Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఫక్తు రొటీన్ సినిమా కథ… హిట్ పాటలతో నూరు రోజుల ఉత్సవం…

December 17, 2024 by M S R

.

( దోగిపర్తి సుబ్రహ్మణ్యం ) …. కృష్ణ శ్రీదేవిల జైత్రయాత్రలో మరో సినిమా ఆగస్టు 1980 లో వచ్చిన ఈ చుట్టాలున్నారు జాగ్రత్త . కధ రొటీనే అయినా ప్రముఖ నటుడు , నిర్మాత బాలయ్య బిర్రయిన స్క్రీన్ ప్లే సినిమాను ఏడు సెంటర్లలో వంద రోజుల వైపు నడిపించింది .

చాలా సినిమాల్లో మంచి మారాజుల్ని నమ్మించి మోసం చేసేది చుట్టాలు , చుట్టూ ఉండేవారు . ప్రపంచంలో మోసగించబడేది ఎప్పుడూ మంచోళ్ళు , నమ్మినోళ్ళు , అమాయకులు . ఆస్తుల విషయయమైనా , రాజకీయ అధికారం విషయమైనా . అయితే చుట్టాలు అందరూ మోసం చేసేవారేనా అంటే కానే కాదు . అందరూ అలాగే అయితే కల్కి ఎప్పుడో వచ్చి ఉండేవాడు .

Ads

అనగనగా ఓ మంచి మారాజు . ఆయన తమ్ముడు , చెల్లెలు , మేనల్లుడు గాదె కింద పందికొక్కుల్లా ఆస్తిని హరిస్తూ ఉంటారు . హీరో ఆయన వద్ద మేనేజర్ . అతన్ని అడ్డు తప్పించుకోవటానికి మంచి మారాజుని మర్డర్ చేసి అతన్ని జైలుకు పంపుతారు చుట్టాలు .

ఈ మేనేజర్ లాంటోడే మరొకడు ఉంటాడు . అంటే హీరో కృష్ణ ద్విపాత్రాభినయం అన్న మాట . ఇద్దరూ కలిసి చుట్టాల్ని పోలీసులకు అప్పచెప్పుతారు . టూకీగా ఇదీ కధ .

మేనేజర్ కృష్ణకు జోడీ శ్రీదేవి . దొంగ గంగులుకు జోడీ కవిత . రెండు జంటలూ చలాకీగా , హుషారుగా ఉంటాయి . కృష్ణ , శ్రీదేవి 31 సినిమాలలో కలిసి నటించారు . సక్సెస్ జోడీ . శ్రీదేవి అందరికీ సక్సెస్ జోడీయే అనుకోండి . ఇతర ప్రధాన పాత్రలలో మిక్కిలినేని , రావు గోపాలరావు , నూతన్ ప్రసాద్ , బాలయ్య , వంకాయల , నిర్మలమ్మ , మమత ప్రభృతులు నటించారు .

యం యస్ విశ్వనాథన్ సంగీత దర్శకత్వంలో ఆరు పాటలూ హిట్టే . కృష్ణ అభిమానులకు థియేటర్లలో పండగే పండగ . సి నారాయణరెడ్డి , కొసరాజు , జాలాది పాటల్ని వ్రాసారు . కొసరాజు వ్రాసిన అపనా తనామనా పాట బాగా హిట్టయిన పాట . ఆయన వ్రాసిందే మరో పాట చిక్కావులేరా నా కొండె అని చుట్టాల్ని టీజ్ చేస్తూ పాడే పాట .

సి నారాయణరెడ్డి వ్రాసిన రెక్కలు తొడిగి రెపరెపలాడి పాట కృష్ణ , శ్రీదేవిల మీద ఉంటుంది . బాగా హుషారుగా ఉంటుంది . చాలా శ్రావ్యంగా ఉంటుంది . అలాగే ఆయన వ్రాసిందే రావయ్యా రామేశం పాట కూడా . మరో జంట కృష్ణ , కవితల మీద పాట అమ్మీ ఓలమ్మి పాట కూడా హుషారుగా ఉంటుంది .

జాలాది వ్రాసిందే బావనే వయ్యారి భామ అంటూ సాగే పాట నూతన్ ప్రసాద్ మీద ఉంటుంది . నూతన్ ప్రసాద్ కామిక్ విలనీని బాగా చేసారు . నూతన్ ప్రసాద్ నటన చూస్తుంటే అప్పుడప్పుడు నాగభూషణం గుర్తుకొస్తాడు .

బి వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏడు సెంటర్లలో వంద రోజులు ఆడింది . ఆ ఏడింటిలో ఒకటి మా గుంటూరు . సరస్వతి పిక్చర్ పేలసులో ఆడింది . రైల్వే స్టేషన్ రోడ్లో ఇంకా నడుస్తూ ఉంది ఈ థియేటర్ . సంతోషం . మా నరసరావుపేటలో ఈశ్వర్ మహల్లో 50 రోజులు ఆడింది . అదీ నడుస్తోంది .

తెలుగులో హిట్టయిన ఈ సినిమా హిందీ తమిళ భాషల్లోకి రీమేక్ చేసారు . హిందీలో జితేంద్ర , జయప్రద , ఆమె ప్రత్యర్థి శ్రీదేవి నటించారు . తెలుగులో శ్రీదేవి పాత్రను హిందీలో జయప్రద పోషించగా కవిత పాత్రను శ్రీదేవి పోషించింది . తమిళంలో రజనీకాంత్ , శ్రీదేవి , రాధికలు నటించారు . కవిత పాత్రను రాధిక పోషించింది .

సినిమా , పాటల వీడియోలు యూట్యూబులో ఉన్నాయి . కృష్ణ శ్రీదేవి అభిమానులు చూసి ఉండకపోతే అర్జెంటుగా చూసేయండి . A feel good , entertaining , Krishna-mark movie . Of course , Sridevi’s too . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘బ్రదర్ కొంత కరెంటు సర్దుతావా..? వచ్చే నెలలో తిరిగి ఇచ్చేస్తా…’’
  • రెడ్ బుక్ సరే… పింక్ బుక్ సరే… అసలు ఈ బ్లూ బుక్ ఏమిటో తెలుసా..?
  • ట్రోలర్‌కు చెప్పుతో కొట్టినట్టు కౌంటర్… మీకు బూమ్రా-సంజనా కథ తెలుసా…
  • కేటీఆర్ ఇలా ట్వీటాడో లేదో… కవిత నుంచి కౌంటర్ పడింది…
  • త్రిష మళ్లీ హర్టయింది..! సీత మాజీ భర్తకు స్ట్రాంగ్ కౌంటర్ ..!
  • అసలే జలపాతం చలి… కేవలం బికినీ… అప్పటి క్రేజీ లిరిల్ యాడ్ కథ…
  • హోరెత్తిన ఇండియా..! మురిపెంగా T20 వరల్డ్ కప్ ముద్దాడిన ఈ క్షణం..!!
  • అమెరికా తాజా ప్రేలాపనలకు విదేశాంగ మంత్రి జైశంకర్ జవాబు…
  • సూర్యకుమార్ కెప్టెన్సీ వైఫల్యాలు కాటేయకపోతే… గెలుపు మనదే…
  • అరవయ్యేళ్ల ఆ మహిళ ఎవరామె..? కాస్త సీరియస్‌గా చదవండి…!!

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions