తిరుపతికి 56 కిలోమీటర్ల దూరంలోని పొన్నాడిలో సనాతన ధర్మపరిరక్షణ సదస్సు జరిగింది… హిందూ సమాజాన్ని, హిందూ మతాన్ని, హిందూ మత వ్యవస్థల్ని ఈమధ్యకాలంలో బాగా దెబ్బతీస్తున్నారనీ..,. ఓ ఐక్య కార్యాచరణకు సరైన విశాల వేదిక అవసరమనీ దాని ఎజెండా… కంచి కామకోటి, శృంగేరీ, హంపి విద్యారణ్య, పుష్పగిరి, తుని సచ్చిదానంద, అహోబిల, భువనేశ్వరీ మహాపీఠం, ముముక్షుజన మహాపీఠం తదితర మఠాలు, పీఠాల నుంచి స్వాములు, ప్రతినిధులు హాజరయ్యారు… సరే, ఏదో చర్చించారు… కానీ ఆ వార్తకన్నా ఇదుగో ఈ కింద వార్తే ఎక్కువ ఆకర్షిస్తోంది… ఇది ఆంధ్రప్రభలో ఫస్ట్ పేజీ వార్త… ఒక్కసారి ఆ క్లిప్పింగ్ చూడండి…
ఆఁ ఏముందీ..? ఓ పూజారిని సస్పెండ్ చేశారు, ఆయన హాస్పిటల్లో చేరాడు అని తేలికగా తీసేసేరకంగా లేదు… తను 46 ఏళ్లుగా అక్కడ పూజారి… ఇంటిస్థలం తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేశాడని అధికారులు సస్పెండ్ చేశారు… నేనేం తప్పు చేయలేదనీ, అది అనువంశికంగా నాకు సంక్రమించిందేననీ, ఏళ్లుగా పన్ను కూడా కడుతున్నానని మనస్తాపానికి గురైన ఆయన గుడిలోనే భిక్షాటన చేశాడు… అనారోగ్యం పాలయ్యాడు… ఆయన రోదన ఎవడికీ పట్టలేదు… అవును, గుళ్లలో తమ చేతులు, కాళ్లు విరుగుతుంటేనే… తమ తలలు కత్తిరింపబడుతుంటేనే తమను కాపాడుకోవడం తెలుగుదేవుళ్లకు చేతకావడం లేదు… ఇక తమకు పూజలు చేసేవాళ్లను ఏం రక్షించగలరు..?
Ads
ఈ ఉదాహరణే తీసుకుందాం… నిజంగా ఈ పూజారి అంత దొంగ అయితే… 46 ఏళ్లుగా అక్కడే పూజలు చేస్తున్నాడు కదా, ఈ రిజిస్ట్రేషన్ ఎప్పుడో చేయించుకునేవాడు కదా… అక్కడ ఈవో జీతం గుళ్ల నుంచే వచ్చే ఆదాయమే… ఖజానా నుంచి పాస్టర్లకు, ఇమాములకు జీతాలు ఇస్తారు… కానీ అర్చకులకు జీతాలు మాత్రం దేవాలయాల సొమ్ము నుంచే ఇస్తారు… ఎవరైనా అడిగితే మైనారిటీ వ్యతిరేకి అని ముద్రలేస్తారు… ఆఫ్టరాల్, ఓ గుడి పూజారి… రెండు నెలలుగా గుడిలోనే బిచ్చమెత్తుకుంటూ ఉంటే… మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు..? కనీసం పరామర్శించి, వివాద పరిష్కారం కోసం ప్రయత్నించారా..? లేదు… ఇప్పుడు అక్కడి ఈవో చిలకపలుకులు పలుకుతున్నాడు… అబ్బే, టెంపరరీ సస్పెన్షనే, వివరణ అడిగాం, అంతే అంటున్నాడు… అబ్బచా… సస్పెన్షన్ అంటే డెఫినేషన్ చెబుతున్నాడు… వివరణ పరిశీలన రెండు నెలలుగా చేస్తున్నావా నాయనా..? గుడి పూజారి గుళ్లో బిచ్చమెత్తుకోవడం నీకు కనిపించలేదా..? వివాదం ఏమిటో తెలుసా..? ఆయన ఉంటున్న స్థలం అది… అయిదు సెంట్లు… ఈ పూజారి దుర్మార్గుడే అనుకుందాం… గుళ్ల సొమ్మును అప్పనంగా భోంచేసే ఈ దేవాదాయ, ధర్మాదాయ శాఖ అన్యాక్రాంతమైన లక్షల ఎకరాల్లో ఒక్క ఎకరమైనా తిరిగి స్వాధీనం చేసుకోగలిగిందా..? రకరకాల టికెట్లు, ధరలు, భక్తుల దోపిడీ, తమ కైంకర్యాలు తప్ప ఈ శాఖ ఉద్దరించింది ఏమైనా ఉందా..? ఇదుగో, ఇలాంటి అర్చకులను బజారుపాలు చేయడం, పొట్టగొట్టడం, హాస్పిటళ్లపాలు చేయడం, బిచ్చగాళ్లను చేయడం తప్పితే…!! పోనీలెండి, అదసలే ఏపీ, రోజులు బాగాలేవు… ఆఫ్టరాల్ గుడి, గుడిలో పూజారి… ఎవడికి పట్టిందిలే…!!
Share this Article