Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అంతటి విజయసాయిరెడ్డితోనే ఈయనకు సారీ చెప్పించాడట జగన్..!!

October 2, 2024 by M S R

.

ఒడిషాలో ఏకబిగిన 24 సంవత్సరాలు పాలించిన నవీన్ పట్నాయక్ అధికారం కోల్పోవడానికి పాండ్యన్ కారకుడైతే, ఏపీలో జగన్ అయిదు సంవత్సరాల్లోనే గద్దెదిగేందుకు కేవలం ప్రవీణ్ ప్రకాశ్ లాంటి వారిని మాత్రమే తప్పుపట్టక్కర్లేదు. స్వయంగా వివేక భ్రష్టులైన వారికి ఇలాంటి అధికారులు మరింత తోడ్పాటునందిస్తారు! …. ఎ. కృష్ణారావు… (ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

.

Ads

ఇండియాగేట్ శీర్షికతో ప్రతివారం కృష్ణారావు రాసే సంపాదకీయ వ్యాసాలకు భిన్నంగా ఉంది ఈరోజు ఎడిట్ ఫీచర్… ఆంధ్రప్రదేశ్‌కు ప్రవీణ్ ప్రకాష్ అనబడే ఓ ఐఏఎస్ అధికారి తనే ఓ ముఖ్యమంత్రిగా ఎలా పెత్తనం చెలాయించాడో పొలిటికల్, బ్యూరోక్రటిక్ సర్కిళ్లలో అందరికీ తెలుసు… కానీ ఇందులో మరింత సమగ్ర చిత్రణ ఉంది… విస్మయకర కొత్త అంశాలు తెలిశాయి…

సరే, జగన్ ఓ వివేక భ్రష్టుడు అనే చివరి వాక్యంలోని వ్యాఖ్య ఆ పత్రిక పొలిటికల్ లైన్‌కు తగినట్టుగానే ఉన్నా… కృష్ణారావు వంటి పరిణత, సీనియర్ జర్నలిస్టు జగన్ మీద ఆ పరుష పద ముద్ర వేయడం ఎందుకో గానీ నచ్చలేదు, తన రచనల్లో కనిపించే సంయమనానికి ఇది నప్పలేదు… నిజానికి ఇది సీరియస్ కథనం… బాగుంది… అవసరమైంది కూడా…

ఒక ఐఏఎస్ అధికారి ఎలా ఉండకూడదో ప్రవీణ్ ప్రకాష్ ఓ ఉదాహరణ… మరీ ఇలాంటి వాళ్ల గుప్పిట్లోకి వెళ్లిన జగన్ ‘పాలనాదక్షత’ మరో ఉదాహరణ… గతంలోనూ చదివాం, ఏకంగా చీఫ్ సెక్రెటరీలనే బదిలీ చేయగలడు… వాళ్లకు తెలియకుండానే వందల జీవోలు వెలువరించగలడు… చీఫ్ సెక్రెటరీలుగా ఎవరు రావాలో నిర్దేశించగలడు… వాళ్లతో ఆడుకోగలడు, బతిమిలాడించుకోగలడు… సరే, నడిచినన్ని రోజులూ నడిపించుకోవడానికే ప్రయత్నిస్తారు ఇలాంటి చాలామంది ఐఏఎస్ అధికార్లు… కానీ జగన్ ఏకంగా తననే డమ్మీని చేస్తున్నా సరే, ఈయన్ని అంత గుడ్డిగా ఎలా నమ్మాడనేది ఆశ్చర్యమే…

పాఠశాలలకు తనిఖీలు వెళ్తున్న సందర్భాల్లో ‘తన మెనూ’ ఏమిటో తెలియచేస్తూ ఓ సర్క్యులర్ జారీ చేసిన తీరుపై అప్పట్లోనే ‘ముచ్చట’ ఓ స్టోరీ వేసింది… ఇదీ…  సారొస్తారొస్తారు..! ఏది పడితే అది తినడట… నిప్పు… మెనూ ఉత్తర్వులు జారీ..!!  సారు గారి వింత లీలల్లో ఇదొక చిన్న నీటి బిందువు…

ఐతే ఈ వ్యాసం శీర్షికలో చెప్పినట్టు… ఆంధ్రా పాండ్యన్ అనొచ్చా..? ఏమో… నాకు తెలిసి ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని నానారకాలుగా బదనాం చేసి, ప్రజలకు దూరం చేసిన పాండ్యన్ కూడా ప్రవీణ్ ప్రకాష్‌కు సాటిరాడేమో… ప్రవీణ్ ప్రకాష్ అంటే ప్రవీణ్ ప్రకాషే… తనకు ఎవరితోనూ పోలిక కుదరదు… ఎక్స్‌ట్రీమ్ కేరక్టర్… (జగన్‌కు ఇంత క్లోజ్ అయ్యాడు కదా… అంతకుముందు టీడీపీ మనిషిగా ముద్రపడిన తను అంతగా ఎలా దగ్గరయ్యాడనేది ఓ మిస్లరీ… ఓ పరిశోధనాంశం… తనకు పాలిటిక్స్ మీద కూడా ఇంట్రస్టు… బీజేపీ సహకారంతో ఏకంగా వారణాసిలోనే అసెంబ్లీకి పోటీ చేయాలని అనుకున్నాట్ట ఓ దశలో… జగన్ నమ్మినట్టే మోడీ కూడా నమ్మేసి వోకే అంటాడని అనుకున్నాడేమో బహుశా…)

ఇదీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆ వ్యాసం లింక్… https://www.andhrajyothy.com/2024/editorial/indiagate/andhra-pandyan-is-praveen-prakash-1317267.html

చివరకు జగన్ ఎంతగా ఈయన గుప్పిట్లోకి వెళ్లిపోయాడంటే… ఏదో ఓ సందర్భంలో, ఏదో ఓ ఇష్యూలో… ఏకంగా విజయసాయిరెడ్డితో ప్రవీణ్ ప్రకాష్‌కు జగన్ సారీ చెప్పించాడట… (ఫాఫం ఈయన్ని జగన్ క్యాంపులోకి తీసుకొచ్చిందే తను… చివరకు తనే సారీ చెప్పాల్సి వచ్చింది… మనసులోనే చెంపలేసుకుని ఉంటాడు…) అరయగ కర్ణుడీల్గె అన్నట్టుగా జగన్ పాలన పట్ల ప్రజల్లో విపరీతంగా పెరిగిన అనేక కారణాల్లో ఈ ప్రవీణ్ ప్రకాష్ కూడా… మరీ వివేక భ్రష్టత్వం అనే పదాన్ని వాడలేను గానీ… జగన్ స్వయంకృతాపరాధమే ఇది…

అన్నట్టు… ప్రతి వారం ఈ మీడియా హౌజ్ అధినేత రాసుకొచ్చే కొత్త పలుకు వ్యాసానికి ఫస్ట్ పేజీలో సుదీర్ఘమైన ఇండికేషన్ ఇస్తుంటారు కదా… బాక్సులు కట్టి మరీ పంచ్ ఉండేలా ప్రజెంటేషన్ ఇస్తారు కదా… ఇలాంటి మంచి ఎడిట్ వ్యాసాలకు కూడా అలాగే ఫస్ట్ పేజీలో ఇండికేషన్ ఇవ్వొచ్చు కదా… ఏం..? అది ఓనర్‌కు మాత్రమే పరిమితమైన ప్రివిలేజా..?!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దీన్నే ‘ప్రాప్తం’ అంటారు… పాపం, మనసుల్ని కదిలించే ఓ ‘తల్లి’ కథ…
  • ఐపోలేదు… అసలు కథ ముందుంది… అబ్బే, వేణుస్వామి జోస్యం కాదు…
  • వాళ్లు ఆశించిన డాన్స్ చేసినన్ని రోజులే ఆదరణ… తరువాత..?!
  • ఇండియన్ క్లియోపాత్రా..! World Top 10 బ్యూటీల్లో ఒకరు… మన తెలుగు మహిళే…
  • చీకటి పడితే సీతారాం అట, రాతిరికొస్తే రాధేశ్యామ్ అట… వామ్మో సుమలత..!!
  • మురారి అహం… అందుకే స్మితా పాటిల్ ఎహె నేను రాను పొమ్మంది…
  • ఓ కొలవెరి, ఓ రౌడీ బేబీ… అప్పట్లో ‘తోడీ సిపీలీహై’… మందు కొట్టించేశాడు…
  • బాలు, కొసరాజు, సింగీతం, సాలూరి… అందరి కెరీర్లలోనూ ఇదే చెత్తపాట…
  • సంపద, సర్కిల్, పేరు, చదువు… ఆ ఒక్క దుర్బల క్షణంలో పనిచేయవు..!!
  • రియా హరి..! తనే నిర్మాత, తనే హీరోయిన్… ఓ కృత్రిమ ప్రేమకథ…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions