.
ఓ వార్త… ధురంధర్ సినిమా ఏకంగా టాప్10 ఇండియన్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది అని..! అంటే వసూళ్లలో ఇప్పటివరకు టాప్10 ఇండియన్ సినిమాలు అని..!
2025 సంవత్సరానికి సంబంధించి అన్ని వసూళ్ల రికార్డులను అది బ్రేక్ చేసిందని ఆ వార్త సారాంశం… ఛావా, కాంతారా1 సినిమాల్ని దాటేసిందని..! నిజానికి ఆ రెండు సినిమాలు ఇప్పుడు థియేటర్లలో లేవు, రన్ ఆగిపోయింది… కానీ ధురంధర్ ఇంకా నడుస్తోంది, అదీ రోజుకు 20 కోట్ల దాకా వసూళ్లు ఉన్నాయి, రిలీజైన 18 రోజుల తరువాత కూడా…
Ads
- ప్రస్తుతం దాని వసూళ్ల ప్రపంచవ్యాప్త గ్రాస్ 870- 900 కోట్ల నడుమ ఉంది… ఈ జోరుతో అది ఈజీగా మరో 200 కోట్లు సాధిస్తుంది… దానిపై ‘యాంటీ- నేషన్’ శక్తులు ఎంత రాద్ధాంతం చేస్తుంటే, అది మరింత జోరు పెంచుకుంటోంది… ఈ ధ్రువ్ రాఠీ వంటి నెగెటివ్ శక్తులకు ఈ చిత్ర నిర్మాత రుణపడి ఉండాలి…

ఒక్కసారి వసూళ్లలో టాప్ 10 ఇండియన్ సినిమాలు ఏవో చూద్దాం…
.
| ర్యాంక్ | సినిమా | వసూళ్లు (ప్రపంచవ్యాప్త) |
| 1 | దంగల్ | ₹2,000+ కోట్లు |
| 2 | బాహుబలి 2 | ₹1,810 కోట్లు |
| 3 | పుష్ప 2 | ₹1,700 – 1,800 కోట్లు |
| 4 | RRR | ₹1,387 కోట్లు |
| 5 | KGF: చాప్టర్ 2 | ₹1,250 కోట్లు |
| 6 | జవాన్ | ₹1,148 కోట్లు |
| 7 | పఠాన్ | ₹1,050 కోట్లు |
| 8 | కల్కి 2898 AD | ₹1,040 – 1,100 కోట్లు |
| 9 | యానిమల్ | ₹910 – 917 కోట్లు |
| 10 | ధురంధర్ | ₹870 – 900 కోట్లు |
….. పది సినిమాల్లో అయిదు సౌత్ సినిమాలే… అందులోనూ కేజీఎఫ్ వదిలేస్తే నాలుగు తెలుగు సినిమాలే… ఒక దశలో సౌత్ సినిమాల ధాటికి బాలీవుడ్ బిక్కచచ్చిపోయింది… చెత్తా రొటీన్ ఫార్ములా కథలతో జనం థియేటర్లకే రావడం మానేశారు… అనేక థియేటర్లు మూతపడ్డాయి…
ఓ మామూలు సౌత్ సినిమా కూడా పాన్ ఇండియా పేరిట హిందీ బెల్ట్ బాక్సుల్ని కొల్లగొట్టాయి… కానీ ఒక విక్కీ కౌశల్, ఒక రణవీర్ సింగ్ తదితరులు బాలీవుడ్‌కు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు… ఎస్, ఛావా, ధురందర్ అవే… ఐనా స్టిల్ సౌత్ డామినేషనే… లైక్ 2025లో కాంతారా1 ….
బాలీవుడ్ వేగంగా తనను తాను రిపేర్ చేసుకుంది… మూసకు స్వస్తి పలికింది… స్పై థ్రిల్లర్లు, దేశభక్తి రంగరించి కొడుతోంది… హిందీ ప్రేక్షకులను మళ్లీ థియేటర్లకు రప్పిస్తోంది… అది విశేషమే…
సౌత్ సినిమా అంటే చాలు, పాన్ ఇండియా పేరిట కొడితే ఇక బాక్సాఫీసులు బద్దలే అనే సిట్యుయేషన్ ఇప్పుడు లేదు... ఉదాహరణ అఖండ2 తాండవం... ఈ సినిమా హిాందీ వెర్షన్ మొత్తం వసూళ్లు ఎంతో తెలుసా... జస్ట్, కోటి రూపాయలు..!! ధురంధర్ ఓ కొత్త చరిత్రను రాస్తోంది... వర్తమాన ఇండియన్ సినిమా ట్రెండ్ ఏమిటో చెప్పే ఉదాహరణ అవుతోంది..!!
Share this Article