.
నిన్న చెప్పుకున్నాం కదా… బొద్దింకల ఉద్యమాల అసలు కథ వేరని… అదే తేటతెల్లమైపోతోంది… చాలామంది నమ్మరు… నమ్మడానికి ఇష్టపడరు… కానీ జరుగుతున్నది ఓ కుట్ర… వివాదాస్పద సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చాలా స్పష్టంగా చెప్పేశాడు… ‘అవును, రెజీమ్ మార్పు కోసమే ఇదంతా’… అంటే ప్రభుత్వాన్ని కూలదోయడమే…
ముసుగులు తొలగిపోతున్నాయి… ఓసారి గుర్తుతెచ్చుకొండి… పౌరసత్వ సవరణ చట్టం మీద జరిగిన ఆందోళనలు… దాంతో దేశంలో ఎవరికీ ఏ నష్టమూ లేదు… మతహింసకు గురై మన దేశం వైపు చూసే నిస్సహాయులను అక్కున చేర్చుకునే చట్టం… దాన్ని ఎన్ఆర్సీకి ముడిపెట్టి గాయిగత్తర చేశారు…
Ads
వ్యవసాయ చట్టాలు… నిజానికి దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో ఏ రైతూ వ్యతిరేకించలేదు… కేవలం పంజాబ్… అదీ పర్టిక్యులర్గా ఆప్, ఖలిస్థానీ శక్తులు దాన్ని రచ్చ చేసి, ఢిల్లీని అల్లకల్లోలం చేశాయి… ఢిల్లీలో ఎవడో ఓ వత్తి అంటిస్తాడు… విచ్ఛిన్నకర శక్తులు అందుకుంటాయి…
ఇప్పుడు విషాదం ఏమిటంటే..? సోకాల్డ్ బొద్దింకలకు విపక్షాలు జతకూడటం… ఒకసారి బంగ్లాదేశ్, శ్రీలంక పరిణామాలు ఉత్పన్నమైతే వాళ్ల పునాదులు కూడా కూలిపోతాయనే సోయి లేకపోవడం… ఇన్నేళ్లుగా వాళ్లు నిర్మించుకున్న పార్టీ వ్యవస్థల్ని వాళ్లే కూలదోసుకోవడం… దేశ ప్రజాస్వామిక వ్యవస్థతోపాటు ఇన్నేళ్ల దేశ పురోగతి కాస్తా ఛిన్నాభిన్నం అవుతుందనే కామన్ సెన్స్ లేకపోవడం…

కటువుగా ఉన్నా సరే, ఇదే నిజం… అసలు ధృవ్ రాఠీ ఎవడు..? ఏకంగా భారత ప్రభుత్వంపై సాయుధ పోరాటం చేయాలని భారత సైన్యానికి, పోలీసులకు పిలుపునిస్తున్నాడు… వాడికీ మద్దతు లభిస్తోంది ఈ దేశంలో… ఎవడుపడితే వాడు, ఎక్కడో బతికేవాడు కూడా ఈ దేశంలో ఏదైనా మాట్లాడతాడు, పిలుపులిస్తాడు…
అసలు సమస్య మీడియాతో… ఈ బాపతు ఆందోళనలకు బహుళ ప్రాచుర్యం కల్పించడం…అఫ్కోర్స్, నీట్, వోట్, జ్ఞానేష్, ధర్మేంద్ర ప్రధాన్ ఎట్సెట్రా జస్ట్ సాకులు… అసలు లక్ష్యం ప్రభుత్వాన్ని కూలదోయడమే… దేశంలో అరాచకాన్ని క్రియేట్ చేయడం… నేహా బోరా అనే విచ్ఛిన్నకారిణి కూడా చాలా స్పష్టంగానే చెబుతోంది… ‘అవును, బంగ్లాదేశ్లోలాగే ఇక్కడా మార్చేస్తాం’…
చివరకు రాహుల్ గాంధీ అండ్ కో ఏకంగా సుప్రీంకోర్టు దగ్గర అలజడి క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు… బొద్దింకల్ని చూసి దుందుడుకు, అరాచక వైఖరుల్ని అలవర్చుకుంటే కాంగ్రెస్కు అంతకుమించి హరాకిరీ మరొకటి ఉండదు… లెఫ్ట్ గురించి మరిచిపొండి, అవి కాలగతిలో కలిసిపోతున్న పార్టీలు… కానీ కాంగ్రెస్కు ఏమైంది..?
పార్టీ ఎత్తుగడల్లో ఓ విజ్ఞత, ఓ వివేచన లోపిస్తోంది… యూపీ ఎన్నికలు సమీపించేకొద్దీ ఇంకా చాలా కుట్రలు యాక్టివేట్ అవుతాయి… దేశమంతా అల్లర్లు సృష్టించే ఎత్తుగడలు తెరపైకి వస్తాయి… బొద్దింకలు, వాటి మద్దతుదారులు కేవలం పాత్రధారులే…… నో, నో, ఇదంతా నిజమైన ప్రజాస్వామిక విప్లవం, ఆహ్వానిద్దాం, అభినందిద్దాం, సహకరిద్దాం అని భ్రమపడే వాళ్లుంటే… వాళ్లు అసలైన జాతి వ్యతిరేకులు…!!
Share this Article