Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

‘యాంటీ హిందూ’ లెన్స్‌కార్ట్‌… స్టాక్‌మార్కెట్ బాగానే శిక్షిస్తోంది…

April 22, 2026 by M S R

.

సీనియర్ జర్నలిస్టు బుద్దా మురళి పోస్ట్ ఓసారి చదవండి… ‘‘ చూడప్పా సిద్దప్పా, కాలం మారింది …  ఒకప్పుడు వామపక్ష మేధావుల భావజాలానికి మాత్రమే మీడియాలో చోటు ఉండేది … వాళ్ళ బుర్రతోనే లోకం ఆలోచించాల్సి వచ్చేది …. మేక – అమాయక బ్రాహ్మణుడు కథ తెలుసు కదా ? అలా నలుగురు ఏది అంటే అదే అనుకోక తప్పని పరిస్థితి … మనకు నచ్చినా నచ్చకపోయినా నలుగురు వెళ్లే దారిలో వెళ్లక తప్పని పరిస్థితి …

కాలం మారింది … అన్ని మతాలకు , కులాలకు , అన్ని పార్టీలకు మీడియా ఉన్న రోజులు ఇవి . గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒక్కటే అని సామెత చెప్పినట్టుగా…  మీడియా గుడ్డి కన్ను మూసినా తెరిచినా ఒకటే అని తెలిపే సామాజిక మాధ్యమాలు వచ్చాయి . ఇప్పుడు ప్రతి మనిషి మీడియానే …

Ads

ఎర్రన్నల కాలం నాటి ఆలోచనలతో ఇప్పుడు కళ్లద్దాలు అమ్ముతాం అంటే నడిచే రోజులు కావు . లాస్ లో ఉన్న లెన్స్ కార్ట్ షేర్ ప్రస్తుత రేటే నాకు ఆశ్చర్యం … ఇంకా పడి పోతుంది … అసలే లాస్ లో ఉండి … ఇలాంటి వేషాలు వేస్తే రోజు రోజుకు కిందికి జారుతుంది … ఇంకాస్త వివరాల్లోకి వెళ్దాం…




లెన్స్‌కార్ట్‌కు డబుల్ షాక్: ‘బిందీ’ వివాదం సెగ.. మార్కెట్ విలువలో ₹4,500 కోట్ల కోత!

 ప్రముఖ ఐవేర్ దిగ్గజం లెన్స్‌కార్ట్ (Lenskart) ప్రస్తుతం తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యి, విజయవంతంగా దూసుకుపోతున్న ఈ సంస్థకు, తాజాగా రేగిన ‘బిందీ-తిలక్’ వివాదం పెద్ద తలనొప్పిగా మారింది. ఈ వివాదం ప్రభావం సంస్థ మార్కెట్ విలువపై స్పష్టంగా కనిపిస్తోంది.

1. ₹4,500 కోట్ల మార్కెట్ విలువ ఆవిరి … ఉద్యోగులు బిందీ, తిలకం ధరించకూడదంటూ పాత ట్రైనింగ్ డాక్యుమెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది.

  • షేర్ ధర పతనం…: గత ట్రేడింగ్ సెషన్లలో సంస్థ షేర్ ధర సుమారు 5% మేర పడిపోయింది. ఫలితంగా కంపెనీ మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి దాదాపు ₹4,500 కోట్లు తుడిచిపెట్టుకుపోయాయి…

  • ఓపెనింగ్ & క్లోజిం…గ్: ₹530 వద్ద ప్రారంభమైన షేర్, రోజు ముగిసే సమయానికి ₹508.70 కి చేరుకోవడం గమనార్హం…

2. ₹2,700 కోట్ల నిధుల సమీకరణ & ప్రస్తుత స్థితి … లెన్స్‌కార్ట్ గతంలోనే తన ఐపీఓ, తదుపరి నిధుల సమీకరణ రౌండ్ల ద్వారా సుమారు ₹2,700 కోట్లు (సుమారు $325 మిలియన్లు) సేకరించింది….

  • ఈ నిధులను సంస్థ తన అంతర్జాతీయ విస్తరణకు, గ్లోబల్ సప్లై చైన్ బలోపేతం చేయడానికి కేటాయించింది….

  • అయితే, ఇప్పుడు మార్కెట్లో కంపెనీ విలువ పడిపోవడం వల్ల, ఆ నిధుల వినియోగం, భవిష్యత్తు లాభదాయకతపై విశ్లేషకులు దృష్టి సారించారు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినడం వల్ల సేల్స్‌పై ప్రభావం పడితే, అది కంపెనీ ఆర్థిక మూలాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అంతేకాదు, ఈ హిందూ వ్యతిరేక ధోరణి ముందుగానే వెలుగులోకి వచ్చినట్టయితే ఐపీఓ ఘోరంగా ఫెయిలయి ఉండేది…

3. పీయూష్ బన్సల్ డ్యామేజ్ కంట్రోల్… పరిస్థితి తీవ్రతను గమనించిన వ్యవస్థాపకుడు పీయూష్ బన్సల్ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు… (నిజానికి ఈ ఓనరే అసలు సమస్య… ఈ కథనం చదవండి)…

  • పాలసీ మార్పు: వైరల్ అవుతున్నది పాత గైడ్‌లైన్ అని కొట్టిపారేస్తూ, ఇప్పుడు అన్ని రకాల సాంస్కృతిక చిహ్నాలకు (బిందీ, తిలకం, కలవా మొదలైనవి) అనుమతినిస్తూ కొత్త రూల్స్ అమలులోకి తెచ్చాడు…

  • క్షమాపణ…: భారతీయ విలువలకు తాము వ్యతిరేకం కాదని, పొరపాటును సరిదిద్దుకుంటామని ప్రకటించాడు…

యాంటీ హిందూ ధోరణితో వెళ్లే కార్పొరేట్ కంపెనీలకు షాకులు తగులుతూనే ఉన్నాయి… తాజా ఉదాహరణ ఈ లెన్స్‌కార్ట్… ఎంతసేపూ ‘యాంటీ హిందూ’ కళ్లద్దాలతో ప్రపంచాన్ని చూస్తే, ఇదుగో ఇదే జరిగేది…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మహా సంక్లిష్టుడు – ఈ కోటికోట్ల కుబేరుడు విలాసాల్లోనూ స్పేస్‌ఎక్స్ రేంజ్
  • ధర్మస్థల కుట్రలో ప్రకాష్‌రాజ్ – తనే బయటపడిపోయాడు!
  • The Duet of Silence – ఓ నిశ్శబ్ద యుగళగీతం ‘కూలిపోయింది’
  • ఇద్దరు సన్నకారు దళిత రైతులు… మోస్ట్ పాపులర్ సన్నాల్ని డెవలప్ చేశారు…
  • సన్నబియ్యం..! బీఆర్ఎస్ గాయిగత్తరకు బుర్ర లేదు- అర్థం లేదు…
  • Smriti Mandhana … ఎందుకు ఈమె అంత స్పెషల్?
  • ఓహ్, అది మీ కారా? ఎక్కడో కనిపిస్తే బాగుందని మనోళ్లే తెచ్చేశారు!
  • శ్రీదేవికి దీటుగా వెండితెర ఏలాల్సిన నటి… కానీ ఏం లాభం..?
  • దురంధర్ – వెలుతురు, నీడలు కూడా ప్రధాన పాత్రధారులు
  • అసలే అడ్డదిడ్డం కథ- అమితాబ్‌కు ఎందుకు నచ్చిందో మరి…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions