Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

బహుత్ అచ్చే దిన్… అబీ బాకీ హై భయ్యా…

July 27, 2022 by M S R

Gottimukkala Kamalakar…….   తాజా ఇంగువ తాళింపుతో పాత పచ్చడి:

అచ్ఛేదిన్ ఒస్తయి.

ఆర్జీవీ మంచి సీన్మలు తీస్తడు.

బంగారు తెలంగాణ, స్వర్ణాంధ్రల కలిశే ఒస్తయి…!

మా బాలయ్య బాబు ఆ బా దా అనకుట్ట తడబడకుండ మాట్లాడుతడు. వాళ్ల నాయిన ప్రసక్తి తేడు..!

మా జగన్ సారు ఆంధ్రల అన్ని బ్రాండ్లను అమ్మనిస్తడు..! ఆంధ్రా గోల్డ్ బందైతది..!

మా కేసీఆర్ సారు తెలంగాణాను సంపూర్ణ శాకాహార, మద్యనిషేధ రాష్ట్రాన్ని చేస్తడు…!

తెలుగు రాష్ట్రాలు వరల్డు బ్యాంకుకు అప్పులిస్తయి..!

కరణ్ జోహార్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సచ్చిపొయినందుకు మనస్ఫూర్తిగ ఏడుస్తడు. కంగనా రనౌతు సల్లబడుతది..!

జగను పగను ఇడిశిపెడ్తడు…! హైకోర్టు తిట్టుడు బందు జేస్తది..!

సోనూసూద్ సంపాయిచ్చిన పైసలు జరిన్ని తన కోసం గుడ్క దాసుకుంటడు. సురేష్ బాబు సంపాయిచ్చిన పైసలు జరిన్ని మంది కోసం గుడ్క కర్సు వెడ్తడు..!

డిమానిటైజేషన్ ప్రభావం గానొచ్చి దేశంల తీవ్రవాదం అంతమైతది. రెండువెయిల రూపాయల నోటుకాయితంల ఉన్న కంప్యూటర్ చిప్పు వల్ల బ్లాకుమనీ బైటవడ్తది. ఛప్పన్ ఇంచ్ వాలా ఛాతీని సూసి బయపడి చైనా మన జమీన్ మొత్తం ఎనుకకిస్తది. ఇంగ్లాండు రాణి ఆమె కిరిటాన్ని మన రాష్ట్రపతి కాల్లకాడ వెట్టి మాఫీ అడుగుతది. ప్రైమ్మినిస్టరు ఎనుకకొచ్చిన నెమలి సింహాసనంల కూకుంటడు…!

రోహింగ్యాలు, బంగ్లాదేశోల్లు అందరినీ మమతా బెనర్జీ ఎనుకకు పంపుతది. చర్చీలు, మసీదులు గుడ్క ఎండోమెంట్ డిపార్ట్ మెంట్ కంట్రోల్లకు తీస్కోవాలెనని మోజెస్ చౌదరి మౌన దీక్ష, బుఖారీ భూక్ హర్తాళ్ చేస్తరు…!

కమలహాసన్ అయ్యప్ప మాల ఏసుకుంటడు…!

సంసారుల, సన్నాసుల ముచ్చట చెప్పే యూట్యూబ్ టీవీల టీఆర్పీలు తగ్గుతయ్..!

ఎన్టీరామారావు ఆత్మ నాకు భారతరత్న ఒద్దు మొర్రో అనుకుంట గోలగోల చేస్తది…!

పాకిస్తానుకు పక్క తడుస్తది. ఎనుకకు పోతరు. కాశ్మీరుకు పండిట్లు పొయ్యి ఇంద్ర సీన్మల శిరంజీవి లెక్క నేలను ముద్దాడుతరు. అలవాటు తప్పిన సలి కాబట్కె పెయ్యి, పెదాలు పగులుతయి. ఓ పోరడు సంతోషంల దాల్ సరస్సుల నీళ్లు తాగి డీసెంట్రీ పెట్టి సస్తడు. ఒమర్ అబ్దుల్లా సంతాపం ప్రకటించి ఒమన్ దేశపోల్లు నష్టపరిహారమియ్యాలె నని డిమాండ్ చేస్తడు. నరేంద్రమోదీ ఆరుకిలోల గోధుమపిండి, కిలోన్నర శెనిగపప్పు, కిలో ఉల్లిగడ్డలు, కిలో ఆలుగడ్డలు, ఓ సత్తు కేతిరిల చాయ్ పంపుకుంట టీవీల రెండుగంటలు మాట్లాడుతడు. రాత్రి తొమ్మిది గంటల ఇరవయ్యొక్క నిముషాలకు వంటింట్ల నుండి తలా చెంచాడు నీళ్లు తీసుకొచ్చి బాల్కనీల నుంచి బైటికి పొయ్యాలె, అట్లపోస్తె మంకీపాక్సు తగ్గుతది అని చెప్తడు..!

ఇంకో గంటకు మోదీకి ఆ ఐడియా ఆయనే ఇచ్చిండని ఆర్కే తన వీకెండ్ కామెంట్ల శానా స్ట్రాంగుగ చెప్తడు. శానామంది భక్తులు అట్ల నీళ్లు పొయ్యడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతయని శెప్తరు. పాపం మేధావులు ఫేసుబుక్కుల విమర్శిస్తరు కాని, ఆల్ల పోస్టులకు షానోమ్ ఊర్మిళ, షర్మిల, ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్, లోకేష్, కవిత, నారాయణ, రాఘవులు, మాత్రమే లైకులు కొడతరు…!

ఎవడో ఫేసుబుక్కుల శృంగార కవిత్వం రాస్తడు..! “నా గురించేనా..?” అని ఒకామె కోపంగ అడుగుతది. ఈడు “నీ గురించి కాదు శెల్లే..!” అంటడు. ఆమె “నా గురించి కాదా..?” అని దిగులు పడుకుంట ఫికర్న పడతది..!

పీవీ నర్సిమ్మరావు గొప్పతనాన్ని సోనియాగాంధీ అర్ణబ్ గోస్వామి టీవీల రెండు గంటలశేపు “ద నేషన్ షల్ నో..!” అని చెప్తది..!

నెహ్రూ గుడ్క జరిన్ని మంచిపనులే చేశిండని నడిమిట్ల కలిపిన ఫోన్ల అమిత్ షా చెప్తడు..!

అబిషేక్ బచ్చన్ సోలోహీరో గా చేశిన సీన్మ హిట్టైతది..!

ఇంగ దేశంల ఆర్ధిక నిర్ణయాలు ఫైనాన్స్ మినిస్ట్రీనే తీసుకుంటది. మినిస్టరుకు పని లేకుండ అయ్యింది కాబట్కె మాగాయ, నిమ్మకాయ, ఉసిరికాయ ఊరగాయలు గూడ పెట్టుడు నేర్సుకుంటది…!

గవురుమెంట్లు సెస్సులు, వ్యాట్ రద్దు చేస్తయి..!

ఏక్ నేషన్, ఏక్ ఎడ్యుకేషన్ కింద నాగాలాండోల్లు పెరియార్ గురించి, తమిళనాడోల్లు సంత్ సబ్డాన్ గురించి సదువుకోని ఆత్మనిర్భరత తెచ్చుకుంటరు..!

సీన్మటికెట్ల రేట్లు తగ్గుతయి. పీవీఆర్ మల్టీప్లెక్సుల పాప్ కార్న్ పది రూపాయలకే అమ్ముతరు..!

స్మార్టుఫోన్లల్ల జియో సిమ్మేసుకోని స్కూలు పోరలు పోర్న్ సూడరు..!

కేయేపాల్ బంపర్ మెజారిటీ తోటి గెలిశి అసెంబ్లిల కాలువెడ్తడు…!

జనం గుడ్క శానా మారుతరుల్లా..!
రూపాయకే కిలో బియ్యం ఒద్దంటరు..!
ఓటెయ్యనీకె పైసలు ఒద్దంటరు..!
పథకంల ఆహారం తీసుకున్నందుకు పని చేస్తరు..!
సర్కారు బడికే పిల్లల పంపుతరు..!
ప్రైమరీ హెల్తు సెంటర్ల మందులుంటయి..!
ఉద్యోగస్తులు దొంగ ఎల్టీసీలు పెట్టరు..!
పొద్దూకులు జనం కోసమే పనిజేస్తరు..!

హాకీ ఆటనాడుతుంటే స్టేడియం నిండుతది…!
పోరలు పోస్ట్ మిలాన్ పాటలినుకుంట పోలో సూస్తరు..!

తెలుగు రాష్ట్రాలల్ల ఆడోళ్లు అక్షయ తృతీయ, ధంతేరాస్ అనుకుంట మొగుళ్లను సావగొట్టరు..!

వంటలక్క, డాక్టర్ బాబు కార్తీకదీపం సీరియళ్ళ కలిశిపోతరు..!

పోలీసోల్లు న్యాయం జేస్తరు..!
కోర్టులల్ల కేసులు జల్దీ ఫైసలా అవుతయి..!
పొగాకు కంటె గంజాయి తక్కువ డేంజర్ అని దాన్ని మెడికల్ షాపులల్ల అమ్ముతరు..!
కేఎఫ్సీ కంటే కరీంమియా కబాబ్ లకు గిరాకి పెరుగుతది…!

గది లోపల వళ్లమ్ముకోని బతికే ఆడోళ్ల కాడ, రోడ్డు పక్కన సామాన్లమ్ముకునే మొగోళ్ల కాడ రౌడీలు, లీడర్లు, పోలీసులు హఫ్తా వసూలు చెయ్యరు…!

రైతుకు సబ్సీడీలూ, గిట్టుబాటు ధరలూ దొరికి రైతుబంధు పైసలు వద్దంటరు…!

లక్షల కొద్దీ గొర్రెలను గొర్రెలకు పంచినరు కాబట్కె కిలో మటన్ రెండొందలకే దొరుకుతది..!
తిరుపతి లడ్డూ రుచికి పూర్వవైభవమొస్తది..!

తమిళ శంకరూ, తెలుగు రాజమౌళి సంయుక్త దర్శకత్వంల లోబడ్జెట్ సీన్మా వస్తది..!

స్వచ్ఛందసంస్థలన్ని పేదవాళ్ల కోసమే పనిచేస్తయి..! పైసలున్నోళ్ల ఛారిటీకి పన్ను మినహాయింపులకూ అస్సలు సంబంధముండదు..!

పోలవరం పూర్తయితది..!
హైదరాబాద్ల రోడ్లు బాగయితయి..!

****

నా నెత్తి మీద మల్ల బొచ్చు మస్తుగ పెరుగుతది.

Ads

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఏమాత్రం ధృవీకరణ లేని… ఓ డిటెక్టివ్ స్టోరీ ఫ్రం ఆపరేషన్ సిందూర్…
  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions