.
తాజాగా ది ప్యారడైజ్ అని నాని నటించిన ఒక సినిమా టీజర్ విడుదలైంది… అంతకుముందు ట్రెయిలర్లు కూడా చూసినట్టు గుర్తు… నాని మీద, ఈ సినిమా నిర్మాత- దర్శకుల మీద కేజీఎఫ్ బాపతు ప్రభావం బాగా ఉన్నట్టుంది… చాలాచోట్ల కేజీఎఫ్ బాపతు సీన్లే కనిపిస్తున్నాయి…
అన్నింటికన్నా పెద్ద లోపం… నాని అరుపులు… అనిరుధ్ బీజీఎం మోతలో అసలు నాని ఏం అరుస్తున్నాడో కూడా వినిపించడం లేదు… తన టోన్ కూడా సెట్ కాలేదు… తెలంగాణ యాక్సెంట్‌గా అర్థమవుతోంది గానీ ఆ డైలాగ్స్ స్పష్టంగా వినిపించకపోవడం ఒక లోపం… అసలు టీజర్ చెప్పాల్సిందే ఈ కథ ఏమిటని కదా… అదే అర్థం కాకపోతే ఎలా..?
మొత్తం రా అండ్ రస్టిక్ లుక్స్, జడలతో నాని భిన్నమైన గెటప్… అసలు సినిమా ట్యాగ్ లైనే అది కదా… జడల్, జమానా, షురూ… మొత్తం నెత్తుటి వాసనే… బీభత్సంగా పొడవడాలు, నరకడాలు, కొట్టుకోవడం… ఎంత బీభత్సమైన వయొలెన్స్ చూపిస్తే అంత ఊరమాస్ అనే ఓ భ్రాంతి టాలీవుడ్ దర్శకులను ఆవరిస్తున్నట్టుంది…
Ads

ఎక్కడో చదివినట్టు గుర్తు… 1980ల నాటి సికింద్రాబాద్ స్లమ్స్ నేపథ్యంలో, అణచివేతకు వ్యతిరేకంగా జరిగే తిరుగుబాటును దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన మార్క్ ‘రా అండ్ రస్టిక్’ స్టైల్‌లో చూపించాడని… కానీ మోహన్‌బాబు డైలాగులు గట్రా మళ్లీ ఏదో రాయలసీమ బాపతు కథలా అనిపించేలా ఉంది…
టీజర్ చివర్లో వచ్చే ఒక మాస్ యాక్షన్ సీన్, “దిష్టంతా పోవాలే” అంటూ సాగే రక్తపాతం మరీ డిస్టర్బ్ చేసేలా ఉంది… జార్జిరెడ్డి తరహాలో బ్లేడ్లను పట్టుకుని, ఒళ్లంతా రక్తంతో ఏదేదో చెబుతున్నాడు నాని… కింద కొందరి శవాల గుట్ట… హేమిటో… నెత్తురు ప్రేక్షకుడిని థియేటర్‌కు రప్పిస్తుందా..? చూడాలి…
కష్టమ్మీద విని అర్థం చేసుకున్న కొన్ని డైలాగ్స్ మాత్రం బాగున్నట్టు అనిపిస్తున్నాయి… “ఇక నుంచి ఈ జాగా మనది, ఈ దేశం ఎవరిది?” అంటూ నాని జనం ముందు గట్టిగా అరుస్తూ ప్రశ్నించే సీన్ బాగానే ఉంది… అంతకుముందు ట్రెయిలర్‌లో చూసినట్టు గుర్తు, కొన్ని డైలాగ్స్… మన జాతి మర్లబడాలె… చీ అని చీదరించుకున్న నలుపు రంగే మన జెండా… ఇవి బాగున్నాయి, మిగతావి కూడా వినిపిస్తే బాగుండేది, అనిరుధ్ మింగేశాడు…
మోహన్ బాబు విలన్ పాత్రలో “మేరే ప్యారే పారడైజ్ వాసియో…” అంటూ బేస్ వాయిస్‌తో ఎంట్రీ ఇవ్వడంతోపాటు…ఒక ఆడదాని ఏడుపు రామాయణం, ఒక ఆడదాని నవ్వు భారతం, ప్రతి కుక్క సింహంలా గర్జించాలనే అనుకుంటుంది వంటి డైలాగులను తనదైన స్టయిల్‌లో పండించినట్టే కనిపిస్తోంది…
ఊరమాస్ అనిపించాలంటే… అలా పొడవాటి జడలు (Braided Hair), గడ్డంతో మునుపెన్నడూ చూడని అత్యంత రగ్గడ్, భీకరమైన అవతారంలో… అత్యంత హింసాత్మకంగా కనిపించాలా నానీ…? (ఇది నిన్నటి టీజర్ చూసి రాస్తున్నది కాదు, గతంలో కూడా విడుదలైన ఈ పాన్ ఇండియా సినిమా పరిచయ వీడియోలు (గ్లింప్స్, ట్రెయిలర్) కూడా చూసిన ఓ గగుర్పాటుతో రాస్తున్నది…) ఇది గ్లింప్స్ లింక్…
.
గత ఏడాది జూలైలో ‘ముచ్చట’ రాసిన కథనం లింక్ ఇది… ఓసారి చదవండి…
Share this Article