ఒక వార్త… సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉంది… ఇంట్రస్టింగుగానూ ఉంది… సహజంగానే భజనలు, డప్పులు, పిచ్చి వార్తలు తప్ప ఇంకేమీ పట్టని తెలుగు పత్రికల్ని కాసేపు వదిలేయండి…. ఫిట్ ఫర్ నథింగ్… నిజానికి అవి చదవకపోతేనే చాలా బెటర్… మనిషి ఆరోగ్యానికి, సమాజం ఆరోగ్యానికి… నిష్కర్షగా చెప్పాలంటే, ప్రతి తెలుగు పత్రికా అలాగే ఉంది… అదొక దరిద్రం… తెలుగు టీవీలు మరీ మరీ దరిద్రం… సీన్ కట్ చేస్తే… ఈ వార్త ఏమిటో చూద్దాం… తూర్పు గోదావరి జిల్లా, ఏలేశ్వరం మండలం, లింగంపర్తి గ్రామం… అక్కడో గుడి ఉంది… అందులో ఓ పూజారి ఉన్నాడు… పేరు వీఎస్ఆర్ గోపాల్… జస్ట్, తొమ్మిది మాస్టర్స్ కోర్సులు పూర్తి చేశాడు ఇప్పటికే… అరె, కాస్త ఆగండి సార్… ఇంకా చాలా చదువుతాడు… తనకు చదువు కొలువు మార్గం కాదు… ఓ జ్ఞానం… అంతే… చదవాలి, పరీక్ష రాయాలి, మరో సర్టిఫికెట్ తన మెడలో పడాలి… అంతే… ఇప్పటికి తొమ్మిది అయిపోయాయ్… లిస్టు కావాలా..?
ఎంఎస్సీ సైకాలజీ, ఎంఎస్సీ ఫిలాసఫీ, ఎంకామ్, ఎంఏ ఇంగ్లిష్, ఎంఏ తెలుగు, ఎంఏ పాలిటిక్స్, ఎంఏ ఎకనమిక్స్, మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ… ఆంధ్రా యూనివర్శిటీ నుంచి, నాగార్జున యూనివర్శిటీకి చెందిన దూరవిద్య విభాగం నుంచి… ఇదంతా చదవగానే సహజంగానే ఓ సగటు మనిషికి అనిపించేది ఏమిటి..? అబ్బ, భలే చదివాడు పంతులు… ఏదైనా మంచి సర్కారు కొలువు చూసుకున్నాడేమో… ఏ గ్రూపు-2 కొట్టేసి, ఏ తహసిల్దారో అయిపోయి, రోజూ నోట్లు లెక్కపెట్టుకోవడంలో బిజీ అయిపోయాడేమో… అరె, సివిల్స్ ట్రై చేసి కొట్టేస్తే బెటరేమో కదా… ఏ ఐఏఎస్ అధికారో అయిపోతే ఇక లైఫంతా పండుగే కదా… ఇదే కదా…
Ads
నిజానికి కాకినాడ సర్కారు ఆసుపత్రి సైకాలజీ విభాగంలో ఓ జాబ్ వచ్చింది, వద్దనుకున్నాడు… ఏమయ్యా అంటే… మరో ఆరు కోర్సులు పూర్తి చేయాలట… అరె, ఇదేం పిచ్చిరా నాయనా..? అసలు పూజారి అంటేనే ఇప్పుడు సొసైటీలో, కాదు, కాదు, పూజారి వర్గంలోనే ఓ నిరాసక్తత అలుముకుంటోంది కదా… పెళ్లిళ్లు కావడం లేదు, ఎవరూ పిల్లల్ని ఇవ్వడం లేదు, నువ్వేమో చదువు, చదువు అంటావు… కడుపులో చల్ల కదలని ఏదైనా మంచి కొలువు చూసుకుని సెటిల్ కావచ్చు కదా అనడక్కండి… తనకు ఆ భావనలంటేనే అసహ్యం…. ‘‘ఏడు తరాలుగా పూజారి వృత్తిలో ఉంది మా వంశం… నేనెందుకు వదిలేయాలి..?’’ అని బ్లంటుగా సమాధానమిస్తాడు… వావ్, ఈరోజుల్లో ఒక యంగ్ పూజారి తన వృత్తిని ప్రేమించడం, అంటిపెట్టుకోవడం వార్తావిశేషమే…
రోజూ పొద్దున్నే అయిదు గంటలకు లేస్తే ఒంటి గంట వరకూ దేవుడు, హారతులు, పూజలు గట్రా… తరువాత సాయంత్రం నాలుగు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ అదే ‘డ్యూటీ… మధ్యమధ్యలో సైకలాజికల్ సమస్యల గురించి ఎవరెవరో వస్తారు, తను సాయం చేస్తుంటాడు… ‘‘ఇప్పుడు నాకేం తక్కువైందని..? నాకెందుకు సర్కారు కొలువు..?’’…. చాలా చాలా సంక్లిష్టమైన ప్రశ్న ఇది… జవాబు ఈ క్షుద్రపాలకులు చెప్పలేరు… కాదు, కాదు, మన విధానాల్ని రచిస్తూ, మన మీద రుద్దుతున్న సూడో జ్ఞానులు ఐఏఎస్ అధికారులు అస్సలు చెప్పలేరు… నిజానికి ఈ వార్తలో ఇదంతా కాదు నచ్చింది… ఆయన భార్య కూడా డబుల్ ఎంఏ… వారెవ్వా… పతికి తగిన సతి… ఇక్కడ హిందూధర్మం, పూజారి వృత్తి ఎట్సెట్రా వదిలేస్తే… చదువు మీద, జ్ఞానం మీద ఉండే ఇంట్రస్టు చెప్పుకోదగింది… నిజానికి ఈయనకు పది రెట్లు డిగ్రీలు సాధించినవాళ్లు కూడా ఉన్నారు, అది కాదు గొప్పతనం… అసలు డిగ్రీ కూడా పూర్తి కాకుండా, ఇంటర్‌తో ఆపేసినవాడూ ఈ వ్యవస్థను, ఈ ప్రభుత్వాన్ని, ఈ సమాజాన్ని తిడుతూ పర్వర్షన్లోకి జారిపోయి, ద్వేషాన్ని పెంచుకుని, సొసైటీకి ఓ థ్రెట్ అవుతుంటాడు ఈరోజుల్లో… ఒక్కసారి అలాంటోళ్లతో ఈ గోపాల్‌ను పోల్చండి…!!
Share this Article