పీవీసింధుకు బ్యాడ్మింటన్ నేర్పింది ఎవరు..? నాదెళ్ల సత్యను మైక్రోసాఫ్ట్ వైపు అడుగులు వేయించింది ఎవరు..? ఆయనే… ఆయనే తెలుసు కదా… ఎక్కడ ఎవరికి ఏ ఘనత దక్కినా అందులో తన వాటా వెతుక్కుని, ఓన్ చేసుకుని, వీలయితే నేను అసలు కారకుడిని అని ఢంకా బజాయించే ఆయన తెలుసు కదా… ప్చ్, చాలారోజులైంది ఆయన నోటి వెంట ఇలాంటి మాటలు విని… ఏదో మిస్సవుతున్నాం… నిజానికి చంద్రబాబు ఇప్పుడు ఓ విషయాన్ని ఓన్ చేసుకోవచ్చు స్వేచ్ఛగా… కాలరెత్తుకుని మరీ… కానీ ఎవరూ గుర్తుచేయనట్టున్నారు ఫాఫం… అదేమిటీ అంటే..? ఉత్తమ సినిమా ఎడిటర్‌గా తాజాగా జాతీయ అవార్డు పొందిన నవీన్ నూలి ఎవరనుకున్నారు..? చంద్రబాబు గెలుపు కోసం 2004 ఎన్నికల సమయంలో ఆర్వీఆర్ చౌదరితో ఓ టీవీ చానెల్ పెట్టించారు… దాని పేరు సీటీవీ… అదుగో అందులోనే ఓం ప్రథమంగా కత్తెర్లు పట్టాడు ఈ తెలంగాణ పిల్లాడు… ఇక బాబు కోసం కష్టపడుతూ పడుతూ తన కత్తెర్లకు సానపెట్టుకున్నాడు…
చంద్రబాబు ఓడిపోయాక తను సినిమాల్లోకి వెళ్లిపోయాడు… చంద్రబాబు క్యాంపులో సానపెట్టబడిన ఆ కత్తెర్లే ఇప్పుడు తనకు జాతీయ అవార్డు తెచ్చిపెట్టాయి…. హహహ… ఇదంతా సరదాగా చెప్పుకోవడం సరే గానీ… నవీన్ నూలి అన్నిరకాలుగా ఈ అవార్డుకు అర్హుడు… దీన్ని జెర్సీ సినిమా కోణంలోనే చూడాల్సిన అవసరం లేదు… ఇప్పుడు తను తెలుగు ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ బిజీ ఎడిటర్… బోలెడు ప్రతిష్ఠాత్మక సినిమాలకు పనిచేశాడు… ఇప్పుడిప్పుడే ప్రేక్షకులు, రివ్యూయర్లు సినిమాల ఎడిటింగ్ తీరును పట్టించుకుంటున్నారు గానీ గతంలో పెద్దగా ఎవరూ ఎడిటింగ్ ఇంపార్టెన్స్ గుర్తించేవారు కాదు… నిజానికి సినిమాకు ప్రాణాధారమైన అంశాల్లో ఎడిటింగ్ కూడా ముఖ్యమైనదే… ఎడిటింగ్ లోపాలుంటే సినిమా ఫసాక్… ఎడిటింగ్ బాగుంటే అది వాల్యూ ఆడిషన్…
Ads
తను 2012 నుంచీ ఫీల్డులో ఉన్నా… బోలెడు సినిమాలు చేసినా… రంగస్థలం సినిమాతో బాగా అప్లాజ్ వచ్చింది తనకు… ఈ నవీన్‌ను ప్రోమోల నవీన్ అనాలి… తను ఇండస్ట్రీలో చేరిందే ప్రోమో ఎడిటర్‌గా… అప్పటిదాకా థియేటరికల్ ట్రెయిలర్లు తప్ప ఈ ప్రోమోలు, టీజర్లు రాలేదు ఇంకా… ప్రభాస్ మున్నా సినిమాతో ఈ ప్రోమోలు కట్ చేయడం ఊపందుకుంది… ఇప్పుడు అవి లేనిది సినిమాయే లేదు… నవీనే ఐదారు వందల సినిమాలకు టీజర్లు, ట్రెయిలర్లూ చేసి ఉంటాడు బహుశా… ఇప్పుడు టీజర్లు, ట్రెయిలర్లు మాంచి పంచ్‌తో రిలీజ్ అయితే దక్కే పబ్లిసిటీ, క్రియేటయ్యే హైపూ అమూల్యం… ఇది పోస్టర్లు, బ్యానర్ల కాలం కాదు… టీజర్ల కాలం కదా… నాన్నకు ప్రేమతో అనే సినిమా నుంచే పూర్తి స్థాయి ఎడిటర్‌గా నవీన్‌కు మంచి పేరొచ్చింది… కంగ్రాట్స్ నవీన్… మరిన్ని అవార్డులు సాధించాలని ‘ముచ్చట’ శుభాకాంక్షలు…
Share this Article