.
పొద్దున్నే ఈనాడులో కనిపించిన ఒక వార్త… కనీకనిపించనట్టుగా పరిచారు గానీ అది ఆలోచనల్లో పడేసింది, ఆశ్చర్యానికీ గురిచేసింది… విషయం ఏమిటంటే..?
ఒక శునకం యాదగిరిగుట్ట గుళ్లోకి భక్తులతోపాటు ధర్మదర్శనం క్యూలో నుంచి ప్రవేశించింది… తరువాత దాన్ని అక్కడి నుంచి జాగ్రత్తగా తీసుకెళ్లి బయట వదిలిపెట్టారు… ఓ అరగంటపాటు దర్శనాలు ఆపేసి సంప్రోక్షణ క్రతువు నిర్వహించారు… సిబ్బంది నిర్లక్ష్యంపై చర్యలు తీసుకుంటామనీ, ఇకపై అలాంటివి జరగకుండా జాగ్రత్తలు, కట్టుదిట్టాలు ఏర్పాటు చేస్తామనీ ఈవో భాస్కర్‌రావు చెప్పారు…….. ఇదీ వార్త…
Ads
ఆశ్చర్యం ఏమిటంటే..? అక్కడి దాకా అసలు ఆ శునకం (కుక్క పిల్ల అట) భక్తులతోపాటు ఎలా వచ్చింది… భక్తులే అక్కడి నుంచి తరిమేయాలి కదా… మరింత ఆశ్చర్యం ఏమిటంటే..? సంప్రోక్షణ దేనికి..? అర్చకుల నిర్ణయం విస్మయపరిచింది… అభ్యంతరం అని కాదు, జస్ట్, ఆశ్యర్యం, అంతే… ఎందుకంటే..?
కుక్క ఏమీ మైలజంతువు కాదు… భైరవుడిగా కొలవబడేది… ఉజ్జయిని వెళ్లి చూడండి, మద్యం ప్రసాదంలా నివేదిస్తారు… కర్నాటకలోని గానుగాపూర్ వెళ్లి చూడండి… గర్భగుడి పరిసరాల్లోనే తిరుగుతూ ఉంటాయి… బయట ఆవులు అలాగే తిరుగుతుంటాయి… దత్తాత్రేయుడితోపాటు ఆవును, కుక్కను కూడా పూజిస్తాం… ఆవును మనం పలురకాలుగా పూజిస్తుంటాం… గోహత్యను పాపంగా పరిగణిస్తుంటాం… అంతెందుకు..? వేల కోతులు పల్లెల్లో పంటల్ని, ఆస్తుల్ని ధ్వంసం చేస్తున్నా సరే, ఒక్క కోతినైనా చంపడానికి మన సమాజం అంగీకరించదు…
సో, సంప్రోక్షణ ఎందుకు..? ఏమో, ఆగమాల్లో, అర్చనల్లో అనుభవజ్ఞులే చెప్పాలి… గతంలో యాదగిరిగుట్ట పట్టణవాసులకు ప్రతి మంగళవారం ప్రత్యేక దర్శనాల వసతి కల్పించారు… ఇప్పుడు మండల వాసులందరినీ మంగళవారం పొద్దున అనుమతిస్తున్నారు… బహుశా ఎవరితోనో వచ్చి ఉంటుంది అది… ఇలాంటివి కాస్త సెన్సిటివ్… దాని పట్ల కర్కశంగా వ్యవహరించలేరు… అదో వివాదం… అందుకే ఓ సంచీలో పెట్టి, జాగ్రత్తగా బయట వదిలేసి వచ్చారు…
మొన్న కౌశిక్ రెడ్డి ఫోటో షూట్ చేసుకున్నాడు గుడి ఆవరణలోనే… ఓ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇలాంటి ఫోటో షూట్లు అవసరమా..? ఈ ఆలోచన తనకూ ఉండాలి… ఇకపై ఇలాంటి వివాదాలు రాకుండా… భవిష్యత్తులో ఏరకమైన ఫోటో షూట్లు జరగకుండా నిషేధాజ్ఞలు జారీచేశారు, సంతోషం… ఐనా ప్రి-వెడ్ షూట్లలాగానే పోస్ట్-వెడ్ షూట్లు చేసుకోవాలనుకుంటే… నేచర్ సెంట్రిక్ లొకేషన్స్, విల్లాలు, రిసార్టుల్లో… లేదా ప్రి-వెడ్ షూటింగ్ స్పాట్లను ఎంచుకోవాలి గానీ… కోట్లాది మంది భక్తజనం వచ్చీపోయే స్పాట్ ఎంచుకోవడం ఏమిటి..? ఇంకా నయం, డ్రోన్ షూట్ చేయలేదు…
హేమిటో… యాదగిరిగుట్ట పునర్నిర్మాణం దగ్గర నుంచి ప్రతిదీ వివాదమే అక్కడ… ఆమధ్య రెడ్లకు పీటలు వేసి, డిప్యూటీ సీఎంను కింద కూర్చోబెట్టి ఆశీర్వచనాలు ఇప్పించిన వివాదం కూడా…
పైన ఫోటోలో చూస్తున్నారు కదా… మొదటిది ప్రస్తుత విమానగోపురం… ఇప్పుడు పనులు నడుస్తున్న బంగారుతాపడం పూర్తయితే ఎలా ఉంటుందనేది రెండో ఫోటో… తెలంగాణ ఆలయాల్లో బంగారు విమానగోపురం ఇదే ప్రథమం… ఇప్పటికే భిన్నమైన వాస్తుతో అబ్బురపరిచే విమానగోపరం బంగారాన్ని అద్దుకున్నాక మరింత మెరిసిపోవడం ఖాయం…
అప్పట్లో కేసీయార్ పిలుపు మేరకు కొందరు బంగారం ఇచ్చారు… దీనికోసమే… మళ్లీ దాతల నుంచి అడగడం, జాప్యం దేనికనుకుని… భక్తులు ఆల్రెడీ సమర్పించిన బంగారం కొంత, వెండి అమ్మగా వచ్చిన సొమ్ముతో కొనే బంగారం కొంత కలిపి… మొత్తం 60 కిలోల్ని వినియోగిస్తున్నారు… ఆల్రెడీ రాగిరేకుల తాపడం పూర్తయింది… మూణ్నాలుగు నెలల్లో పనులు పూర్తి చేయాలని లక్ష్యం… బంగారం గాకుండానే పది కోట్ల వరకూ పనుల ఖర్చు అంచనా… గుడ్…
Share this Article