Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శవసంభోగం…! లైంగికదాడిగా పరిగణించాలా..? ఆ సెక్షన్లు వర్తిస్తాయా..?

December 25, 2024 by M S R

.

నిన్నటిదే ఓ వార్త… ఓ అత్యాచారం కేసు… చత్తీస్‌గఢ్ రాష్ట్రానికి సంబంధించిన కేసు… నితిన్ యాదవ్ అనేవాడు ఓ బాలిక మీద అత్యాచారం చేశాడు… ఆమె మరణించింది…

ట్రయల్ కోర్టు తనకు కిడ్నాప్, అత్యాచారం, హత్య అభియోగాలకు గాను జీవిత ఖైదు విధించింది… న్యాయమే… చట్టప్రకారం శిక్ష విధించారు… వోకే, కానీ ఇక్కడ మరో విషయం ఏమిటంటే..?

Ads

నీలు నగేశ్ అనేవాడు మరణించిన ఆ బాలిక మృతదేహంతో సంభోగానికి (Necrophilia) పాల్పడ్డాడు… అంటే, శవ సంభోగం… మరి వాడిని ఎలా శిక్షించాలి..? ఏయే సెక్షన్లు వర్తిస్తాయి..?

శవం అంటే… ప్రాణం లేని ఓ భౌతిక పదార్థం కాబట్టి… జీవమున్న ప్రాణిగా పరిగణించలేం, ఏ అత్యాచార సెక్షన్లూ వర్తించబోవని ఒక వాదన… నో, నో, గౌరవప్రదమైన అంత్యక్రియలు కూడా ఓ మృతదేహం హక్కు, ఆ హక్కును భంగపరిచాడు కాబట్టి… అత్యాచార సెక్షన్లన్నీ వర్తింపచేసి, శిక్షించాలని మరో వాదన…

కేసు హైకోర్టు దాకా వచ్చింది… ఈ కేసులో శవ సంభోగానికి పాల్పడిన వాడిని కూడా సహ- నిందితుడిగానే పరిగణించి, వాడి మీద ఐపీసీ సెక్షన్లు 363, 376(3), పోక్సో చట్టంలోని సెక్షన్ 6, 3(2)(వి) ప్రకారం శిక్షలు విధించాలని ప్రాసిక్యూషన్ వాదన…

కానీ హైకోర్టు మాత్రం దీన్ని భిన్నంగా చూసింది… అవున్నిజమే, శవంతో సంభోగం వికృతమైన, హేయమైన చర్యే… కానీ అత్యాచార నేరం సెక్షన్లు వర్తించవు, లైంగిక దాడిగా పరిగణించలేమని ద్విసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది…

గౌరవప్రదమైన రీతిలో అంత్యక్రియలు పొందే హక్కు ఆ మృతదేహానికి ఉంది… కానీ శవసంభోగం వల్ల ఆ హక్కుకు తీవ్ర విఘాతం కలిగిందనే అభిప్రాయం కరెక్టు కాదని పేర్కొంది… ఐతే సాక్ష్యాలు చెరిపేయడం, నిందితుడికి సహకరించడం, కేసును తప్పుదోవ పట్టించే సమాచారం ఇవ్వడం వంటి నేరాలకు గాను ఏడేళ్ల జైలు శిక్ష మాత్రం వాడికి విధించింది…

తనపై మోపిన అత్యాచార సెక్షన్లను కొట్టేసింది… కానీ ఆల్రెడీ ఆమె మీద నేరం జరిగింది, ప్రాణం పోయింది… చివరకు ప్రాణం పోయాక కూడా నేరం జరిగింది… అదీ ఓరకమైన అత్యాచారమే కదా, అదీ శిక్షార్హమే కదా అనేది ఒక వాదన… అత్యాచారమే కాదు, అంతకుమించి ఆమె భౌతికదేహానికి జరిగిన లైంగిక అవమానం కూడా… వికృత లైంగిక చర్య అని ఆ వాదనల సారాంశం…

మృత దేహానికి ఇష్టాయిష్టాలు, ఉద్వేగాలు ఉండవు కాబట్టి, ఆ శవసంభోగాన్ని అత్యాచారంగా పరిగణించలేం అంటుంది కోర్టు… ఏది కరెక్టు..? ఇది ఏ తీర్పు న్యాయబద్ధమో చెప్పలేని ధర్మసంకటం…! గతంలో కర్నాటక హైకోర్టులో కూడా ఇలాంటి కేసు మీద వాదనలు జరిగాయి… ఆ కోర్టు కూడా ఇలాగే అభిప్రాయపడింది…

‘‘A careful reading of Sections 375 and 377 of IPC makes it clear that a dead body cannot be called a human or person. Therefore, the provisions of Section 375 or 377 would not be attracted” అని పేర్కొంది… ఈ నేరాన్ని, ఈ చర్యను ఓ మానసిక వైకల్యంగా చూసింది… ఇతర దేశాల్లోనూ ఇలాంటి కేసులు న్యాయవిచారణకు వచ్చిన సంఘటనలున్నాయి..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • గ్రోక్ కూడా చేతులెత్తేసిన భాష… ఇక ఆక్స్‌ఫర్డ్ టీమ్‌కే సాధ్యమేమో…
  • ఏమైంది అసలు..? చేజేతులా ట్రోలర్లకు చిక్కుతున్న కొండా సురేఖ..!!
  • అడుగుకో పాక్ గూఢచారి… వీళ్ల ఏరివేతే యుద్ధంకన్నా ప్రధానం..,
  • అనవసరంగా వైసీపీ సోషల్ బ్యాచ్‌ను గోకిన భైరవం దర్శకుడు…
  • అత్యంత అసాధారణ కరెంటు బిల్లు… నమ్మడమే కష్టం సుమీ….
  • సొంత ‘బతుకమ్మ’ పేర్చుకుని… తన ఆట తాను ఆడుకోవడమేనా..?
  • ఫక్తు అక్కినేని మార్క్ వన్ ప్లస్ టూ రొటీన్ సినిమా ప్రేమ కథ..!!
  • ఆ సిరివెన్నెల పాటలు… రాసిన అర్థాలు వేరు- వాడుకున్న తీరు వేరు…
  • శరణార్థుల ఆశాసూచిక – భారత రాజ్యాంగంలోని కుబేరుని కళాచిత్రం…
  • కశ్మీర్‌లో యూఎన్ ధర్మసత్రం షట్‌డౌన్… శెభాష్ జైశంకర్… ఇదీ టెంపర్‌మెంట్..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions