నో డౌట్… కాశ్మీర్, లడఖ్, హిమచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్… రాష్ట్రం ఏదైతేనేం… ఎత్తయిన కొండలు ఎక్కుతూ… ప్రవాహాలు దాటుతూ… ఆరోగ్య సిబ్బంది కరోనా వేక్సిన్లను గ్రామాల దాకా తీసుకుపోతున్నారు… ప్రజల్ని కన్విన్స్ చేస్తున్నారు… ఫస్ట్, సెకండ్ డోసులు కలిపి 48 కోట్ల దాకా వేశారు ఇప్పటికే… కానీ ఇంతా చేస్తే ఇప్పటికి 10 కోట్ల మందికి మాత్రమే రెండేసి టీకాలు పడ్డయ్… మన ప్రభుత్వ వేక్సిన్ పాలసీ ఫెయిల్యూర్ బలంగానే ఉంది, కానీ ఈమధ్యే గాడిన పడ్డట్టు కనిపిస్తోంది… ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 5 కోట్ల డోసులు వేశారు ఇప్పటికి, నిన్న ఒకేరోజు 22-23 లక్షల డోసులు వేశారు… అయితే అనేక ప్రాంతాల్లో వేక్సిన్ కొరత ఉంది, కొన్ని రాష్ట్రాలకైతే ఈ టీకాల ప్రాధాన్యం పట్ల ఏ సోయీ లేదు… పలుచోట్ల ప్రజల్లో వేక్సిన్ మీద భయసందేహాలున్నయ్, దాన్ని తొలగించే చైతన్యప్రచారాలు కూడా లోపించినయ్… మీడియా కూడా దీన్ని తన విధిగా భావించకపోవడం ఓ విషాదమే…
వేక్సినేషన్ సక్సెస్ స్టోరీలను, ఇన్స్పిరేషన్ స్టోరీలను పూర్తిగా ఇగ్నోర్ చేస్తోంది… ఉదాహరణకు… భువనేశ్వర్… ఫస్ట్ వేవ్ సమయంలో బాగా సఫరైన సిటీ… దాదాపు 11 లక్షల జనాభా, ఒడిశా రాజధాని… ఈ జనాభాలో వేక్సిన్ అర్హత ఉన్న ప్రజానీకం సంఖ్య 9 లక్షలు… మొన్నటికే ఈ సిటీలో 100 శాతం వేక్సినేషన్ పూర్తిచేసినట్టు ఆ నగరపాలక సంస్థ చెప్పుకుంది… ఒక స్టేట్ కేపిటల్ వంద శాతం వేక్సినేషన్ సాధిస్తే ఖచ్చితంగా మంచి వార్తే… వేరే ప్రాంతాలకు ఓ స్పూర్తి… ఎక్కడో నాలుగైదు సెంటర్లు లేదా ప్రభుత్వ హాస్పిటల్స్‌లో మాత్రమే టీకాలు అరకొరగా వేయడం గాకుండా… టీకా కేంద్రాలను విస్తృతంగా ఓపెన్ చేసి, దాదాపు పోలియో డ్రాప్స్ తరహాలో వేశారు… కానీ జాతీయ మీడియా, ఇతర భాషల మీడియా కూడా పెద్దగా పట్టించుకోలేదు…
Ads
నిజానికి మన మీడియాకు న్యూయార్స్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ గట్రా పత్రికల్లో ఏదైనా వార్త వస్తే అది గొప్ప విశేషం… వాటిల్లో వచ్చే వార్తలకు తెగ విలువను ఆపాదించేసి, అదుగో ఆ పత్రిక అలా రాసింది, ఇదుగో ఈ పత్రిక ఇలా రాసింది అంటూ తమ పత్రికల్లో వార్తలు అచ్చేస్తుంటాయి… మరి న్యూయార్క్ టైమ్స్ కూడా భువనేశ్వర్ వంద శాతం కరోనా వేక్సినేషన్ మీద ఆర్టికల్ రాసింది… ఐనాసరే, ఆ వార్త విలువను మన మీడియా ఇంకా గుర్తించలేదు… కరోనా ప్రోన్ ఏరియాలను సరిగ్గా అంచనా వేసి, థర్డ్ వేవ్ వస్తే ఏ ప్రాంతాలు సఫర్ అవుతాయో ఊహించి, అక్కడ వేక్సినేషన్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు ఒడిశాలో… ఇతర సిటీల టీకాలను కూడా భువనేశ్వర్‌కు మళ్లించి ఓ శుష్కమైన రికార్డు కోసం ప్రయత్నించారనే విమర్శలు కూడా ఉన్నాయి… ఇవెప్పుడూ ఉండేవే… కానీ ఒడిశా సెకండ్ వేవ్ సమయంలో అనేక రాష్ట్రాలకు వేల టన్నుల ఆక్సిజన్ పంపించింది, ప్రత్యేక విమానాల్లో తరలించారు… ఇప్పుడు ఈ వేక్సినేషన్ మీద కూడా ఓ స్ట్రాటజీతో వెళ్తున్నారు… మెచ్చుకోదగిన ధోరణే…!!
Share this Article