.
ముందుగా ఓ సోషల్ మీడియా పోస్టు (వార్త) చదవండి… తరువాత మాట్లాడుకుందాం… సన్ స్ట్రోకుల గురించి… వారసుల అరాచకాల గురించి, అయ్యల అసహాయతల గురించి…
కడప …. *పుట్టా సుధాకర్ యాదవ్* … పుట్టా మహేష్ పై విచారణ జరుగుతున్నందున ఏమి మాట్లాడలేకపోతున్నా… మా అబ్బాయ్ ఎలాంటి తప్పు చెయ్యలేదు… 2021 హార్ట్ ఆపరేషన్ జరిగింది… ఆరోగ్యం కాపాడుకోవాలని డాక్టర్ సూచించారు… ప్రాణాపాయం ఉన్నప్పుడు డ్రగ్స్ ఎలా తీసుకుంటాడు…
Ads
అక్కడ డ్రగ్స్ తీసుకున్న వాళ్లకు 150 నుంచి 200 వరకూ పల్స్ రేట్ ఉంటుంది… కానీ పుట్టా మహేష్ కు ఆరోజు 97 మాత్రమే పల్స్ ఉంది… బ్లడ్ తీసుకోకుండానే పాజిటివ్ ఎలా వచ్చింది… బ్లడ్ రిపోర్ట్ రావాలంటే 48 గంటలు పడుతుంది… యూరిన్ శాంపిల్ తీసుకున్న మొదటి సారి పది నిముషాలలో పాజిటీవ్ అన్నారు, రెండవసారి అయిదు గంటల సమయం తరువాత మళ్ళీ రిజల్ట్ చెప్పారు…
వాస్తవాలను ఆధారాలతో సహా త్వరలో బయటపెడతాం… అధిష్టానంకు అన్ని విషయాలను వివరించాం… అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న విషయం తెలిసి వెళ్లిపోవాలనుకున్నాడు… కానీ కార్ డ్రాప్ చేసి వేరే చోటకు వెళ్లడంతో వెంటనే అక్కడి నుంచి వెళ్ళలేకపోయాడు… (నవ్వకండి, ఓ మెగా కూతురు ఉగాది పచ్చడి కోసం పబ్ డ్రగ్స్ అడ్డాకు పోయింది, మరొకతి బెంగుళూరులో ఆవకాయ పెట్టడానికి వెళ్లింది అనే వార్తలు చదివారు కదా… చదివేవాడు చెప్పే గొంతుకు లోకువ…)
.
ఎయిమ్స్ లో పుట్టా సుధాకర్ కు అన్ని టెస్టు చేయించాం అవి నెగిటివ్ అని వచ్చాయి…’’
ఇదీ సదరు తండ్రి గారి రోదన, వేదన, ఆక్రందన, ఆవేదన…. కాదు, కొడుక్కి సపోర్ట్ చేయకపోతే తరువాత తన గతేమిటో తెలిసిన కాలప్రజ్ఞత…. ఈ యెల్లో బ్యాచుకు బాసు చంద్రబాబు నానా నీతులూ చెబుతాడు… అఫ్‌కోర్స్, జగన్ స్థాయిలో ఇక ఎవ్వడూ తిరుమల వెంకన్నకు ద్రోహం చేయలేడు, అది వేరే సంగతి… అల్టిమేట్ ద్రోహ చతుష్ఠయం..!!
.
మరి సోకాల్డ్ ప్రజెంట్ సనాతన చంచల వీర ధర్మ పరిరక్షకుడు ఏం చేస్తున్నాడు అంటారా..? అదేదో తాజా సినిమా నష్టాల లెక్కల్లో కూరుకుపోయాడు ఫాఫం… అంతకుమించి లోకేష్ ముందుకు రానిచ్చేది లేదు, నెగ్గనిచ్చేదీ లేదు…
.
ఇదంతా చదువుతుంటే, మన బాపు, మన జాతిపిత, మన దేవుడు కేసీయార్ గుర్తొచ్చాడు… ఒరేయ్, నీ పెళ్లాన్ని తీసుకునిరారా అని ఉరిమిన కొత్తగూడెం వీర, బీభత్స కాముకుడు రాఘవ గుర్తున్నాడు కదా… ఐనాసరే, సదరు రాఘవ తండ్రికి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చాడు… అంటే, సదరు రాఘవ అరాచకాలకు పరోక్ష మద్దతు… ఆ అనైతిక పాపానికి ఎన్నికల్లో కొట్టుకుపోయాడు కేసీయార్… పాపం ఫలితం అలాగే ఉంటుంది మరి…
.
ఇప్పుడు పుట్టా మహేష్ తండ్రి సుధాకర్… ఎవరో ఆ ముసలి సీపీఐ నాయకుడు డిమాండ్ చేస్తున్నాడు… ఠాట్, అనైతిక టీటీడీ ఛైర్మన్‌ను తొలగించాలి అని… అలా తీసేస్తే తను చంద్రబాబు ఎలా అవుతాడు..? గతంలో రాసుకుని పూసుకుని తిరిగిన… ఏమాత్రం అలిపిరి దాడి భయం ఇసుమంతైనా లేని ఆ పాత మిత్రుడి గురించి నీకు తెలియనిది ఏముంది వృద్ధ స్వజాతి కామ్రేడ్..?!
అందరూ అందరే… ఒక టీవీ నాయుడు, ఒక పుట్ట సుధాకర్, ఒక కరుణాకర్ రెడ్డి, ఒక సుబ్బారెడ్డి… ఏక్‌సే ఏక్… పాపం, ఆ వెంకన్నకే ఏమీ పాలుపోవడం లేదు… క్షుద్ర ముఖ్యమంత్రుల పాచికలకు కౌంటర్ వేయలేకపోతున్నాడు..!!
.
అవునూ... పింక్ రోహిత్ రెడ్డి అరెస్టు, రిమాండ్... కానీ ఈ మహేశ్ మాత్రం జస్ట్, స్టేషన్ బెయిల్... ఎందుకు..? ఒక్కసారి ఆలోచించండి... అంతా మాయ... అంతా పచ్చ మాయ... ఆరోజు బాబు బామ్మర్ది బాలయ్యకూ, ఇప్పుడు మహేశ్‌కూ సాయపడిన మాటసాయం... సో, క్షుద్ర రాజకీయాల తీరు ఇట్టే అర్థమవుతుంది... చంద్రబాబు నైతికుడేమీ కాదు, తన ప్రత్యర్థులు అంతకన్నా కాదు..!! రేవంత్ రెడ్డి ఈ ఆటలో పావు గాకుండా లేడు..!! ఎవడికీ దేవుడు లేడు, ధర్మం లేదు...
Share this Article