.
ఇండియా ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌కు ఓ కానుక ఇచ్చాడు ప్రేమగా… మర్యాదగా… గౌరవంగా… స్నేహపూర్వకంగా…! కానీ ఆ దేశపు విదేశాంగ శాఖ దాన్ని పారవేసింది..!!
నమ్మడం లేదా..? ఒక దేశ ముఖ్యనేత మరో దేశపు ముఖ్యనేతకు ఇచ్చిన కానుకను ఆ దేశం మర్యాద విడిచి, పారవేసి, మన కానుకను- మనం ఇచ్చిన గౌరవాన్ని, రెండు దేశాల నడుమ సంబంధాల్ని అవమానిస్తుందాా..?
Ads
ఇదే కదా మీ సందేహం… ఓసారి ఈనాడు రాసిన ఓ వార్త చూద్దాం…

ఈ వార్త ఏమిటయ్యా అంటే… 2024 సంవత్సరానికి సంబంధించి ఏయే దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ఇతర ముఖ్య నేతలు అమెరికా అతిథులకు ఏమేం ఇచ్చారో అమెరికా విదేశాంగ శాఖ ఓ రిపోర్ట్ విడుదల చేసింది… మనకు ఉన్నట్టుగానే ‘వచ్చిన కానుకలను’ ఏం చేయాలో అమెరికాకూ ఓ పాలసీ ఉంటుంది…
-
నిబంధనలు…: అమెరికా ప్రభుత్వ అధికారులు అందుకునే బహుమతులు ఒక నిర్ణీత విలువ (సుమారు $480) కంటే ఎక్కువ ఉంటే, వాటిని ప్రభుత్వ ఖజానాకు, (NARA) ఆర్కైవ్స్‌కు… లేదా మ్యూజియాలకు అప్పగించాలి…
-
తినుబండారాల పరిస్థితి…: తినే వస్తువులు లేదా పాడైపోయే వస్తువులు (Perishable items) అయితే వాటిని భద్రపరచడం కష్టం… కాబట్టి, వాటిని తనిఖీ చేసిన తర్వాత, నిబంధనలకు లోబడి అధికారులు ఉపయోగించేందుకు (Consumed) అనుమతిస్తారు…
2024 లో తమకు ఇండియా నుంచి అందిన కానుకల వివరాలు ఇవీ…
-
జో బైడెన్‌కు ‘సిల్వర్ ట్రైన్ సెట్’…: ప్రధాని మోదీ అప్పటి అధ్యక్షుడు జో బైడెన్‌కు 7,750 డాలర్ల (సుమారు ₹6.5 లక్షలు) విలువైన వెండితో చేసిన రైలు సెట్‌ను (Sterling Silver Train Set) బహూకరించారు…. ఇది మహారాష్ట్రకు చెందిన కళాకారుల నైపుణ్యానికి ప్రతీక… బైడెన్‌కు రైళ్లంటే ఇష్టం కాబట్టి ఆ సెట్ ఇచ్చారు…
-
జిల్ బైడెన్‌కు ‘పాష్మినా షాల్’: అమెరికా మాజీ ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు సుమారు 2,969 డాలర్ల (₹2.4 లక్షలకు పైగా) విలువైన కశ్మీరీ పాష్మినా షాల్‌ను అందించారు…
-
కమలా హారిస్‌కు ‘రాస్ లీలా సిల్వర్ బాక్స్’…: మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు 1,330 డాలర్ల విలువైన ‘శ్రీకృష్ణ రాస్ లీలా’ వెండి పెట్టెను మోదీ కానుకగా ఇచ్చారు…
-
డగ్లస్ ఎమ్‌హాఫ్‌కు ‘కఫ్ లింక్స్’…: కమలా హారిస్ భర్త డగ్లస్ ఎమ్‌హాఫ్‌కు సుమారు 585 డాలర్ల విలువైన వెండి కఫ్ లింక్స్‌ను అందించారు…
ఇతర నేతలు ఇచ్చిన కానుకలు….
-
అజిత్ దోవల్ నుంచి జేక్ సల్లివాన్‌కు…: భారత జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్, తన అమెరికా కౌంటర్‌పార్ట్ జేక్ సల్లివాన్‌కు 599 డాలర్ల విలువైన కశ్మీరీ పాష్మినా స్కార్ఫ్‌ను గిఫ్ట్‌గా ఇచ్చాడు…
-
రాజ్‌నాథ్ సింగ్ నుంచి లాయిడ్ ఆస్టిన్‌కు…: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్‌కు 3,700 డాలర్ల విలువైన నటరాజ కాంస్య విగ్రహాన్ని బహూకరించాడు… ఇవీ ముఖ్యమైనవి…
జో బైడెన్‌కు మరో సందర్భంలో మోడీ 2023 సెప్టెంబర్ 10న అధ్యక్షుడు జో బైడెన్‌కు ఒక చెక్క పెట్టె (Wood Chest), స్కార్ఫ్, జార్‌లో కుంకుమ పువ్వు (Saffron with Jar), టీ పొడి ఉన్న బాక్స్ బహూకరించాడు… వీటి మొత్తం విలువ 562 డాలర్లుగా లెక్కించారు… ఇక్కడ డాలర్లలో దాని విలువ లెక్కించకూడదు…
కానీ..? చెక్క పెట్టె, స్కార్ఫ్, మరియు జార్‌లను ‘నేషనల్ ఆర్కైవ్స్’ (NARA) కు పంపారు… అయితే, కుంకుమపువ్వు, టీ పొడి వంటి తినే వస్తువులను (Perishable items) అమెరికా సీక్రెట్ సర్వీస్ నిబంధనల ప్రకారం ‘డిస్పోజ్’ (Disposed of) చేసినట్లు స్పష్టంగా ఈ రిపోర్టులో పేర్కొన్నారు…
-
ఎందుకు అలా చేస్తారు?…: అమెరికా భద్రతా నిబంధనల ప్రకారం, విదేశీ ప్రతినిధుల నుండి వచ్చే ఆహార పదార్థాలు లేదా పానీయాల వల్ల అధ్యక్షుడి కుటుంబానికి ఎటువంటి ముప్పు ఉండకూడదని, వాటిని వాడకుండా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ల పర్యవేక్షణలో డిస్పోజ్ చేస్తారు… ప్రమాదకరం కాకపోతే ఎవరైనా అధికారులు వాడటమో చేస్తారు…
ఎన్డీటీవీ, ఇతర అంతర్జాతీయ మీడియా సంస్థలు “Disposed of pursuant to United States Secret Service policies” అనే పదబంధాన్ని వాడాయి… దీని అసలు అర్థం (Diplomatic Terminology- నాట్ డిక్షనరీ అర్థాలు) లో ఏమిటంటే…
-
Disposed of…: అంటే ఆ వస్తువులను తొలగించడం లేదా నిర్వీర్యం చేయడం అని అర్థం… ఇది కేవలం ‘చెత్తలో పారేయడం’ మాత్రమే కాదు… ఒక వస్తువును భద్రతా కారణాల దృష్ట్యా వాడుకలో లేకుండా చేయడం…
-
Pursuant to…: అంటే “నిబంధనల ప్రకారం” లేదా “అనుగుణంగా” అని అర్థం….
కానీ ఈనాడు ఏం రాసింది..? పారవేశారు అని రాసింది… డిస్పోజ్డ్ ఆఫ్ అంటే పారేయడం అనేదే అసలు అర్థం కాదు… నిజానికి ఈనాడు ఇంగ్లిషు నుంచి అనేకానేక పదాలకు క్షుద్ర అనువాదాలు చేస్తుందనేది కరెక్టే గానీ…. నేషనల్, ఇంటర్నేషనల్ ఇంగ్లిషు కాపీలను సరిగ్గా అర్థం చెడకుండా అనువదిస్తుంది చాలాసార్లు…
ఈ విషయంలో స్ట్రిక్టుగా ఉంటుంది కూడా… కానీ ఈనాడులో కూడా ప్రమాణాల పతనం కనిపిస్తోంది కాబట్టి ఈ తప్పులు… అఫ్‌కోర్స్, ఇతర మెయిన్ స్ట్రీమ్ తెలుగు మీడియాకన్నా ఈనాడు ఈరోజుకూ చాలా చాలా బెటర్… అందుకే పారవేశారు అనే పదం వాడటం ఆశ్చర్యాన్ని కలిగించింది…!!
Share this Article