ఇంట్రస్టింగు కేసు… కానీ టైమింగే సందేహాస్పదం… కేసు ఏమిటంటే..? హైకోర్టులో ఓ పిల్ దాఖలైంది… గ్రేటర్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో పనిచేసే ఎక్స్ అఫిషియో వోట్లు మొత్తంగా ప్రజాస్వామిక స్పూర్తిని దెబ్బతీస్తున్నాయనేది ఆ పిల్ సారాంశం… దీనిపై చర్చ ఉంది… ప్రజలు ఎన్నుకునేది 150 మందిని… కానీ ఈ ప్రత్యక్ష ఎన్నికతో ఏమాత్రం సంబంధం లేని 55 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు… అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు మొత్తంగా జనం తీర్పును బదాబదలు చేసే అవకాశం సమర్థనీయమా అనేది ప్రశ్న… అదే ఈ కేసు…
అసలు అంతమందికి వోటు హక్కు కల్పించడం సమంజసమేనా అనేది పిల్ ప్రశ్న… బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ ఈ పిల్‌ను దాఖలు చేశాడు… ఒక్క జీహెచ్ఎంసీలో మాత్రమే ఇంత భారీ సంఖ్యలో చట్టసభ సభ్యులు వోటు వేసే అవకాశం ఉందనీ, దీనికి అనుమతినిచ్చే జీహెచ్ఎంసీ యాక్ట్ 1955లోని సెక్షన్ 90(1) చట్ట వ్యతిరేకమనీ, దాన్ని కొట్టేయాలనీ కోరాడు… సహజంగానే పిటిషన్లో చీఫ్ సెక్రటరీ, మున్సిపల్, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శులు, స్టేట్ ఎలక్షన్ కమిషన్, జీహెచ్ఎంసీ కమిషనర్‌ను ప్రతివాదులుగా పేర్కొన్నాడు…
Ads
నిజానికి తమకు అనువుగా అధికారంలో ఉన్న పార్టీ ఎప్పటికప్పుడు రూల్స్ మార్చేస్తూ చట్టాన్ని సవరించుకోవడానికి చాన్స్ ఉంది… ఇదేమీ దొడ్డిదారిలో జరగదు… చట్టప్రకారమే… కానీ స్పిరిట్ లోపిస్తుంది… అంతే తేడా… రాష్ట్ర ప్రభుత్వం చట్టప్రకారమే సవరణల్ని చేస్తే దాన్ని హైకోర్టు తప్పు అని చెప్పగలదా..? లేక ప్రజాస్వామిక పోటీ, ప్రజాతీర్పు అనే మౌలిక ఉద్దేశాలకే విఘాతంగా ఉందని చెబుతుందా..? అందుకే కేసు ఇంట్రస్టింగు…
అయితే సరిగ్గా పోలింగ్ ఫలితాలు రావడానికి రెండుమూడు రోజుల ముందే పిల్ దాఖలు కావడం గమనార్హం… కనీసం ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సందర్భంలో పిల్ పడినా ఓ అర్థముండేది… సరిగ్గా నెక్ ఆఫ్ ది మూమెంట్లోనే కేసు పడటంతో హైకోర్టు దాన్ని ఎలా స్వీకరిస్తుందో చూడాలి… అయితే మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు ఇంకా టైముంది కాబట్టి ఈ పిల్‌ను ఆఖరిక్షణం హడావుడి పిటిషన్ అని కూడా అనలేమేమో…
మొన్నామధ్య బీసీల జనాభా, రిజర్వేషన్ల తీరుపై కాంగ్రెస్ హైకోర్టును ఆశ్రయిస్తే కోర్టు విచారణకు సుముఖంగా స్పందించలేదు… అందుకని ఈ పిల్ కూడా ఏమవుతుందో చూడాలి… అయితే పిల్లో పేర్కొన్న అంశాలు మాత్రం చర్చ జరగాల్సినవే… ప్రజల తీర్పును కూడా అటూఇటూ ప్రభావితం చేయగల ఎక్స్ అఫిషియో సమర్థనీయమా..? కాదా..? సమర్థనీయమే అయితే ఇక ప్రజాతీర్పుకు అర్థమేముంది… ఇదే అసలు ప్రశ్న…!
Share this Article