విలన్ రావు గోపాలరావు కూతురు రాధకు లైనేసి ముగ్గులోకి దించుకొమ్మని విజయశాంతే సలహా ఇస్తుంది . Good , duty minded girl .

ముగ్గురూ కలిసి విదేశీ ఏజెంట్లను మట్టుబెట్టడంతో , చిరంజీవిని ఇద్దరు హీరోయిన్లు పంచుకుంటానికి సిధ్ధపడటంతో సినిమా శుభాంతం అవుతుంది .

పాటల్ని ఆయన తన స్టైల్లో అందంగా తీసారు . కొన్నింటిని మలేషియాలో , కొన్నింటిని ఇండియాలో . ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి వారి పాటలను బాలసుబ్రమణ్యం , చిత్ర శ్రావ్యంగా పాడారు .

జెట్ స్పీడు పిల్లరో స్టెప్స్ వేసి గిల్లరో , ఖజురహోలో కసి ప్రేమా , ఏక్ దో తీన్ సఖీ ప్రియా నిన్నే మైనే ప్యార్ కియా , అబ్బబ్బబ్బా అందం దెబ్బ ఓయబ్బా , అందమివ్వు ఆదివారము , యల్ అంటే ఓ అంటే వి అంటే ఇ అంటే లవ్వు అంటూ సాగుతాయి రాధతో , విజయశాంతితో చిరంజీవి డ్యూయెట్లు . పాటల్ని మాత్రం ముగ్గురూ తినేసారు .

సినిమాలో కావలసినంత రొమాన్స్ ఉంది . రొమాన్సుని పండిస్తానికి ముగ్గురూ కష్టపడ్డారు . విలన్లుగా రావు గోపాలరావు , హిందీ నటుడు రాజా మురాద్ , రఘువరన్లు నటించారు . సింగపూర్ నటి డయానా , సింగపూర్ బాల నటుడు మాస్టర్ టోనీ నటించారు .

ఇతర పాత్రల్లో సుత్తి వేలు , బ్రహ్మానందం , రాజా రవీంద్ర , రంగనాధ్ , మమత , సత్యనారాయణ , రాధాకుమారి , అరుణ్ కుమార్ , సూర్యకాంతం , నూతన్ ప్రసాద్ , తదితరులు నటించారు .

1989 లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందలేక పోయింది . కధనం , స్క్రీన్ ప్లే బిర్రుగా లేకపోవటం కారణం కావచ్చు . ఇంతకుముందు చూడని చిరంజీవి , రాధ , విజయశాంతి అభిమానులు ట్రై చేయవచ్చు . యూట్యూబులో ఉంది .

నేను పరిచయం చేస్తున్న 1225 వ సినిమా . #తెలుగు_సినిమాల_సింహావలోకనం #సినిమా_కబుర్లు #సినిమా_స్కూల్

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆసక్తిని రేపుతున్న ‘యుఫోరియా’… నేటి సొసైటీకి అవసరమైన సబ్జెక్టు…
  • వరి వేస్తే ఉరే అంటివి కేసీయార్..! చూడు, నేడు వరిలో కొత్త రికార్డులు..!!
  • అన్నీ మసాలాలే… కానీ కథ అనే ఉప్పు మరిచాడు రాఘవేంద్రుడు…
  • PhotonSync… మన డిజిటల్ సైంటిస్టుల ‘సూపర్ షీల్డ్’ ఆవిష్కరణ…
  • ‘కాశ్మీర్ ప్రిన్సెస్’… ఆకాశంలో మృత్యువు… ఫస్ట్ ఇండియన్ జేమ్స్ బాండ్…
  • ఓహ్…! ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టు వెనుక అసలు కథ, కుట్రలు ఇవా..?!
  • ఎంజీఆర్..! ఇప్పటికీ ఆ పేరును ఎందుకు స్మరించుకోవాలంటే..!!
  • అన్ని న్యూస్ వీడియోల్లో ఆ మిస్సింగ్ కుర్రాడి జాడ వెతకడం ఎలా..?
  • సినిమా ఇండస్ట్రీకి ప్రమాద ఘంటికలు… బాగా పడిపోయిన వసూళ్లు…
  • అరుణారుణ జ్ఞాపకం హరితీకరణ..! ఆ స్థూపం ఆకుపచ్చబడింది..!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions