మొన్న మనం ఒక సుదీర్ఘమైన కథ చదువుకున్నాం… తృణమూల్ ఎంపీ నుస్రత్ జహాన్ పెళ్లి యవ్వారం… ఓ ధనిక వ్యాపారి నిఖిల్ జైన్‌ను పెళ్లి చేసుకుంది… ఏడాదిలో గొడవలు… దూరంగా ఉంటున్నారు… ఆయన గారు విడాకులకు అప్లయ్ చేస్తే, అసలు మాది పెళ్లే కాదుఫో అనేసింది… టర్కీలో పెళ్లి జరిగింది, అక్కడి చట్టాల ప్రకారం మా పెళ్లికి గుర్తింపు లేదు, ఇండియాలో పెళ్లిని రిజిష్టర్ చేసుకోలేదు కాబట్టి ఆ పెళ్లే జరగనట్టు లెక్క… జరగని పెళ్లికి విడాకులేంటి అంటోంది… అసలు కథేమిటీ అంటే… తను యష్దాస్గుప్తా అనబడే ఓ బీజేపీ నాయకుడు కమ్ యాక్టర్‌తో తిరుగుతోంది… ఇదంతా మళ్లీ ఎందుకు చెప్పుకోవాలి మనం అంటారా..? విలువైన ప్రశ్నే… ఈమె చరిత్ర ఏదో సెర్చుతుంటే అమ్మగారి కథలు, లీలలు… ఈమె గారి యవ్వారాలకు మమతా బెనర్జీ మద్దతు… మధ్యలో ఓ ఉక్కుపిండంలాంటి లేడీ ఐపీఎస్… ఓ నేరగాథ… ఓ క్రూరమైన గ్యాంగ్ రేప్ కేసు గట్రా చాలా విస్మయకరాంశాలు తెలియవచ్చాయి… ఓహో, అమ్మగారికి ఈ వికృతకోణం కూడా ఉందా అనిపించింది…
మొన్న ఈమె గారి పెళ్లి వివాదం కథ తెలియనివాళ్లు… ఇదుగో ఈ లింక్ ఓసారి చదవండి… లేదంటే ఈ తాజా కథలోకి వెళ్లిపొండి…
Ads
ఒక ప్రణయం, ఒక పరిణయం, ఒక గర్భం… పెళ్లిపై అనేకానేక చిక్కు ప్రశ్నలు…
అది 2012… కలకత్తాలోని పార్క్ స్ట్రీట్… ఓ రాత్రి… సుజెతె జోర్డాన్ అనబడే ఓ ఆంగ్లో ఇండియన్ మహిళ… ఇద్దరు పిల్లల తల్లి… 37 ఏళ్లు… లిఫ్ట్ ఇస్తామని చెప్పి అయిదుగురు వెహికిల్‌లో ఎక్కించుకుని, బెదిరించి, రేప్ చేసి, కదులుతున్న ఆ వాహనం నుంచే ఆమెను బయటికి నెట్టేసి వెళ్లిపోయారు… గ్యాంగ్ రేప్… కాస్త ఆలస్యంగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది… మీడియాకు కూడా తన ఐడెంటిటీని బయటపెట్టింది… పత్రికల్లో, టీవీల్లో వార్తలు… ప్రభుత్వం మీద విమర్శలు… కానీ మమత బెనర్జీ ఎలా స్పందించిందో తెలుసా..? ‘‘కల్పిత కథ’’ అని కొట్టిపారేసింది… రాజధానిలో ఓ వితంతు మహిళ మీద గ్యాంగ్ రేప్ జరిగితే మహిళా ముఖ్యమంత్రి స్పందన అది… సరే, ఆమె మెంటాలిటీ తెలిసిందే కదా… ఇక్కడ ఓ విశేషం…
ఈమె పేరు దమయంతీ సేన్… టఫ్ ఐపీఎస్ ఆఫీసర్… కలకత్తాలోనే వర్క్… ముఖ్యమంత్రికి ఇష్టం లేదని తెలిసినా… సీనియర్ ఆఫీసర్లు వద్దని వారించినా వినలేదు… కేసును తవ్వింది, ఆ రేపిస్టులు అయిదుగురు ఎవరో గుర్తించింది… పక్కాగా కేసు బిల్డప్ చేసి, వాళ్లలో ముగ్గురిని అరెస్టు చేసి, కోర్టుకు ఎక్కించింది… హేట్సాఫ్ మేడం… సివిల్ సర్వీస్ అధికారుల మీద ఇంకా కాస్త నమ్మకం మిగిలి ఉన్నదీ అంటే ఇలాంటి వాళ్లవల్లే…! మమతకు ఇదంతా సహజంగానే కోపం తెప్పించింది… ఈ దమయంతిని వెంటనే లూప్లైన్లో పడేసింది… ఏదో పోలీస్ ట్రైనింగ్ సంస్థకు తరిమేసింది… దమయంతి కూడా ‘శిక్ష’ ఊహిస్తున్నదే కాబట్టి సైలెంటుగా తనలోతనే నవ్వుకుంటూ అక్కడికి వెళ్లిపోయింది… సీన్ కట్ చేస్తే… అయిదుగురిలో ముగ్గురు దొరికారు… మరో ఇద్దరు పరారీ… ఒకడు కాదర్ ఖాన్, మరొకడు మొహమ్మద్ ఆలీ…
ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథనంలో ఓ పాత్రధారి కాదర్ ఖాన్… ఎందుకంటే..? ఈ రేప్ సంఘటనకు ముందే సదరు ఖాన్ ఈ నుస్రత్ జహాన్ ప్రేమికులు… ఈ కాదర్ దుబయ్ వెళ్లిండని కొందరు, కలకత్తాలోనే అజ్ఞాతంలో ఉన్నాడని కొందరు చెప్పుకోసాగారు… ఈలోపు… అంటే 2015లో సదరు రేప్ బాధితురాలు మెనింజైటిస్‌తో మరణించింది… చాలాకాలం మహిళ హక్కులు, ప్రత్యేకించి రేప్ బాధితులు, గృహహింస బాధితుల యాక్టవిస్టుగా పనిచేసేది… కలకత్తా పోలీసులు కూడా ఈ కేసును పూర్తిగా వదిలేయలేదు… రకరకాల సోర్సులను అలర్ట్ చేస్తూనే ఉన్నారు… 2016లో కాదర్, ఆలీ ఆచూకీ సమాచారం దొరికింది… ఘజియాబాద్ సమీపంలో దాడి చేసి పట్టుకున్నారు… ప్రశ్నిస్తే నుస్రత్ ముంబైలోని హోటళ్లలో వేర్వేరు పేర్లతో రూమ్స్ బుక్ చేసేదనీ, వీళ్లు అక్కడ తలదాచుకునేవాళ్లనీ తేలింది… ఈమె మీద కేసు పెట్టాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చినా సరే… అది జరగలేదు… కారణాలూ అందరికీ తెలిసినవే కదా…!! నుస్రత్ జహాన్‌కు ఇదంతా మరోకోణం…!!!
Share this Article