.
కొంప ముంచిన దురాశ… డబ్బులు ఆశ చూపడంతో అఘోరీకి ఆశ్రయ మిచ్చిన మంగళగిరికి చెందిన ఓ కుటుంబం.
యువతిని లోబరుచుకుని జంప్ అయిన అఘోరీ. లబోదిబోమంటున్న యువతి కుటుంబ సభ్యులు
Ads
గత కొంతకాలంగా లేడీ అఘోరీగా చలామణి అవుతున్న అలియాస్ అల్లూరి శ్రీనివాస్ అనే వ్యక్తి… తన కూతురు శ్రీవర్షిణికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి పోయాడు అని గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణానికి చెందిన తురిమెల్ల కోటయ్య నిన్న మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు…
ఆయన మీడియాతో మాట్లాడుతూ తన కూతురు ఇంజనీరింగ్ విద్య అభ్యసిస్తుందని. నాలుగు నెలల క్రితం లేడీ అఘోరి మంగళగిరి నేషనల్ హైవే మీద ఒంటి మీద బట్టలు లేకుండా హల్చల్ చేస్తుంటే… పోలీస్ వారు ఎవరైనా మహిళలు ఉంటే కొంచెం లేడీ అఘోరికి బట్టలు కప్పండి అని చెప్పారు… తర్వాత మా కూతురు ధైర్యంతో వెళ్లి బట్టలు కప్పింది..,
అప్పటినుంచి నా కూతురు ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడేవాడు… కొంతకాలం గడిచిన తర్వాత మా ఇంటికి కూడా వచ్చి, నా కూతుర్ని మాయ మాటలతో మోసం చేసి, ఆకుపసరుతో లేపనాలు పూసి, వశీకరణ చేసుకొని అఘోరీల ఆశ్రమానికి యువరాణిని చేస్తారని చెప్పి నా కూతుర్ని పూర్తిగా తనవైపు తిప్పుకున్నాడని ఆయన వాపోయాడు…
…….. ఇదండీ న్యూస్ వాట్సప్ గ్రూపుల్లో కనిపించిన వార్త… ఇక్కడ కొన్ని అంశాలు… 1) తను … అఘోరీ కాదు, మగ ఘోరీ…
2) ప్రతిచోటకూ వెళ్లి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నాడు… పోలీసులు ఎప్పటికప్పుడు లైట్ తీసుకున్నారు గానీ రాను రాను సమస్యాత్మకం అయ్యే కేరక్టర్, హేండిల్ చేయలేకపోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు అని ముచ్చట పలుసార్లు హెచ్చరించింది…
3) అదే జరిగింది… కొన్ని తోకలను మొదట్లోనే కత్తిరించాలి… ఉపేక్షిస్తే, ఇదుగో ఇలా తండ్రులు కన్నీళ్లు పెట్టుకుంటారు… ఈ కేసు అంటారా..? ఈ వశీకరణాలు, ఆకు పసర్ల మాటెలా ఉన్నా, ఈ ఫిర్యాదులోని నిజానిజాలు పోలీసులు తేలుస్తారు… కానీ సెన్సేషన్ కోసమో, పర్వర్షన్‌తోనో పిచ్చి వేషాలు వేసేవాళ్లను ఉపేక్షించకూడదనేది ఈ కథలో నీతి…
తన మాటల్ని పోలీసులు నమ్మడం లేదనీ, కేసు కూడా పెట్టి, తన కూతుర్ని కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ అంటున్నాడు కోటయ్య… (Source :: NTV)
Share this Article